Bigg Boss 10: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 ఎట్టకేలకు సెప్టెంబర్ 6వ తేదీన చాలా గ్రాండ్ గా ప్రారంభం అయింది. 10 మంది సెలబ్రిటీలు 6 మంది అగ్ని పరీక్ష సీజన్ 2 ద్వారా కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక సెప్టెంబర్ 8వ తేదీకి సంబంధించి రెండవ ఎపిసోడ్ మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. సీజన్ ప్రారంభం అయిందో లేదో అప్పుడే తమ బలాలను నిరూపించుకుంటూ ఎవరికి వారు తమ గేమ్స్ మొదలు పెట్టారని చెప్పాలి.
ఇకపోతే లేటెస్ట్ గా విడుదల చేసిన మొదటి ప్రోమోలో కంటెస్టెంట్స్ మధ్య ఫైర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా కామనర్ రోహిత్ నాయుడు (Rohit Naidu) పై కృష్ణుడు (Krishnudu) ఫైర్ అయిన తీరు షోపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రోమో విషయానికి వస్తే.. గ్రూప్లో ఉన్న 16 మందిలో 8 మందిని రెడ్ టీమ్ గా, 8 మందిని బ్లూ టీం గా విడగొట్టారు. ఇక రెడ్ టీంలో అమన్ మసూద్, ఝాన్సీ, చైత్ర రాయ్, టెంపర్ వంశీ , శ్రిష్టి, ఆర్ జె చరణ్, రోహిత్ నాయుడు, షాలిని రెడ్ టీంలో ఉండగా.. ఇక బ్లూ టీం లో ముఖేష్ ఋషి, కృష్ణుడు, నరేష్, వర్షిని, సుధీర్, రాంప్రసాద్, త్రిగున్, దేబ్జానీ లను మరో టీమ్ విడగొట్టారు. ఇలా రెండు గ్రూపులు ఇప్పుడు ఆటకు సిద్ధం అయ్యాయి.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ మాట్లాడుతూ.. బోర్డుపై రెడ్ టీం సభ్యుల ఫోటోలు ఉన్నాయి.. హౌస్ మేట్ గా మారడానికి అనర్హులని మీరు భావిస్తున్న ఐదుగురు ఎవరో స్పష్టమైన కారణం చెప్పి వారి ఫోటోలపై గుచ్చాలి అంటూ బిగ్ బాస్ చెబుతాడు. బ్లూ టీం తరఫున ఒక్కొక్కరు ఒక్కో ఫోటో పై గుచ్చారు. ఇక వర్షిని రోహిత్ నాయుడు ఫోటోపై గుచ్చి.. అగ్ని పరీక్షలో అందరూ అతడిని లేపి లేపి పైన కూర్చోబెట్టారు. సార్ గారు అక్కడే ఉన్నారు. దిగి రాలేదు.. అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో ఫోటో పై గుచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇక అవకాశాన్ని రెడ్ టీం కి కూడా ఇచ్చారు బిగ్ బాస్. అందులో రోహిత్ నాయుడు వర్షినిను కూడా టార్గెట్ చేసి తనదైన శైలిలో కామెంట్ చేశారు.
also read:వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’లోకి ఎన్టీఆర్ ఎంట్రీ?
ఇక ఆఖరిగా రోహిత్ నాయుడు కృష్ణుడు తో మాట్లాడుతూ.. టాస్క్ లో మీ గివ్ అప్ ఆటిట్యూడ్ అనేది కరెక్ట్ కాదు అంటూ చెప్పగానే కృష్ణుడు నేను 100% ఇవ్వలేదనా.. యువర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ బికమింగ్ ఏ లీడర్ (లీడర్ అయ్యే కెపాసిటీ నీకు లేదు) అంటూ తనదైన శైలిలో ఫైర్ అయ్యాడు. నువ్వు నాకు ఎలా ఆడాలో చెబుతున్నావ్.. అంటే నువ్వు రాజు మేము సైనికులమా అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.