E-Paper
Advertisement

ఈ స్కీమ్ కలెక్షన్ టార్గెట్ రూ. 260 కోట్లు.. వర్కౌట్ అయ్యేనా..?

ఈ స్కీమ్ కలెక్షన్ టార్గెట్ రూ. 260 కోట్లు.. వర్కౌట్ అయ్యేనా..?
Advertisement

Property Tax: మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ముందస్తుగా పన్ను వసూలు చేసుకునేందుకు రూ.260 కోట్లను టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి వెల్లడించారు. ఎర్లీ బర్డ్ స్కీమ్ ఈ నెలాఖరు వరకు మాత్రమే అమల్లో ఉండనున్నందున తార్నాకలోని ఎంఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తుల యజమానులు ఎర్లీ బర్డ్ స్కీమ్ ను సద్వినియోగం చేసుకుని ముందస్తుగా పన్ను చెల్లించి, అయిదు శాతం రాయితీగా పొందాలని సూచించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో..

ఎంఎంసీ పరిధిలో మొత్తం 7.95 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లుండగా, వీటిలో దాదాపు 6.97 లక్షలు రెసిడెన్షియల్, మరో 98 వేలు నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.593.41 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ ఉందని, ఇప్పటి వరకు ఎర్లీబర్డ్ స్కీమ్ ద్వారా రూ. 61.95 కోట్ల వరకు ట్యాక్స్ వసూలైనట్లు ఆయన వివరించారు. ఈ నెల 14వ తేదీ వరకు దాదాపు 93 వేల 528 ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లు(పీటీఐఎన్) లు రూ. 61.95 కోట్ల వరకు పన్ను చెల్లించి, సుమారు రూ. 3.12 కోట్లను అయిదు శాతం రాయితీగా పొందినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2025-26) లో అమలు చేసిన ఎర్లీ బర్డ్ ద్వారా దాదాపు 2 లక్షల 83 వేల 4 పీటీఐఎన్ లు, సుమారు రూ.240.19 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ అయినట్లు ఆయన వివరించారు.

Advertisement

Also Read: రూటు మార్చిన వైసీపీ.. మరోసారి అదే రాగం అందుకున్న నేతలు, రాయలసీమ ప్రాజెక్ట్‌లపై శ్రీకాంత్‌రెడ్డి కామెంట్స్

బల్క్ మేసేజ్‌లు..

ప్రస్తుతం వసూలైన రూ. 61.95 కోట్లలో మల్కాజ్ గిరి జోన్ లో రూ. 20.51 కోట్లు, ఉప్పల్ జోన్ లో రూ. 19.07 కోట్లు, ఎల్బీనగర్ జోన్ లో రూ. 22.37 కోట్ల ట్యాక్స్ వసూలైనట్లు ఆయన వివరించారు. మరింత ఎక్కువ మంది బకాయిదారులు ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద పన్ను చెల్లించేలా బకాయిదారులకు ప్రతి రెండు రోజులకోసారి బల్క్ మేసేజ్ లు పంపుతున్నట్లు ఆయన వివరించారు. ఈ స్కీమ్ గురించి ప్రజలకు తెలిసేలా రేడియో జింగిల్స్, ధియేటర్స్ యాడ్ లు వంటివి చేస్తున్నట్లు, దీనికి తోడు కరపత్రాలు పంచుతున్నట్లు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

టార్గెట్లు పిక్స్..

Advertisement

గత సంవత్సరం ఎర్లీ బర్డ్ కలెక్షన్, వార్షిక ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లను 20 శాతం పెంచి వసూలు చేసుకునేందుకు వీలుగా వ్యూహాం సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు కూడా ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్లు నిర్ణయించటంతో పాటు ప్రతి డాకెట్ లోని వివరాల ప్రకారం సదరు ట్యాక్స్ ఇన్ స్పెక్టర్, బిల్ కలెక్టర్లకు కూడా టార్గెట్లు పిక్స్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ వరకు కార్పొరేషన్ స్టాఫ్ సెన్సస్ శిక్షణలో నిమగ్నమై ఉన్నందున, ఈ సారి కలెక్షన్ కాస్త తగ్గిందని, రానున్న పదిహేను రోజుల్లో ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ కు తగిన విధంగా వసూలు చేస్తామని కమిషనర్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Also Read: ఫైనల్ స్టేజ్‌లో ఏఐసీసీ పదవుల ప్రాసెస్.. నేడో రేపో జీవో జారీ..!

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×