E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode September 11th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్‌   

Nindu Noorella Saavasam Serial Today Episode September 11th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్‌   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: కోతి దారి చూపించడంతో అమర్‌ బంగ్లా దగ్గరకు వెళ్తాడు. అక్కడ రూంలో బంధించిన పిల్లలను మిస్సమ్మను రాథోడ్‌, సరస్వతి వార్డెన్‌ లను చూస్తాడు. వాళ్లు అమర్‌ను చూసి ధైర్యంగా ఫీలవుతారు. మిస్సమ్మ వెంటనే బుజ్జమ్మను ఆ ప్రచండ రూంలోకి తీసుకెళ్లాడని చెప్తుంది. అమర్‌ కోపంగా ప్రచండ పూజలు చేస్తున్న రూంలోకి వెళ్తాడు. పూజ మొత్తం చెడగొట్టి ప్రచండను కొట్టి మంత్రదండాన్ని నేలకేసి కొడతాడు. ప్రచండ కోపంతో అమర్‌ మీదకు వెళ్లితే అమర్‌ కోపంగా ప్రచండను పిచ్చకొట్టుడు కొడతాడు. అప్పుడే పార్థు పోలీసులను తీసుకుని వస్తాడు. ప్రచండను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు.

అమర్‌, పార్థు ఇద్దరూ కలిసి పిల్లలు ఉన్నా రూంలోకి వెళ్తారు. అందరూ బస్సు దగ్గరకు వెళ్లబోతుంటే.. అందరూ ఉన్నారు మనోహరి ఎక్కడ ఉంది అని పార్థు అడిగితే.. మిస్సమ్మ భయంగా తను కూడా వచ్చిందా అని అడుగుతుంది. వచ్చిందని తనతో పాటు మిమ్మల్ని వెతికిందని అమర్‌ చెప్పగానే.. అయితే ఇదంతా మనోహరి ప్లానే అనుకుంటుంది మిస్సమ్మ. మీరంతా బస్సు దగ్గరకు వెళ్లి వెయిట్‌ చేయండి నేను మనోహరిని వెతికి తీసుకొస్తాను అంటాడు పార్థు. సరే అంటూ అమర్‌ అందరినీ తీసుకుని బస్సు దగ్గరకు వెళ్తాడు.  అడవిలో మనోహరిని పిలుస్తూ వెతుకుతుంటాడు పార్థు. పార్థు సౌండ్ విన్న మనోహరి గట్టిగా పార్థును పిలుస్తుంది. పార్థు దగ్గరకు వెళ్లి ముళ్లపొదల్లో ఇరుక్కుపోయిన మనోహరిని చూసి బయటకు లాగేస్తాడు. అసలు నువ్వు ఇక్కడకు ఎందుక వచ్చావు అని అడిగితే.. భాగీ వాళ్లను వెతకడానికి నేను అమర్‌ వచ్చామని అబద్దం చెప్తుంది. పార్తు మాత్రం మనోహరి చెప్పేవని నమ్మేస్తుంటాడు.

Advertisement

మరోవైపు బస్సు దగ్గర నిలబడిన అమర్‌ పిల్లలందరినీ బస్సు ఎక్కమంటాడు. తాను మాత్రం ఏదో ఆలోచిస్తుంటాడు. రాథోడ్‌ దగ్గరకు వెళ్లి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు సార్‌ ప్రచండ అరెస్ట్‌ అయ్యాడు పెద్ద గండం తప్పింది అనగానే… అమర్‌ తాను మనోహరి గురించి ఆలోచిస్తున్నానని చెప్తాడు. మనోహరి గురించి ఏం ఆలోచిస్తున్నారు అని మిస్సమ్మ అడిగితే.. తను నిన్నటి నుంచి తేడాగా ఉందని ఇందాక మిమ్మల్ని వెతుక్కుంటూ ఫారెస్ట్‌లోకి వచ్చినప్పటి నుంచి తన బిహేవియర్‌ తేడాగా ఉందని మీరున్న బంగ్లా దగ్గరకు నేను వచ్చానని అప్పటికే ఆ బంగ్లా చూసిన మనోహరి నన్ను దారి మళ్లించింది అంటూ చెప్పగానే.. రాథోడ్, మిస్సమ్మ మనసుల్లో ఇన్నాళ్లకు మీకు మనోహరి మీద అనుమానం రావడం మంచిదే సార్‌ అనుకుంటారు. సరస్వతి వార్డెన్‌ మాత్రం ఇప్పటికైనా అమర్‌ సార్‌కు మనోహరి గురించి నిజం చెప్పమంటుంది. మిస్సమ్మ మాత్రం వద్దని కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుందని అంటుంది.

అప్పుడే పార్థు, మనోహరిని తీసుకుని అక్కడకు వస్తాడు. అమర్‌ అనుమానంగా మనోహరి నువ్వు ఆ బంగ్లాను చూసి కూడా నన్ను ఎందుకు అటు వైపు వెళ్లకుండా ఇంకోవైపు వెళ్లేలా చేశావు అని అడగ్గానే.. మనోహరి షాక్‌ అవుతుంది. ఏమీ తెలియనట్టు బంగ్లానా ఏ బంగ్లా అమర్‌ అని ఎదురు ప్రశ్నిస్తుంది. మనోహరి మాటలకు రాథోడ్‌, మిస్సమ్మ షాక్‌ అవుతారు. ఎంత ఈజీగా ఎస్కేప్‌ కావడానికి ప్రయత్నిస్తుంది ఈ మనోహరి అని మనసుల్లో అనుకుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Ninnu kori Serial Today Episode September 11th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సర్జరీ తర్వాత గతం మర్చిపోయిన విరాట్ – షాక్ లో చంద్ర 

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..ఆ 4 డోంట్ మిస్..

శ్రీసత్యకి లవ్ ప్రపోజ్ చేసిన హీరో.. అమ్మడి రియాక్షన్?

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొత్తం ఎంతమంది? ఎవరెవరంటే ?

అలీ హోస్ట్ గా మరో కొత్త షో..ఈసారి డబుల్ అల్లరి అంటూ!

బిగ్‌బాస్ హోస్టింగ్‌కు ఇంత డబ్బా? రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!

Big Stories

Advertisement
×