Brahmamudi serial today Episode: కావ్యను కన్వీన్స్ చేసి డాక్టర్ దగ్గరకు వెళ్తాడు రాజ్. తను మొన్న చేసిన గొడవకు సారీ చెప్తాడు. దీంతో డాక్టర్ మీ సిచ్యుయేషన్ నేను అర్థం చేసుకోగలను కానీ రియలైజ్ అయినందకు వెరీగుడ్ ఇంతకీ పేషెంట్ ఎక్కడున్నారు అబార్షన్ కు ముందు నేను తనతో మాట్లాడాలి. తనను మానసికంగా రెడీ చేయాలి అని చెప్తుంది. దీంతో రాజ్ ఈ విషయమే నేను మీతో మాట్లాడాలి డాక్టర్ అందుకే ఒక్కడినే లోపలికి వచ్చాను డాక్టర్ అని చెప్పగానే.. డాక్టర్ ఏంటో చెప్పండి అంటుంది. దీంతో రాజ్ తనకు అబార్షన్ చేస్తున్నట్టు తనకు నేను చెప్పలేదు.. డాక్టర్ అనగానే.. ఏంటి ఇంకా చెప్పలేదా..? ఓకే ఒకసారి లోపలికి పంపించండి నేను మోటివేట్ చేస్తాను అంటుంది డాక్టర్.
వద్దు డాక్టర్ తనుకు ఈ విషయం తెలిస్తే తను అబార్షన్‌కు ఒప్పుకోదు అని రాజ్ చెప్తాడు. ఎందుకు ఒప్పుకోదు అంటూ డాక్టర్ అడగ్గానే.. అది తన వ్యక్తిత్వం డాక్టర్. తనను తాను ఎంతైనా బాధపెట్టుకుంటుంది కానీ ఎదుటి వాళ్లను బాధపెట్టదు. అలాంటిది ఇప్పుడు తన ప్రాణం కోసం బిడ్డను వదులుకుంటుంది అంటే ఎలా వదులుకుంటుంది చెప్పండి అంటాడు రాజ్. దీంతో డాక్టర్ మీరు ఎన్నైనా చెప్పండి ఈ రోజుల్లో అమ్మాయికి తెలియకుండా అబార్షన్ చేయడం చాలా పెద్ద నేరం ఇలాంటి పరిస్థితుల్లో కండీషన్ క్రిటికల్ గా ఉంటేనే ఈ ఆపరేషన్ చేస్తాం.. అలాంటి విషయాన్ని పేషెంట్‌కు చెప్పకపోవడం ఏంటండి అంటుంది డాక్టర్. నేను తన భర్తనే కదా డాక్టర్ నేను చెప్తున్నాను కదా అంటూ రాజ్ చెప్పగానే.. రేపు ఆమె తన బిడ్డను ఎందుకు చంపేశారని కోర్టుకు వెళితే నా ప్రాక్టీష్‌తో పాటు హాస్పిటల్ కూడా మూసుకోవాల్సి వస్తుంది అంటూ డాక్టర్ చెప్పగానే..
మీరు అనుకుంటే అవుతుంది డాక్టర్ చాలా ఈజీగా అవుతుంది. మీరు రూల్స్ అంటూ భయపడతున్నారు. ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను.. కావాలంటే ఇలాంటి హాస్పిటల్ ఒకటి కట్టిస్తాను అంటూ రాజ్ బతిమాలుతుంటే డాక్టర్ మీరు ఎన్ని చెప్పినా సరే నేను ఒప్పుకోను అంటుంది. దీంతో రాజ్ ఫ్లీజ్ డాక్టర్ అలా అనకండి తనకు నిజం తెలిసే లోపే ఈ అబార్షన్ అయిపోవాలి కావాలంటే నేను మీ కాళ్లు పట్టుకుంటాను.. అంటూ డాక్టర్ కాళ్లు పట్టుకోబోతుంటే.. అప్పటికే డోర్ దగ్గర కావ్య నిలబడి ఉంటుంది. కావ్యను చూసిన రాజ్ షాక్ అవుతాడు. కావ్య కోపంగా రాజ్ దగ్గరకు వెళ్లి తిడుతుంది. గల్లా పట్టుకుని చెప్పండి నాకెందుకు ఇంత అన్యాయం చేయాలనుకున్నారు.. అంటూ నిలదీస్తుంది.
