E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: తండ్రి పై నర్మదా సీరియస్.. ప్రసాద్ రావుకు దిమ్మతిరిగే షాక్.. చివర్లో ట్విస్ట్ అదిరిపోయిందిగా..

Illu Illalu Pillalu Today Episodes: తండ్రి పై నర్మదా సీరియస్.. ప్రసాద్ రావుకు దిమ్మతిరిగే షాక్.. చివర్లో ట్విస్ట్ అదిరిపోయిందిగా..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 1st: రామరాజు ఆ గీతను చూసి బాధపడుతూ ఉంటాడు. ప్రేమగా పెంచుకున్న నా కొడుకు ఇప్పుడు గీత అవతలున్నటువంటి నాకు చాలా బాధగా ఉంది అని నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఈ గీత గోడకు వేసినట్లు లేదు నా మనసుకు నచ్చినట్లు ఉంది అని ఆ గీతను చూస్తూ కింద కూర్చుని బాధపడిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన వెదవది ఏంటండీ మీరు కింద కూర్చున్నారు అంటారు గాని పైన కూర్చొకుండా కింద కూర్చున్నారేంటి అని అడుగుతుంది. ఈ గీతను చూస్తుంటే నా మనసుకు బాధగా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ గీతలు శాశ్వతం కాదు నడిపోడు త్వరలోనే మారి వాడంతటివాడే ఈ గీతకు చెడిపేస్తాడు అని వేదవతి రామారాజుతో అంటుంది. ఆ రోజులు మళ్ళీ వస్తాయి నాకు అనిపించట్లేదు బుజ్జమ్మని రామరాజు పడిపోతూ ఉంటాడు.. బయట ఏదో ఆటో సౌండ్ వచ్చినట్లు అనిపించడంతో రామారాజుతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు.. ప్రసాద్ రావు ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాన్న ఇవన్నీ నర్మదా అడుగుతుంది. నువ్వు కొత్తగా కాపురం పెట్టావు కదమ్మా నీకు కావాల్సిన సామాన్లన్నీ తండ్రిగా నేను తీసుకు వచ్చాను అని ప్రసాద్ రావు అంటాడు.

నువ్వు కన్న తండ్రివేనా..?

నీ బుద్ధి మందగిస్తుంది నాన్న.. మాట్లాడట్లేదు అని నర్మదా ప్రసాద్ రావు పై సీరియస్ అవుతుంది.. నేను నిన్ను ఏమైనా సామాన్లు తెచ్చి ఇవ్వమని అడిగానా..? నువ్వెందుకు తీసుకొచ్చావు అని నర్మదా అంటుంది. నా కూతురికి ఏం కావాలో నాకు బాగా తెలుసు నేను తీసుకొని రావడంలో తప్పులేదు అని ప్రసాద్రావు అంటాడు. కూతురు లేచిపోయి పెళ్లి చేసుకున్న పర్లేదు కానీ అత్తింట్లో కష్టాలు పడకూడదని ఏ తండ్రి అయిన కోరుకుంటారు అని ప్రసాద్ రావు భారీ డైలాగులు కొడతాడు.. ఇప్పుడు ఇవన్నీ మీరు ఇక నుంచి తీసుకొని వెళ్తారా లేదా అని నర్మద సీరియస్ అవుతుంది.

మా కుటుంబాన్ని విడగొడుతున్నారా..?

Advertisement

నా కూతురు కోసం తీసుకొని వచ్చినవి ఇక్కడ పెట్టేసి వెళ్తాను అని ప్రసాద్ రావు నర్మదతో వాదిస్తాడు. అయ్యో శ్రీరామ అన్నానంటే అన్నాను అంటారు. కానీ ఈ ఇంట్లో సామాన్లు కొనుక్కొని దీనస్థితిలో ఎవరున్నారని మీరు ఇవి తీసుకొని వచ్చారు అని వేదవతి అంటుంది. ఎందుకు మా కుటుంబాన్ని ముక్కలు చేసింది కాక మా మధ్య దూరాన్ని పెంచుతున్నారు అని వేదవతి బాధతో ప్రసాదరావు పై మండిపడుతుంది. అయితే ప్రసాద్ రావు ను సామాన్లని తీసుకుని వెళ్ళమని చెబుతుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన సాగర్ ఎందుకు తీసుకుని వెళ్లాలి మా మామగారు కూతురు మీద ప్రేమతో తీసుకుని వచ్చారు అని అంటాడు. ఆయన వీటిని ఇక్కడే పెట్టి వెళ్తారు అని సాగర్ అంటారు.

నీకు పుట్టింట్లో గతిలేదు..

