Gundeninda Gudigantalu: ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో వరుసగా సీరియల్ ప్రసారమవుతుంటాయి. అందులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ కు మంచి డిమాండ్ ఉంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ హీరోయిన్ మీనా అలియాస్ అమూల్య గౌడ తన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా ఈ సీరియల్ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా ఈ సీరియల్ లో అమూల్య నటించింది. అయితే ఈమెకు ఈ సీరియల్ లో నటించినందుకు రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్న విషయాల గురించి తెలుసుకోవాలని చాలా మంది గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఇంతకీ అమూల్య ఈ సీరియల్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
అమూల్య గౌడ రెమ్యూనరేషన్..
గుండె నిండా గుడిగంటలు సీరియల్ లో మీనా పాత్రలో నటించిన అమూల్య గౌడ వారానికి రెండున్నర లక్షల రెమ్యునరేషన్ అందుకునేవారు. కన్నడ బ్యూటీ అమూల్య గౌడ, స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్‌తో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చారు. గుండె నిండా గుడిగంటలు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల మరింత చేరువయ్యారు.. మొదట కార్తీకదీపం సీరియల్ లో నటించిన కానీ ఆ సీరియల్ ద్వారా మీకు అంత గుర్తింపు రాలేదు.. కానీ ఈ సీరియల్ మాత్రం మంచి గుర్తింపును అందించింది. నెలకు 12 నుంచి 15 లక్షల వరకు రెమ్యూనరేషన్ ను అందుకుంటుంది..
Also Read :ధనుష్ తో మీనా రెండో పెళ్లి వార్తలపై క్లారిటీ.. ఏం చెప్పిందంటే..?
అమూల్య గౌడ రియల్ లైఫ్..
మైసూర్‌కి చెందిన అమూల్య గౌడ పదేళ్ల క్రితమే కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో బుల్లితెరపై కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటించిన కమలి సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.. ఆ తర్వాత బుల్లితెరపై వరుస సీరియల్స్ వాళ్ళతో బిజీగా మారింది. కన్నడ తో పాటు తెలుగు పై ఆసక్తితో తెలుగు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంది. అనుకున్నట్లుగానే తెలుగులో అవకాశాల కోసం ట్రై చేసింది. ఇలా కార్తీక దీపం సీరియల్ లో రౌడీ బేబీ శౌర్యగా నటించి మెప్పించింది. ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను అభిమానాన్ని సంపాదించుకుంది. ఈ అమ్మడు తన నటన తో బుల్లి తెర ప్రేక్షకులను నటన తో ఆకట్టుకుంది. ఆ తర్వాత కన్నడ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి తన ఆటతీరుతో అభిమానుల మనసు దోచుకుంది. ప్రస్తుతం తెలుగులో గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో నటిస్తుంది. ఇది సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈ సీరియల్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. మంచి టీఆర్పీ రేటింగ్ ను అందుకుంది. కన్నడ లో కూడా సీరియల్స్ తో నటిస్తుంది.