BigTV English

Satyabhama Today Episode : సత్యకు కన్నీళ్లు మిగిల్చిన మహాదేవయ్య.. విశ్వనాథంకు వరుస షాక్ లు..

Satyabhama Today Episode : సత్యకు కన్నీళ్లు మిగిల్చిన మహాదేవయ్య.. విశ్వనాథంకు వరుస షాక్ లు..

Satyabhama Today Episode December 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. మహదేవయ్యా నాకోసమే వెయిట్ చేస్తున్నావని సత్యతో అంటాడు. నేను చేసిన పాపం ఆ నర్స్ చూసింది ఆ నర్స్ ని అప్పుడే ఉద్యోగం వదిలేసి పారిపొమ్మని చెప్పాను. కానీ అప్పుడు వదిలేసినదే ఇప్పుడు ఇంత మహాపాపం అవుతుందని నేను అనుకోలేదు అందుకే ఆ నర్స్ ని ఇక భూమి మీద కనిపించకుండా చేసేసాను అనేసి అంటాడు. నేను కూడా మీకు అడ్డుపడుతున్నాను కదా నా గురించి మీరు ఆలోచించలేదు ఏంటి అనేసి అంటుంది సత్య. దహనం నశించినప్పుడు నీకు కూడా నర్సుకు పట్టిన గతే పడుతుంది అని అంటాడు. క్రిష్ కి ఎలాగైనా నిజం చెప్పేంతవరకు నా ప్రాణాలైనా లెక్క చేయనని సత్యం మహదేవయ్యకు చాలెంజ్ చేస్తుంది. క్రిష్ కి నిజం చెప్పేంతవరకు నేను నిద్రపోనని మహదేవయ్యతో సత్యా చాలెంజ్ చేస్తుంది. నేను నా మీద నా మీదే కాన్సన్ట్రేషన్ చేశాను. నీ మీద ఇంతవరకు అలాంటి చేయలేదు నీ మీద ఫోకస్ పెట్టానంటే నువ్వు ఎంతగా ఏడుస్తావో నీకు తెలియదు నీ వాళ్ళకి ఏం జరగాలో అది జరిగేలా చేస్తానని సత్యకు మహదేవయ్య వార్నింగ్ ఇస్తాడు. ఇక సత్యా నా వాళ్లకు అంటే ఎవరు క్రిష్ ఏ కదా కృషికి అలా ఎందుకు చేస్తాడు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. అనుకున్నట్లే మహాదేవయ్య సత్య పుట్టింటి వాళ్లకు వరుస షాక్ లు ఇస్తాడు. నిన్న డబ్బులు కట్టాలని ఇంటిమీదకు వస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. విశ్వనాథం ఇంటికి రౌడీలు వస్తారు. హర్ష 25 లక్షలు డబ్బులు తీసుకున్నాడని వెంటనే కట్టాలని వాళ్లు డిమాండ్ చేస్తారు. అంతేకాదు హర్షను కొడతారు కూడా.. ఇక హర్షను వదిలేయమని విశ్వనాథం వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. 25 లక్షలు నేను ఒక వారంలో కట్టేస్తాను అని చెప్తాడు. కానీ వాళ్ళు వెంటనే కట్టాలని రెండు రోజులు మాత్రమే టైం ఇస్తారు. ఇంట్లో వాళ్ళందరూ హర్షను తిడతారు. ఇక విశాలాక్షి మనకు డబ్బులు కన్నా మర్యాద ముఖ్యం పరువు ముఖ్యం మీరు వెళ్లి ఆ ఇంటి పత్రాలు పెట్టేసి ఆ డబ్బులు తీసుకువచ్చి వాళ్ళని కట్టండి అనేసి అంటుంది. ఇక హర్ష విశ్వనాథం ఇద్దరూ బ్యాంకుకు వెళ్తారు. సంధ్య సత్యకు ఫోన్ చేస్తుంది. ఇంట్లో జరిగిన విషయాన్ని సత్య తో సంధ్య చెప్తుంది. ఆ ఫోన్ పెట్టే గాని మహదేవయ్యా డబ్బులు అడిగారా అప్పుల వాళ్ళు వచ్చారా అనేసి సత్యను అంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు ఏదైనా జరిగితే మనసులో గుచ్చుకున్నట్టు ఉంది కదా నన్ను చంపేయాలి అనిపిస్తుంది కదా నాకు కూడా సేమ్ ఇలానే ఉండింది కానీ నువ్వు జోరీగ లెక్క నా చుట్టూ తిరుగుతూ నన్ను ఇది చేసావు అందుకే నీకు ఇది చేస్తున్నాను ఇంతకుముందు అంతకుమించి ఏడుస్తూ ఉంటావు అనేసి సత్యకు షాక్ ఇస్తాడు.. మహదేవయ్యా.

