Big tv Kissik Talks: బిగ్ టీవీ(Big Tv) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా కామన్ మ్యాన్ గా బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లోకి వెళ్లి విజేతగా బయటకు వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వర్షా పల్లవి ప్రశాంత్ ను ఎన్నో విషయాల గురించి అడిగి సమాధానాలు రాబట్టరు. తన వ్యవసాయం గురించి, బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశాల గురించి అలాగే బిగ్ బాస్ తర్వాత జరిగిన గొడవ, అరెస్టు గురించి కూడా ఈ సందర్భంగా ప్రశ్నలు వేశారు.
అంతా నా తల రాత..
ఇక బిగ్ బాస్ ఫినాలే రోజు జరిగిన గొడవ కారణంగా పల్లవి ప్రశాంత్ అరెస్టు(Arrest) అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ గొడవ ఎవరు చేశారో తనకు తెలియదని, అది ఎవరైనా సరే కర్మ వారిని వదిలిపెట్టదు అంటూ ఈ సందర్భంగా ప్రశాంత్ తెలియజేశారు. ఇక బిగ్ బాస్ తర్వాత కప్పు గెలుచుకొని ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్లిన ఈయన వెంటనే అరెస్టయి జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఇలా అరెస్టు గురించి వర్ష ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ అంతా తలరాత ఇక్కడ ఏమి రాసుంటే అదే జరుగుతుంది.
జీవితంలో మర్చిపోలేను…
తాను జైలుకి వెళ్లి నాలుగు రోజులు ఉన్నానని జైలులోకి వెళ్లిన తర్వాత అన్నా బిగ్ బాస్ లో ఎవరు విజేత అంటూ నన్నే అడగడం తట్టుకోలేకపోయాను అంటూ ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అదేవిధంగా తాను జైలుకు వెళ్లడంతో తన తండ్రి బెయిల్ కోసం కోర్టు మెట్ల దగ్గర పడుకోవడం నేనెప్పటికీ మర్చిపోలేను అంటూ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ పల్లవి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక అమర్ తో ఫ్రెండ్షిప్ గురించి అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ రతికి గురించి ఈ ప్రోమో వీడియోలో పల్లవి ప్రశాంత్ మాట్లాడినట్టు తెలుస్తోంది.
తన జీవితంలో తాను జైలుకు కూడా వెళ్లి వచ్చానని జైలు జీవితం ఎలా ఉందో చూసాను అలాగే చావు అంచుల వరకు కూడా వెళ్లి వెనక్కి తిరిగి వచ్చాను అంటూ తనకు జరిగిన ప్రమాదం గురించి కూడా ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ తెలియజేశారు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన తరువాత పల్లవి ప్రశాంత్ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. ఈయన ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయడమే కాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ యూట్యూబ్ వీడియోలు చేస్తున్న ఈయన ప్రస్తుతం సెలబ్రెటీ హోదా అనుభవిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా పల్లవి ప్రశాంత్ ఇంకా ఎలాంటి విషయాల గురించి మాట్లాడారనేది తెలియాలి అంటే శనివారం బిగ్ టీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ లో పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది అప్పటివరకు వేచి చూడాలి.
Also Read: Babu Mohan: ఫ్రెండ్షిప్ డే స్పెషల్… కోటాను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న బాబు మోహన్!