Ustaad Bhagat Singh : గౌతమ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమా జులై 31న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూస్ మొదలుకానున్నాయి. ఈ తరుణంలో చిత్ర యూనిట్ బీభత్సంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆడియో లాంచ్ చాలా అద్భుతంగా జరిగింది. అన్నిటిని మించి అనిరుద్ పర్ఫామెన్స్ ఆడియో లాంచ్ కి హైలైట్ అని చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ కూడా మంచి సక్సెస్ సాధించింది.
ఉస్తాద్ సెట్స్ లో కింగ్డమ్ యూనిట్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రేపు రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో కింగ్డమ్ యూనిట్ అంతా కూడా షూటింగ్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ విషయాన్ని అధికారికంగా రివిల్ చేశారు. చిత్ర యూనిట్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగి బెస్ట్ విషెస్ అందుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం విపరీతంగా చేస్తున్నాడు వంశీ. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత ఇలా సెట్స్ కెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడం అనేది ఇంకొంచెం హైప్ తీసుకొస్తుంది.
It all comes full circle and this is a POWER PACKED MOMENT for the #Kingdom family receiving wishes from the man himself 💥💥
Team had the privilege of meeting @PawanKalyan garu today on the sets of #UstaadBhagatSingh where he graciously conveyed his best wishes to the entire… pic.twitter.com/MO9BqNjiQg
— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2025
హరిహర వీరమల్లు వల్లనే డిలే
కింగ్డమ్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చాలా లేటుగా రిలీజ్ చేశారు. దీని కారణం జులై 24న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కావడమే. ఆ సినిమా రిలీజ్ అవ్వడం వలన కింగ్డమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాత కింగ్డమ్ సంబంధించిన అప్డేట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా నాగ వంశీ రీసెంట్ గా ప్రెస్ మీట్ లో తెలియజేశారు.
Also Read: Naga Vamsi: రామ్ చరణ్ కథను విజయ్ చేశాడా ? వార్ 2 గురించి క్లారిటీ ఇచ్చిన నాగ వంశీ