Ninnu kori serial today Episode: విరాట్ కోసం హాస్పిటల్ లో వెతుకుతుంది షాలిని. హాస్పిటల్ రికార్డుల్లో కూడా విరాట్ పేరు లేకుండా చేసి ఉంటాడు డాక్టర్. దాంతో షాలిని విరాట్ గురించి ఏ విషయం హాస్పిటల్‌లో తెలియదు. విరాట్‌ను అంబులెన్స్‌లో తీసుకొస్తుండగానే.. చనిపోయి ఉంటే అనాథ శవం అనుకుని మున్సిపాలిటీ వాల్లకు ఇచ్చారేమో..? అత్తయ్యకు వచ్చిన ఫోన్ కాల్ చంద్ర అరైంజ్ చేసిందేమో అనుకుంటూ హాస్పిటల్ నుంచి వెళ్లిపోతుంది షాలిని.
డాక్టర్, విరాట్‌కు సర్జరీ చేయడానికి తీసుకెళ్తుంటే.. మదన్ ఒక్కసారి చివరి సారి విరాట్ గారి ముఖం చూస్తారా..? అని అడిగితే.. లేదని చివరిసారి నా బావ ముఖం నా మదిలో దాచుకున్నానని చెప్తుంది. డాక్టర్లు ఆఫరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి సర్జరీ చేస్తారు. డాక్టర్ బయటకు వచ్చి సర్జరీ సక్సెస్ అయిందని 48 గంటల్లో పేషెంట్‌ను చూడొచ్చని చెప్తాడు. మదన్ హ్యాపీగా మొత్తానికి ఆపరేషన్ సక్సెస్ అయింది అంటే.. ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదంటుంది చంద్ర. మనం చెప్పకపోయినా బావకు స్పృహ రాగానే అత్తయ్య గురించి అడుగుతాడు. ఇంత పెద్ద నిర్ణయాన్ని నేను మాత్రమే తీసుకోవడం నా దురదృష్టమే అంటూ బాధపడుతుంది.
జగదీశ్వరి ఇంట్లో ఏమీ తినకుండా పడుకుంటుంది. క్రాంతి వెళ్లి అన్నయ్య వెళ్లింది నీకోసమే కదా.. నువ్వు కాళీ కడుపుతో మందులు వేసుకోలేవు కదమ్మా.. కొంచెం జ్యూస్ అయినా తాగు అంటూ జ్యూస్ తాగిస్తాడు క్రాంతి. మరోవైపు హాస్పిటల్ లో ఉన్న చంద్రకు భోజనం తీసుకెళ్తాడు మదన్. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదని చెప్తాడు. చంద్ర మాత్రం తనకు ఆకలిగా లేదని చెప్తుంది.
ఇంట్లో నిద్ర పోతున్న జగదీశ్వరి నిద్రలోంచి ఉలిక్కి పడి లేస్తూ విరాట్ అంటూ అరుస్తుంది. రఘురాం ఉలిక్కి పడి నిద్ర లేస్తాడు. జగదీశ్వరి ఏమైంది అంటూ అడగ్గానే.. విరాట్ వచ్చాడు కదా అంటూ ఏడుస్తుంది.. హాల్లోకి వచ్చి విరాట్‌ను పలవరిస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. చంద్రను అడుగుతుంది విరాట్ వచ్చాడా..? అని రాలేదని చంద్ర చెప్తుంది. అప్పుడే హాస్పిటల్‌లో ఉన్న మదన్, విరాట్ ఫోన్ నుంచి చంద్రకు కాల్ చేసి జగదీశ్వరితో మాట్లాడతాడు. అంతా గమనిస్తున్న షాలిని షాక్ అవుతుంది. విరాట్ నిజంగా చనిపోలేదా..? బతికే ఉన్నాడా..? నిజం ఎలా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది.
మరుసటి రోజు ఉదయం చంద్ర కంగారుగా హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్ ఏమైంది త్వరగా రమ్మన్నారు అంటూ అడగ్గానే.. విరాట్‌కు స్పృహ వచ్చింది. అతని ముఖానికి ఉన్న కట్లు విప్పినప్పుడు ఎదురుగా మీరు ఉండాలని రమ్మన్నాను అంటాడు డాక్టర్. చంద్ర సంతోషంగా ఫీల్ అవుతుంటే.. డాక్టర్ నర్సుతో విరాట్‌ను తీసుకురమ్మని చెప్తాడు. నర్సు తీసుకురాగానే.. డాక్టర్ విరాట్ ముఖానికి ఉన్న కట్లు విప్పి మెల్లగా కళ్లు తెరవండి అని చెప్పగానే.. విరాట్ కళ్లు తెరచి చూస్తాడు. డాక్టర్ ఇప్పుడు మీకు ఎదురుగా ఎవరున్నారో చూడండి అని చెప్పగానే.. చంద్రను చూస్తాడు విరాట్. చంద్ర బావ అంటూ దగ్గరకు వెళ్లబోతుంటే.. ఎవరు మీరు అని అడుగుతాడు.. డాక్టర్ ఎవరు వీళ్లంతా అంటాడు. అద్దంలో తన ముఖం చూసుకుని కోపంతో డాక్టర్ అసలు నేను ఎవరు అంటూ ప్రశ్నిస్తాడు. విరాట్ మాటలకు చంద్ర షాక్ అవుతుంది. మదన్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.