BigTV English

Ranjith: సైకిల్ పై ప్రపంచ యాత్ర చేస్తుంటే కిడ్నాప్.. ఇతడు చెప్పింది చదివితే చెమటలు పడతాయ్!

Ranjith: సైకిల్ పై ప్రపంచ యాత్ర చేస్తుంటే కిడ్నాప్.. ఇతడు చెప్పింది చదివితే చెమటలు పడతాయ్!

వరల్డ్ సైకిలిస్ట్ రంజిత్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సైకిల్ మీద జిల్లాలు, రాష్ట్రాలతో పాటు దేశాలు తిరిగి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, తన సైకిల్ యాత్ర మొదలు పెట్టిన తొలి రోజుల్లో, ఇంకా చెప్పాలంటే కరోనా లాక్ డౌన్ అనౌన్స్ చేసిన సమయంలో తనను ఓ ముఠా కిడ్నాప్ చేసేందుకు ఎలా ప్రయత్నించింది? వారిని నుంచి ఎలా బయటపడ్డాడు? అనే విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించాడు.


కేరళ నుంచి గోవా సైకిల్ యాత్ర చేస్తుండగా కిడ్నాప్!  

“కేరళ నుంచి గోవా సైకిల్ యాత్ర చేస్తున్న సమయంలో కరోనా లాక్ డౌన్ పడింది. నెమ్మదిగా కర్నాటకలోకి అడుగు పెట్టాను. మురుదేశ్వర్ దాటి గోకర్ణకు వెళ్లగానే కొంత మంది నన్ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. డీప్ ఫారెస్ట్ లో 10 కిలో మీటర్లు వెళ్లగానే ఓ వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడికి వెళ్లాను. కాసేపు స్విమ్మింగ్ చేశాను. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వాళ్లు కూడా అక్కడ ముఖం కడుక్కున్నారు. అందులో ఒకరు తెలుగు, ఇద్దరు కన్నడ మాట్లాడుతున్నారు. వాళ్లు ఫ్రెండ్స్ అయ్యారు. పైకి వెళ్లే సరికి సైకిల్ పంక్చర్ అయ్యింది. వాళ్లు నాకు హెల్ప్ చేస్తా అన్నారు. లాక్ డౌన్ ఉంది కాబట్టి 40 కిలో మీటర్లు వెళ్తే పంక్చర్ వేయించుకోవచ్చు అన్నారు. వాళ్ల దగ్గర మినీ వ్యాన్ ఉంది. నా సైకిల్ వాళ్ల వ్యాన్ పైన ఉంచి తాడు కట్టారు. నా సమాన్లు వ్యాన్ లో పెట్టారు. నన్ను ముందు కూర్చో అన్నారు. వెళ్తున్నాం. నేను అదే సమయంలో వీడియో తీస్తున్నాను. నా ఫోన్ తీసుకుని వాళ్లు ఫోటోలు కూడా తీసుకున్నారు. అలా సాయంత్రం వరకు తిప్పారు. అడవిలోపలికి తీసుకెళ్లారు. నన్ను అడవిలో వదిలేసి వాళ్లు పారిపోవాలి అనుకున్నారు. కానీ, నేను వారిలో ఒకరి వెంటనే తిరుగుతున్నాను. నన్ను వదిలించుకోవడం కష్టం అనుకున్నారు. సాయంత్రం అయ్యింది” అని చెప్పుకొచ్చాడు.


ముందు జాగ్రత్తగా ఫోటోలు వాట్సాప్ చేశా!

“సాయంత్రం అయ్యాక వాళ్లు నన్ను ఏదో చేస్తారని అనుమానం కలిగింది. ఆ వ్యాన్ ఫోటోలు తీసి ఇంటికి పంపించాను.రాత్రి అయ్యింది ఇంకా వదిలియడం లేదు. బిర్యాని తెస్తామని చెప్పి వెళ్లారు. నా బ్యాగులు, సైకిల్ అన్నీ తీసుకుని వెళ్లారు. కాసేపటికి నా దగ్గర ఉన్న వ్యక్తి నా ఫోన్ కొట్టేసేందుకు తీసుకుని పారిపోయాడు. దగ్గర్లోనే వ్యాన్ ఉంది. ఎక్కాడు. నాకు బాయ్ అని చెప్పి వెళ్లారు. మీరు వెళ్లండి దొరుకుతారని అని నేను చెప్పాను. ఆ తర్వాత అరగంటకు ఓ వ్యక్తి వచ్చాడు. అతడికి తెలుగు వచ్చు. ఆయనకు విషయం చెప్పాను. మా ఇంటికి పంపిన ఫోటోలు, వ్యాన్ నెంబర్, సెల్ నెంబర్ తీసుకుని కాల్ చేశాను. పోలీస్ కంప్లైంట్ చేస్తానని చెప్పాను. వాళ్లు నమ్మడం లేదు. కానీ, నా యూట్యూబ్ ఓపెన్ చేసి చూపించాను. అప్పుడు వాళ్లు నా ఫిర్యాదు తీసుకుని వాళ్లను రాత్రి 2 గంటలకు పట్టుకుని స్టేషన్ లో వేసి కోటింగ్ ఇచ్చారు. ఆ వీడియోలను కూడా నేను యూట్యూబ్ లో పెట్టాను. అలా వారి నుంచి తప్పించుకున్నా” అని చెప్పుకొచ్చారు.

Read Also:  ఈ వైరల్ ఫొటోలో ఉన్న పిల్లాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? చూస్తే షాకవుతారు!

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×