దీంతో రాజ్ అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కళావతి నువ్ఉవ నన్ను నమ్ముతున్నావా లేదా..? నేను నిన్ను మనఃస్పూర్తిగా ప్రేమిస్తున్నానని నమ్ముతున్నావా..? అని అడగ్గానే.. కావ్య నమ్ముతున్నాను అని చెప్పగానే.. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయి కళావతి.. నెల తప్పలేదు అనుకుంటావో..అసలు ప్రెగ్నెంట్ కాలేదని అనుకుంటావో కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయ్ అంటాడు రాజ్. దీంతో కావ్య ఎందుకు చేయాలి.. నా ప్రాణాలైనా తీసుకుంటాను కానీ ఈ అబార్షన్ చేయించుకోను ఏదైనా మార్చుకోవాలంటే.. అది మీ నిర్ణయమే మార్చుకోండి నేను మాత్రం అబార్షన్ చేయించుకోను అంటూ కరాకండిగా చెప్పి కావ్య వెళ్లిపోతుంది. రాజ్ వెనకాలే వెళ్తాడు.
ఇద్దరూ ఇంటికి వెళ్తారు.. హాల్లోకి వెళ్లగానే.. రాజ్, కావ్య చేయి పట్టుకుని కళావతి నేను చెప్పింది చేయ్ అంటూ అరుస్తుంటాడు. ఇంతలో అందరూ వస్తారు. ఏమైందిరా అలా అరుస్తున్నారు అని అడుగుతారు. దీంతో కావ్య అడుగుతున్నారు కదా నువ్వు చెప్తావా.? నన్ను చెప్పమంటావా..? అంటుంది. ఇంద్రాదేవి కోపంగా కావ్య ఏమైంది.. మమ్మల్ని కంగారు పెట్టకుండా ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది. దీంతో కావ్య ఏడుస్తూ.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపేయాలనుకుంటున్నాడు మీ మనవడు అని కావ్య చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఏంటే నువ్వు చెప్పేది అంటూ షాకింగ్ గా అడుగుతుంది ఇంద్రాదేవి…
నా మాట మీద నమ్మకం లేకపోతే మీ మనవణ్ని అడగండి.. ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడో అడగండి అంటుంది కావ్య. దీంతో అపర్ణ, ఇంద్రాదేవి కోపంగా రాజ్‌ను తిడతారు.. నిజం చెప్పు అంటూ నిలదీస్తారు. దీంతో రాజ్ అవునమ్మా నా బిడ్డను చంపుకోవాలనే దీనికి అబార్షన్ చేయించాలనుకున్నాను అంటాడు. ఇంతలో ఆఫీసు నుంచి వచ్చిన సుభాష్ కూడా రాజ్ ను తిడతాడు. ఎవరెంత తిట్టినా.. కన్వీన్స్ చేయాలని చూసినా రాజ్ మనసు మార్చుకోడు.. దీంతో తండ్రిగా ఆ బిడ్డ మీద మీకు ఎంత హక్కు ఉందో తల్లిగా నాకు అంతే హక్కు ఉంది. ఎందుకు వద్దంటున్నారో నాకు కారణం చెప్పి తీరాలి అంటుంది.
దీంతో రాజ్ కోపంగా చెప్పడం కుదరదు అంటాడు. అయితే మీరు కోరుకుంటున్నట్టుగా జరగదు.. అంటుంది కావ్య.. చేసి తీరాలి.. అంటాడు రాజ్. ఇలా ఇద్దరి మధ్య గొడవ జరగుతుంటే అపర్ణ ఏడుస్తూ.. రాజ్‌ను తిడుతుంది. దీంతో రాజ్ కోపంగా నువ్వే నిర్ణయం తీసుకుంటావో లేకపోతే ఇంట్లో వాళ్లను ఒప్పించి రేపు నాతో పాటు హాస్పిటల్ కు వస్తావో డిసైడ్ చేసుకో అంటూ రాజ్ వెళ్లిపోతాడు. దీంతో అందరూ ఏడుస్తుంటారు.
తర్వాత రూంలోకి వెళ్లి రుద్రాణి ఇల్లు వదిలేసి వెళ్లిపోతాను అంటూ బట్టలు సర్దుతుంది. ఇంతలో రాహుల్ వచ్చి ఏంటమ్మా బట్టలు సర్దుతున్నావు అని అడుగుతాడు. ఆ రాజ్ గాడు ఇచ్చే ట్విస్టులు భరించేకంటే.. ఇల్లు వదిలి పోవడమే బెటర్ అంటుంది రుద్రాణి. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.