OTT Movie : తమిళ నటుడు సంతానం నటించిన ఒక హిలేరియస్ తమిళ కామెడీ హారర్ సినిమా కేక పెట్టిస్తోంది. ఈ స్టోరీ ఒక హంటెడ్ హౌస్ లో జరుగుతుంది. కొంచెం నవ్విస్తూ, కాస్త భయపెట్టిస్తూ ఈ స్టోరీ ఇంట్రెస్టింగా సాగుతుంది. ఇది కామెడీ హారర్ సినిమాలను ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ వన్-టైమ్ వాచ్. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జీ 5లో స్ట్రీమింగ్
‘డిడి రిటర్న్స్’ (DD Returns) 2023లో విడుదలైన తమిళ కామెడీ హారర్ సినిమా. దీనికి తొలిసారిగా ఎస్. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. సి. రమేష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం, ధిల్లుకు ధుడ్డు ఫ్రాంచైజీలో మూడవ చిత్రంగా, ధిల్లుకు ధుడ్డు 2కి సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమాలో సంతానం (సతీష్‌గా), సురభి (సోఫియాగా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2023 జూలై 28న థియేటర్లలో విడుదలై, 2023 సెప్టెంబర్ 1న ZEE5లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇది తెలుగు, మలయాళం, కన్నడ డబ్బింగ్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. తెలుగులో డిడి రిటర్న్స్: భూతాల బంగ్లాగా విడుదలైంది. IMDbలో ఈ సినిమా 6.2/10 రేటింగ్ సాధించింది.
స్టోరీలోకి వెళితే
ఈ కథ 1962లో పాండిచ్చేరి సమీపంలోని ఒక ఫ్రెంచ్-ఇండియన్ కుటుంబం నడిపే గ్యాంబ్లింగ్ డెన్‌తో మొదలవుతుంది. ఈ కుటుంబం “విన్ ఆర్ రన్” అనే భయంకరమైన గేమ్ ను నిర్వహిస్తుంది. ఈ గేమ్ రూల్ ప్రకారం ఇక్కడ ఓడిపోయిన గ్యాంబ్లర్‌లను హత్య చేస్తారు. ఈ క్రూరమైన చర్యలకు ఆగ్రహించిన గ్రామస్తులు ఆ కుటుంబాన్ని, ఆ భవనాన్ని నాశనం చేస్తారు. ఆ కుటుంబం ఆత్మలుగా మారి, ఆ శిథిలమైన భవనంలోనే ఉంటారు.
కట్ చేస్తే, ప్రస్తుత కాలంలో, సతీష్ (సంతానం) ఒక ఈవెంట్ మేనేజర్. తన ప్రేమికురాలు సోఫియా (సురభి)తో ఉంటాడు. సోఫియా సోదరి, బెన్నీ అనే డాన్ కొడుకు అన్బరసుతో వివాహం ఫిక్స్ అవుతుంది. కానీ బెన్నీ చివరి నిమిషంలో సోఫియాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సోఫియా కుటుంబం దీనిని తిరస్కరించడంతో, తనకు అప్పుగా ఉన్న 25 లక్షలు రుణం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఈ సమయంలో రెండు దొంగల గ్యాంగ్‌లు అన్బరసు డబ్బు బ్యాగ్‌ను దొంగిలిస్తాయి. ఒక కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌లో, ఈ బ్యాగ్ సతీష్ చేతుల్లోకి చేరుతుంది. సతీష్ ఆ డబ్బును సోఫియా కుటుంబ అప్పును తీర్చడానికి ఉపయోగించాలనుకుంటాడు. కానీ అన్బరసు ఆడబ్బులు తన సొంత డబ్బుగా గుర్తించి సోఫియాను బందీగా చేస్తాడు. ఆ బ్యాగ్‌ను తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తాడు.
Read Also : 12 ఏళ్ల అమ్మాయి ప్రెగ్నెంట్… హాకీ ఆడడానికి వెళ్లి… ఈ డైరెక్టర్ గట్స్‌కు దండం పెట్టాలి సామీ