Illu Illalu Pillalu Serial Today Episode: ఇంటి ముందు నిలబడి గట్టిగా ఈల వేస్తుంది వేదవతి. దీంతో నర్మద భయపడుతూ అత్తయ్యా మామయ్య వస్తారు అంటుంది కానీ అదేమీ పట్టించుకోకుండా గట్టిగా ఈల వేస్తూనే ఉంటుంది వేదవతి. తర్వాత నర్మదను హగ్ చేసుకుని సంతోషంగా నవ్వుతుంది. ఈ సంతోషాన్ని ఎంతసేపటి నుంచి ఆపుకుంటున్నానో తెలుసా..? అంటూ కేకలు పెడుతుంది. ఇద్దరూ కలిసి సాంగ్స్ పాడుతూ డాన్స్ చేస్తుంటారు.
ఇక ధీరజ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని మళ్లీ ఒకసారి దీరజ్ చెప్పిన మాటలు వేదవతి చెప్తుంది. అన్ని విషయాలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది వేదవతి. ధీరజ్ మాటలు విన్నాక నా భయం మొత్తం పోయింది అంటూ నర్మదతో సంతోషాన్ని పంచుకుంటుంది. వాళ్లకు ఒకరి మీద ఒకరికి పుట్టిన ప్రేమ ఇద్దరినీ నూరేళ్లు కలిసి బతికేలా చేస్తుంది అంతే.. ప్రేమ, ధీరజ్‌ల పెళ్లి మనమే చేశాం అని మీ మామయ్యకి తెలిసిపోతుందని చాలా భయపడ్డా కానీ ధీరజ్ మీ మామయ్యకి ఏ అనుమానం రాకుండా మాట్లాడాడు. అంటూ సంతోసిస్తుంది.
మరోవైపు ధీరజ్, ప్రేమ బాధపడుతూ కూర్చుని ఉంటారు. ప్రేమ తన గురిచి ధీరజ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ధీరజ్‌ను చూస్తూ నవ్వుకుంటుంది. హ్యాపీగా ఫీలవుతూ వెళ్లి భోజనం తీసుకుని వచ్చి ధీరజ్ కు ఇస్తుంది. అన్నం తినమని చెప్తుంది. ధీరజ్ ఇప్పుడు వద్దని చెప్పగానే.. మరి ఎప్పుడు తింటావు రేపా ఎల్లుండా అని అడుగుతుంది. ధీరజ్ చూడగానే.. ఏంటి అలా చూస్తున్నావు అంటూ ఎమోషనల్ అవుతుంది ప్రేమ. ఇక ప్రేమ ఎంత చెప్పినా ధీరజ్ మాత్రం భోజనం చేయనని మారాం చేస్తాడు. దీంతో ప్రేమ కూడా తాను భోజనం చేయనని చెప్పడంతో భోజనం చేయడానికి ధీరజ్ ఒప్పుకుంటాడు.
ఇద్దరూ కలిసి ప్రేమగా భోజనం చేస్తుంటారు. ప్రేమ నవ్వుతూ ధీరజ్‌ను చూస్తూ.. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. ఎందుకు అలా అడిగావ్ అని ధీరజ్ అంటే నువ్వు ఇందాక నన్ను ప్రేమిస్తున్నానని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటానని చెప్పావు.. అయితే ఆ కల్యాణ్ సమస్య నుంచి నన్ను సేవ్ చేయడానికి మామయ్యతో అలా చెప్తున్నావు అనుకున్నాను కానీ తర్వాత అర్థం అయింది. నువ్వు మనఃస్పూర్తిగా చెప్తున్నావని.. ఆ క్షణం నీ కళ్లలో అబద్ధం కనిపించలేదు. గొడవల్లో ప్రేమ పుడుతుందని నువ్వే చెప్పావు.. అది నిజం కాకపోతే నీ నోటి నుంచి ఆ మాట రాదు అని నేను అనుకుంటున్నాను అంటూ ప్రేమ చెప్పగానే.. ధీరజ్ అయోమయంగా చూస్తుంటాడు.
సేన కోపంగా చూస్తుంటాడు. తన కూతురు మీద నింద వేశారని ఆవేశ పడుతుంటాడు. నా కూతురి మీద అంత పెద్ద నింద వేస్తారా.. ఎలా పెంచుకున్నాను నా కూతుర్ని.. వ్యక్తిత్వంలో ఆకాశం అంత ఎత్తులో పెంచుకున్నా అలాంటి నా కూతురి మీద బురద జల్లుతారా అంటూ సీరియస్ అవుతుంటాడు. దీంతో వాళ్ల కొడుకు విశ్వ చాలా కూల్‌గా నాన్న నువ్వు బాధపడకు అని చెప్పగానే మరింత కోపంగా బాధపడకుండా ఎలా ఉంటాను..
ఆ రామ రాజు గాడు ఎంత..? వాడి బతుకు ఎంత.. మనం బిచ్చం వేస్తే తిని బతికినోడు వాడు మన ఇంటి బిడ్డ మీద నింద వేస్తాడా.. అంటూ కోప్పడుతుంటే.. విశ్వ కూడా నాన్నా నీ చెల్లెలి విషయంలో నువ్వేం చేయలేకపోయావు.. కానీ నా చెల్లెలు విషయంలో నేను తప్పకుండా బదులు తీర్చుకుంటాను.. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను నాన్నా నేను అంటూ విశ్వ చెప్పడంతో సేన షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.