కూతురు వేరే కాపురం పెట్టింది అని సామాన్లు తీసుకొని వచ్చి ఆయన ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఏంటి అని సాగర్ అందరికీ తెలిసేలా మాట్లాడుతాడు. నీకు నీ పుట్టింటి వాళ్ళు ఏమి పెట్టలేదు కదా.. నా భార్యకి తన పుట్టింటి వాళ్ళు పెడుతున్నప్పుడు ఎందుకు కాదనాలి.. ఇది వాళ్ళ హక్కు కదా అని సాగర్ వేదవతిని అవమానించేలా మాట్లాడుతాడు.. దానికి ధీరజ్ ఏం మాట్లాడుతున్నావ్ రా.. అమ్మకి పుట్టింటి వాళ్ళు లేకపోయినా వాళ్ళని మరిపించేలా నాన్న కష్టపడి అన్ని సంపాదించి పెట్టాడు అని ధీరజ్ సాగర్ కి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతాడు. కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది అని ధీరజ్ అంటాడు.. రామరాజు బుజ్జమ్మ వదిలేయని లోపలికి వెళ్ళిపోతాడు.

ధీరజ్ దెబ్బకు మైండ్ బ్లాక్..

Advertisement

మావయ్య కూలి వాళ్ళు ఎవరు దొరకలేదు మనమే వీటిని ఇంట్లో దించుకుందాం పదండి అని సాగర్ అంటాడు. ఒక బాక్స్ కిందకు దించగానే అది సాగర్ కాలు మీద పడగానే అమ్మ అని గట్టిగా అరుస్తాడు. అదేంటిరా.. నువ్వు కాలు మీద పడగానే అమ్మ అని అరిచావు ప్రసాద్ రావు మావయ్య అని అరవాలి కదా అని వెటకారంగా మాట్లాడతాడు. ఏ అప్పుడు మావయ్య గుర్తుకు రాలేదా అమ్మ ఎందుకు గుర్తుకొచ్చేది. అమ్మని తీసేసి అవమానించేలా మాట్లాడుతున్నావు తన పుట్టింటి వాళ్ల గురించి మాట్లాడే అధికారంలోకి ఎక్కడినుంచి వచ్చింది అని ధీరజ్ సాగర్ కి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతాడు. రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలోళ్ళు ఇక్కడే ఉన్నారు కదా.. డబ్బులు పడేస్తాము పనిచేసే పెడతారు అని ప్రసాద్ రావు అంటాడు.. ధీరజ్ అలాగే తిరుపతి బుద్ధి చెప్పాలని అలాగే చేస్తామని అంటారు. సామాన్లు అందించిన తర్వాత ఎంత అయింది అని అడగ్గాని 10,000 అని చెప్తాడు దీరాజ్. ఆ మాట వినగానే ప్రసాద్ రావు మైండ్ బ్లాక్ అవుతుంది.

తిరుపతికి దిమ్మతిరిగే షాక్..

మనము సామాన్లు మోసినందుకు డబ్బులు వచ్చాయి కదా.. ధీరజ్ తో పాటు సమానంగా నాకు కూడా డబ్బులు వస్తాయి కదా.. ఆ డబ్బులు తీసుకుని కన్యకు ఏదైనా అద్భుతమైన గిఫ్ట్ కొనివ్వాలి అని తిరుపతి అనుకుంటాడు. అయితే ధీరజ్ ని పెళ్లి చేయి డబ్బులు ఇవ్వమని అడిగితే ధీరజ్ నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు సగం డబ్బులు ఇస్తానని ఇస్తాడు.. కానీ మధ్యలో ప్రేమ ఆ డబ్బులు ఒక్కొక్క కారణం చెప్పి మొత్తం తీసేసుకుంటుంది.. దోపిడీలను చూశాను గాని మరి ఇంత దారుణంగా దోపిడీ చేయడం నేనెక్కడ చూడలేదు అని ప్రేమ ను తిరుపతి మనసులో తిట్టేస్తుంటాడు. అటు ఆనంద్ రావు భాగ్యం ఇద్దరు కూడా తగిలిన దెబ్బలకి మందు రాసుకుంటూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: మీనాక్షిని అవమానించిన పల్లవి.. నిన్ను చంపేస్తాను.. చావుబ్రతుకుల్లో రాజేశ్వరి..

Related News

Podarillu Today Episode : అయ్యో.. కన్నాకు జ్వరం.. తల్లిగా మారిన మహా..చక్రిని ప్రేమిస్తున్న మహా..

Intinti Ramayanam Today Episode: సుబ్బారావుకు పల్లవి వార్నింగ్.. అవనికి అనుమానం.. పల్లవికి మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. మీనా ప్లాన్ అదుర్స్.. రోహిణి గుట్టు రట్టు..

Illu Illalu Pillalu Today Episodes: రామారాజుకు ఘోర అవమానం.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. ప్రేమ ఎమోషనల్..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సాగర్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. అంతమాట అన్నావేంటి బ్రో..

Telugu Serials : ఈ వారం టాప్ లో ఉన్న సీరియల్స్.. పొదరిల్లులో ఊహించని ట్విస్ట్..

Today Movies in TV : మూవీ లవర్స్ కు పండగే.. ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపు మంట.. విద్యకు వార్నింగ్ ఇచ్చిన రోహిణి.. మీనా ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×