E-Paper
Advertisement

Intinti Ramayanam Rajeswari : ‘ఇంటింటి రామాయణం’ నుంచి రాజేశ్వరి అవుట్.. ఫైనల్ ట్విస్ట్..

Intinti Ramayanam Rajeswari : ‘ఇంటింటి రామాయణం’ నుంచి రాజేశ్వరి అవుట్.. ఫైనల్ ట్విస్ట్..
Advertisement

Intinti Ramayanam Rajeswari : బుల్లితెర ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి.. ఇది ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతుంది.. ఒక ఉమ్మడి కుటుంబంలో జరిగే పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించే ఈ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. తను ప్రేమించిన వ్యక్తిని దూరం చేసింది అన్న కోపంతో ఆ కుటుంబంలోకి కోడలుగా అడుగుపెడుతుంది పల్లవి. ఆ కుటుంబ నాశనాన్ని కోరుకోవడంతో పాటుగా ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది.. అలాంటి పల్లవిని మార్చాలని ఆ ఇంటి పెద్ద కోడలైన అవని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. చివరికి ఆ ఇద్దరు తోడికోడళ్ళు కాస్త ఒకే అమ్మకు పుట్టిన అక్కాచెల్లెలను తెలుస్తుంది.. ఇందులో పల్లవికి తల్లి పాత్రలో నటించిన రాజేశ్వరి గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది.. ఈ సీరియల్ నుంచి రాజేశ్వరి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. మరి రాజేశ్వరి నిజంగానే ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్న లేదా అన్నది ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

సీరియల్ నుంచి రాజేశ్వరి అవుట్..

ప్రస్తుతం పల్లవికి తల్లి పాత్రలో నటిస్తున్న రాజేశ్వరి తన భర్తకి ఇంకొక భార్య ఉందని తెలుసుకొని తట్టుకోలేక పోతుంది. అయితే తన భర్తని దూరం చేసుకుంటుంది. దాంతో అతను తన మొదటి భార్య అయిన మీనాక్షి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇన్నేళ్లు కాపురం చేసిన తనని వదిలేసాడు అన్న కోపంతో భర్తని దగ్గరకు రానివ్వదు కనీసం మాట్లాడదు కూడా. అయితే మొదటినుంచి చాలా సాఫ్ట్ గా ఉన్న ఈ రాజేశ్వరి తన భర్త బాగోతం బయటపడిన తర్వాత కోపిష్టిగా మారిపోతుంది. తను చేసిన తప్పుకి అందరినీ దూరం పెట్టేసుకుంటుంది. ఇప్పుడు తన భర్త తన కళ్ళముందే మొదటి భార్యతో సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేక పోతుంది. ఎలాగైనా సరే ఆ మీనాక్షిని అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంటుంది.. కానీ తనని చంపేస్తే ఒక పని అయిపోతుంది అని అనుకుంటుంది.. మీనాక్షిని చంపబోతుంటే అవని వచ్చి అడ్డుపడడంతో రాజేశ్వరి కింద పడిపోతుంది.. అయితే పొరపాటున తాను వెళ్లి ఒక రాయి మీద పడిపోవడంతో తల పగిలి స్పృహ కోల్పోతుంది.. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు.. ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్న రాజేశ్వరి క్యారెక్టర్ ఇకమీదట కనిపించదు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఆందోళన సమాచారం ప్రకారం ఇది నిజమే అని నమ్మాలి.. ఇక ముందు ఎపిసోడ్ లలో ఏం జరుగుతుందో చూడాలి..

అవనిని పోలీసులు అరెస్ట్ చేస్తారా..?

Advertisement

రాజేశ్వరి చావు బతుకులో ఉండడం చూసిన పల్లవి ఎలాగైనా సరే ఆ పనిని అటు తొలగించుకోవాలని పక్కా ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో తన తల్లికి ఇలా కావడానికి కారణం అవనినేని పోలీసులకు ఫోన్ చేస్తుంది. కానీ అవని తనదే తప్పని ఒప్పుకున్నా సరే పల్లవి మాత్రం అరెస్ట్ చేయాల్సిందే అని అంటుంది.. ఇక చేసేదేమీ లేక పోలీసులు అవనిని అరెస్ట్ చేసేందుకు వస్తారు.. అయితే మీనాక్షి వల్ల ఈ గొడవలు జరిగాయి అని తాను తన కూతురిని కాపాడడానికి నేనే తనని తోసేసాను అని అబద్ధం చెప్తుంది. దాంతో తనని పోలీసులు అరెస్ట్ చేస్తారు.. ఇక ముందు ఎపిసోడ్లలో మీనాక్షి కనిపించదని అర్థమవుతుంది.. ఇక అవని పల్లవిల మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో అన్నది రాబోతున్న ఎపిసోడ్లను చూసి తెలుసుకోవాల్సిందే.. ఒకవేళ నిజంగానే మీనాక్షి క్యారెక్టర్ లేకుంటే మాత్రం ఇంకొక క్యారెక్టర్ క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సీరియల్ యొక్క ట్విస్టులను పెంచడానికి డైరెక్టర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే..

Related News

తాత గారితో పందెం సీక్రెట్ బయటపెట్టిన రామోజీరావు మనవడు..!

పెళ్లిపీటలెక్కిన ‘జగధాత్రి’ సీరియల్ నటి…ఫోటోలు వైరల్!

పోలీసులను ఆశ్రయించిన మాధురి రాథోడ్.. పరారీలో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి!

“మాధురి రాథోడ్ నోరు విప్పితే అంతా జైలుకే”.. నిజాలు బయటపెట్టిన ఫోక్ ప్రొడ్యూసర్!

సనాతన ధర్మం.. ట్రోలర్స్ కి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్ !

సుధీర్ రాకతో స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ!

తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. ఎవరంటే?

Ninnu kori Serial Today Episode September 1st  ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ ఆపేందుకు చంద్ర కొత్త ప్లాన్      

Big Stories

Advertisement
×