E-Paper
Advertisement

బుల్లితెర పైకి మరో షోతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ రోజా..ది ఫ్యామిలీ అసెంబ్లీ అంటూ!

బుల్లితెర పైకి మరో షోతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ రోజా..ది ఫ్యామిలీ అసెంబ్లీ అంటూ!
Advertisement

R.K.Roja: నటిగా వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి రోజా (Roja) ప్రస్తుతం తిరిగి సినిమాలలోనూ బుల్లితెర కార్యక్రమాలలోను ఎంతో బిజీ అవుతున్నారు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చిన సమయంలో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాలలో ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగిన రోజా గత ఎన్నికలలో తన పార్టీ ఓటమి పాలు కావడంతో తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ది ఫ్యామిలీ అసెంబ్లీ షో..

బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కొనసాగుతున్న ఈమె త్వరలోనే మరో కొత్త కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నేనే రాజకీయాలలో ఓటమిపాలు అయిన తర్వాత డ్రామా జూనియర్స్ అంటూ జీ తెలుగులో ఓ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగిన రోజా ఇప్పుడు జీ తెలుగులో దిఫ్యామిలీ అసెంబ్లీ(The Family Assembly) అనే షో ద్వారా రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సింహాసనం పై కూర్చుని రాజసం ఉట్టిపడేలా ఉన్నటువంటి పోస్టర్ వైరల్ అవుతుంది.

బుల్లితెర పై అధ్యక్షానబోతున్న రోజా

Advertisement

ఇక ఈ కార్యక్రమానికి అన్ లిమిటెడ్ ఫన్, అన్ ఫిల్టర్డ్ రోజా అనే క్యాప్షన్ చూస్తుంటే ఈ కార్యక్రమం ద్వారా ఈమె తన కామెడీ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకోబోతున్నారని స్పష్టం అవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి ది ఫ్యామిలీ అసెంబ్లీ అనే పేరు పెట్టడంతో రోజా సైతం అధ్యక్ష అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రతి ఆదివారం జీ తెలుగులో(Zee Telugu) ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. మరి ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమం కాన్సెప్ట్ ఏంటి అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

జబర్దస్త్ జడ్జిగా బుల్లితెర ఎంట్రీ…

Advertisement

ఇక రోజా విషయానికి వస్తే ఈమె రాజకీయాలలోకి వెళ్లి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగారు. అయితే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బుల్లితెరకు, వెండితెరకు పూర్తిగా దూరమైన రోజా గత ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మరోవైపు తమిళ సినిమాలలో కూడా రోజా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా ఒకవైపు సినిమాలలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయ కార్యకలాపాలలో కూడా రోజా బిజీ అవుతున్నారు.ఇకపోతే తాజాగా ది ఫ్యామిలీ అసెంబ్లీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియోలు వైరల్ అవుతున్నాయి మొదటి ఎపిసోడ్లో భాగంగా జెడి చక్రవర్తి ఫరియా అబ్దుల్లా వంటి వారు తమ సినిమా ప్రమోషన్లలో భాగంగా హాజరయ్యారని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమం ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా డబుల్ ఎంటర్టైన్మెంట్, ఫన్ అందించబోతుందని చెప్పాలి.

Also Read: ‘పాపం ప్రతాప్’ కు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు.. ప్రీమియర్లు క్యాన్సిల్ అయినట్టేనా?

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×