తన పుట్టింటి వాళ్లను చూడాలని సత్య భైరవి పర్మిషన్ తీసుకుని వెళ్లాలని అనుకుంటుంది. కానీ భైరవి మాత్రం సత్యకు నేను ఎటువంటి పర్మిషన్ ఇయ్యను ఇంట్లో చాలా పని ఉంది నాకు అర్జెంటుగా పోయి టీ తీసుకురా అనేసి సాగదీస్తుంది. జయమ్మ రేణుక ఎంత చెప్పినా కూడా బైరవి వినదు. క్రిష్ వచ్చి పద తీసుకెళ్తానని సత్యను తీసుకుని వెళ్తాడు. ఇక బ్యాంకుకు వెళ్లిన విశ్వనాథంకు బ్యాంకు మేనేజర్ షాక్ ఇస్తాడు. లోన్ ఇవ్వాలంటే ఒక పది రోజులు ప్రాసెస్ పడుతుందని అనగానే మాకు అంత టైం లేదండి పేషెంట్ చాలా ముఖ్యం అది ప్రాణాలతో పోరాడుతున్నారు అనేసి అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇక సెట్ కి ఫోన్ చేసి ఇంటి పత్రాలు ఇస్తాను నాకు 25 లక్షలు డబ్బులు కావాలని అడుగుతాడు. సేటు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంటి పత్రాలను తీసుకొని డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. ఇక వేరేవాళ్లు ఈ ఇల్లు నాది నా పేరు మీద ఉంది మీకు ఎలా ఇస్తారు అనేసి గొడవ పెట్టుకుంటాడు.. నేను ఫారిన్ లో ఉండడం వల్ల నాకు ఇదంతా తెలియదు ఇప్పుడు వచ్చాను మా నాన్న చనిపోయాడు కాబట్టి ఈ ప్రాపర్టీ మొత్తం నాదే అనేసి ఆ ఇళ్లు రెండు రోజుల్లో ఖాళీ చేయాలనేసి అతను అంటాడు. ఇక బయటికి వెళ్లగానే మహదేవయ్యకు అతను ఫోన్ చేసి చెప్తాడు.


రెండు రోజులు టైం ఇచ్చాను ఆ రెండు రోజుల్లో గనక ఖాళీ చేయకుంటే సామాన్లు బయటపడేసి ఇంట్లో మందిని బయటికి తోలుతాను అనేసి అంటాడు. ఇక పంకజం భైరవి దగ్గరికి వచ్చి పుల్లలు పెడుతుంది. చిన్న కోడలు మీ మాట వినట్లేదు మీ కంట్రోల్ తప్పిపోయింది మీరు చిటికేస్తే రావాలి కదా అనేసి అంటుంది. నీకు బైరవి సాయంత్రం లోపల దాన్ని ఇక్కడ ఉండేలా చేస్తాను లేకపోతే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో నువ్వే చూస్తావు కదా అనేసి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మహదేవయ్యకు సత్య ఫోన్ చేస్తుంది. ఈ పుట్టింటి వాళ్ళ కష్టాలన్నీ పోవాలంటే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఒప్పుకుంటే ఆ కష్టాలన్నీ తీరిపోతాయని అంటాడు మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×