OTT Movie : హాలీవుడ్ విలక్షణ నటుడు జిమ్ క్యారీ నటించిన ఒక మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ హీరో యాక్టింగ్ కి ఎవరైనా ఫిదా అయిపోతారు. చాలా సినిమాలలో కామిడీ తోనే ఈ హీరో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరో కి దేవుడు తన శక్తులు ఇస్తాడు. ఆ తరువాత స్టోరీ నవ్వించడానికి ముందుకు వెళ్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఫాంటసీ కామెడీ మూవీ పేరు ‘బ్రూస్ ఆల్మైటీ’ (Bruce Almighty). 2003 లో విడుదలైన ఈ మూవీకి టామ్ షాడ్యాక్ దర్శకత్వం వహించారు. ఇందులో జిమ్ క్యారీ బ్రూస్ నోలన్‌గా నటించాడు. అతను తన పనిని సరిగ్గా చేయడం లేదని, దేవునికి ఫిర్యాదు చేసే ఒక టెలివిజన్ రిపోర్టర్. ఒక వారం పాటు తనను తాను దేవుడిగా అవతారం ఎత్తే అవకాశాన్ని అందుకుంటాడు. ఇందులో జెన్నిఫర్ అనిస్టన్, ఫిలిప్ బేకర్ హాల్, కేథరీన్ బెల్ నటించారు. 2003న అమెరికన్ థియేటర్లలో విడుదలైనప్పుడు, బ్రూస్ ఆల్మైటీ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ఒక వారంలోనే $86 మిలియన్లు వసూలు చేసింది. ఆ సమయంలో ఇది మెమోరియల్ డే రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం తరువాతి వారాంతంలో ‘ది మ్యాట్రిక్స్ రీలోడెడ్’ కలెక్షన్స్ ను అధిగమించి ఆశ్చర్యపరిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా $484 మిలియన్లు వసూలు చేసి, 2003లో అత్యధిక వసూళ్లు చేసిన మూవీగా నిలిచింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
బ్రూస్ నోలన్ ఒక టీవీ న్యూస్ రిపోర్టర్ గా ఉంటాడు. అతను తన జీవితంలో చాలా అసంతృప్తిగా ఉంటాడు. అతనికి తన ఉద్యోగంలో పెద్ద విజయం సాధించాలని, తన స్నేహితురాలు గ్రేస్ తో జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరిక ఉంటుంది. అయితే, అతని జీవితంలో ఏదీ సరిగా జరగడం లేదని భావించి, దేవుడిపై నిందలు వేస్తాడు. ఒక రోజు, బ్రూస్‌ని ఒక మిస్టీరియస్ వ్యక్తి కలుస్తాడు. అతను తనను దేవుడిగా పరిచయం చేసుకుంటాడు. కొన్ని షరతులను పెట్టి, దేవుడు బ్రూస్‌కి తన శక్తులను అప్పగిస్తాడు. మొదట్లో బ్రూస్ ఈ శక్తులతో తన జీవితాన్ని సరదాగా మార్చుకుంటాడు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందడం, ట్రాఫిక్‌ను నియంత్రించడం, తన శరీరాన్ని అందంగా మార్చడం వంటివి చేస్తాడు. కానీ త్వరలోనే, ఈ శక్తులు బాధ్యతలతో కూడుకున్నవని అతను గ్రహిస్తాడు.
ప్రపంచంలోని ప్రజల ప్రార్థనలను వినడం, వాటిని నెరవేర్చడం వంటి పనులు అతనికి తలనొప్పిగా మారతాయి. అతను అందరి ప్రార్థనలకు అవును అని చెప్పడంతో, ఊహించని గందరగోళం ఏర్పడుతుంది. ఉదాహరణకు, చాలా మంది లాటరీ గెలవాలని కోరుకోవడంతో, ఈ కోరికను అందరికీ తీరుస్తాడు. అందరికీ చిన్న చిన్న మొత్తాలు పంచబడతాయి, దీంతో అల్లర్లు మొదలవుతాయి. ఈ పరిస్థితుల్లో, బ్రూస్ తన స్వార్థాన్ని వదిలి, ఇతరుల కోసం ఆలోచించడం నేర్చుకుంటాడు. గ్రేస్‌తో తన సంబంధాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. చివరికి దేవుడికి తన శక్తులను తిరిగి ఇచ్చేస్తాడు. బ్రూస్ తన జీవితంలోని చిన్న చిన్న విషయాలను ఆనందించడం నేర్చుకుని, సంతోషంగా జీవించడం మొదలుపెడతాడు.