OTT Movie : సైకో కిల్లర్ సినిమాలలో ట్విస్టులు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి సినిమాలు చివరి వరకు సస్పెన్స్ కొనసాగిస్తాయి. వీటిని చూసి థ్రిల్ అవుతూ ఉంటారు మూవీ లవర్స్. ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక సైకో కిల్లర్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ థ్రిల్లర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమెరికన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది క్లోవ్‌హిచ్ కిల్లర్‘ (The Clovehitch Killer). ఈ మూవీకి డంకన్ స్కైల్స్ దర్శకత్వం వహించారు. ఇందులో డైలాన్ మెక్‌డెర్మాట్, చార్లీ ప్లమ్మర్, సమంతా మాథిస్, మాడిసెన్ బీటీ నటించారు. ఈ సైకో కిల్లర్ మూవీ నవంబర్ 16, 2018న థియేటర్‌లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో తన తండ్రి తో మంచి ఫ్రెండ్ గా ఉంటాడు. హీరోకి కాలేజీలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో ఒకరోజు కారులో ఉండగా, ఒక ఫోటో కనబడుతుంది. అందులో ఒక అమ్మాయి అసభ్యకరమైన ఫోటో ఉంటుంది. ఇది చూసి హీరోని ఆ అమ్మాయి అసహ్యించుకుంటుంది. ఆ ఫోటో తో నాకు సంబంధం లేదని చెప్పినా వినకుండా వెళ్ళిపోతుంది. అదే ఊరిలో కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది అమ్మాయిలు మిస్ అయిపోతారు. వాళ్లలో దొరికిన ఫోటోలో ఉన్న అమ్మాయి కూడా చనిపోయి ఉంటుంది. హీరో, అదే స్కూల్లో చదివే మరొక అమ్మాయితో చనువుగా ఉంటాడు. ఆ అమ్మాయికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు హీరో తన తండ్రి రహస్యంగా వెళ్లే ఒక గదిలోకి వెళ్తాడు. అందులో కొంతమంది అమ్మాయిల ఫోటోలు ఉంటాయి. అప్పుడు హీరోకి అనుమానం వస్తుంది. ఈ హత్యలు చేసింది తన తండ్రి అని అనుకుంటాడు. తన కొడుకుకి రహస్యం తెలిసిపోయిందని తండ్రి అతనికి అబద్దం చెప్తాడు.
ఆ ఇంట్లో మరొక వ్యక్తి ఉండేవాడని, ఇదంతా అతనే చేశాడని చెప్తాడు. హీరో ఆ ఫోటోలను కాల్చేయమని తండ్రి కి చెప్తాడు. ఆ తర్వాత అన్ని ఫోటోలను హీరో తండ్రి బూడిద చేస్తాడు. ఈ విషయం హీరో, తన గర్ల్ ఫ్రెండ్ కి చెప్తాడు. మీ తండ్రి సైకో కిల్లర్ అని ఆ అమ్మాయి చెప్తుంది. వీళ్ళిద్దరూ కలసి హీరో తండ్రిని టెస్ట్ చేయాలనుకుంటారు. బయటికి వెళ్తున్నానని చెప్పి హీరో తండ్రి ఒక అమ్మాయిని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. ఆ ఇంట్లోకి వెళ్లి ఆ అమ్మాయిని తాడుతో కట్టేసి ఫోటో తీసుకుంటాడు. అలా తీసుకొని వాళ్లను చంపేస్తూ ఉంటాడు. ఇతనికి అటువంటి ఫోటోలు చూస్తే అదొక ఆనందం. హీరో అక్కడికి ఒక గన్ తీసుకొని వస్తాడు. చివరికి హీరో తండ్రిని ఏం చేస్తాడు? పోలీసులకు తన తండ్రిని అప్పగిస్తాడా? తండ్రి చేతిలో కొడుకు బలైపోతాడా? ఆ హత్యలు చేసింది ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సైకో కిల్లర్ మూవీని చూడాల్సిందే.