Priyanka -Shiva Kumar: బుల్లితెర నటీనటులుగా ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న వారిలో ప్రియాంక జైన్(Priyanka Jain), శివకుమార్(Shiva Kumar) జంట ఒకటి. వీరిద్దరూ మౌనరాగం(Mounaragam) అనే సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సీరియల్ ద్వారా ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సీరియల్ సమయంలోనే ప్రియాంక, శివకుమార్ ఇద్దరు ప్రేమలో పడటం జరిగింది. ఇలా ఐదు సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నామని తెలియజేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలు, సీరియల్స్ అంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న వీరిద్దరూ యూట్యూబ్ ఛానల్ లో కూడా నిత్యం ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఐదేళ్లుగా ప్రేమ ప్రయాణం..
ఇకపోతే ఇటీవల కాలంలో శివకుమార్, ప్రియాంక వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరూ తమ ప్రేమ గురించి అలాగే ప్రపోజల్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. శివకుమార్ గురించి ప్రియాంక మాట్లాడుతూ… మౌనరాగం సీరియల్ సమయంలో శివకుమార్ ఎవరితోనో అసలు మాట్లాడేవారు కాదని తెలిపారు. ఏదో మాట వరసకు హాయ్ అంటే హాయ్ అని చెప్పేసి మొబైల్ లో మునిగి తేలేవారని తెలిపారు.ప్రియాంక తన గురించి ఇలా చెప్పడంతో వెంటనే శివకుమార్ స్పందిస్తూ..
ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ లో కంప్లైంట్…
నేను షూటింగ్ లొకేషన్లో ఈమెతో సరిగా మాట్లాడలేదని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి నామీద కంప్లైంట్ ఇచ్చిందని అసలు విషయం తెలిపారు. ఆయన నాకు ఫోన్ చేసి ఏంటీ శివ్ హీరోయిన్ నీకు నచ్చలేదా? అంటూ అడిగారు. నచ్చిందని నేను సమాధానం చెప్పడంతో ఎందుకని మరి ఆమెతో మాట్లాడలేదంట అంటూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేసినట్లు తెలిపారు. ఇలా హీరో హీరోయిన్ ఇద్దరు ఏ విషయం గురించి అయినా ఫ్రీగా మాట్లాడితేనే సీరియల్స్ లో నటించడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుందని ప్రియాంక తెలిపారు. ఇక ఈ సీరియల్ చివరి దశ వరకు కూడా శివకుమార్ నాతో సరిగా మాట్లాడలేదని ఇక సీరియల్ 5 నెలలలో పూర్తి అవుతుందన్న సమయంలో నాతో బాగా మాట్లాడారని ప్రియాంక తెలిపారు..
లవ్ ప్రపోజ్ చేసిన ప్రియాంక…
ఇక మీ ఇద్దరిలో ఎవరు ముందుగా ప్రపోజ్ (Prapose) చేశారనే ప్రశ్న కూడా వీరికి ఈ సందర్భంగా ఎదురయింది. ఈ ప్రశ్నకు శివకుమార్ సమాధానం చెబుతూ ఓ రోజు తను నాకు ఫోన్ చేసి క్యాజువల్ గా మాట్లాడింది. ఇక ఫోన్ పెట్టేసే టైంలో ఐ “లవ్ యు అంటూ ప్రపోజ్ “చేసిందని శివకుమార్ తెలిపారు. ఆమె అలా ప్రపోజ్ చేసేసరికి నేనేం సమాధానం చెప్పాలో తెలియక “నువ్వంటే కూడా నాకు ఇష్టం, అయితే కొంత సమయం కావాలని” శివకుమార్ చెప్పారట. అయితే శివకుమార్ అలా చెప్పడంతో ఏంటి నేను ఇతనికి నచ్చలేదా అని చాలా ఏడ్చేసాననీ, తరువాత కొద్ది రోజులకు తన లవ్ యాక్సెప్ట్ చేశారు అంటూ తమ ప్రేమ గురించి ఈ సందర్భంగా శివకుమార్, ప్రియాంక జైన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: వెంకీ ఫైట్ సీన్ కాపీ కొట్టిన బాలయ్య.. ఇదిగో ప్రూఫ్