Satyabhama Today Episode December 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్య మహాదేవయ్యకు తన మాటలతో చెమటలు పట్టిస్తుంది. ఇక ఇప్పటికైనా మీరు తప్పించుకోలేరు. మీకు ఒక అవకాశం ఇచ్చాను కానీ మీరు వాడుకోలేదు. ఇక నిజం తెలియక మానదు. పాతికెళ్ళు నుంచి మీరు బయట పెట్టలేని నిజం రేపటితో బయటకు వచ్చేస్తుంది. మీకు ఒక అవకాశం ఇచ్చాను కానీ మీరు వాడుకోలేదు. ఇన్ని రోజులు మీరు ఏదైతే దాచారో ఆ నిజం రేపటితో విస్పోటనంలా బయటపడుతుంది అనేసి సత్య మహదేవయ్యకు చుక్కలు చూపిస్తుంది. గుండె మీద పచ్చబొట్టు పొడిపించుకునేంత మాత్రాన అది నిజమైన ప్రేమ కాదు ఆ గుండెల మీద రేపు క్రిష్ మిమ్మల్ని కత్తితో పొడవు పోతున్నాడు ఆ విషయం గుర్తు పెట్టుకోండి మహదేవయ్యకు అని సత్య అంటుంది. ఇక బంటి మహాదేవయ్య లాగా రెడీ అయ్యి కుర్చీలో కూర్చుంటాడు. అది చూసిన క్రిష్ కోపంతో రగిలిపోతాడు. ఇక బంటి బట్టలను తీసుకొని కాల్చేస్తాడు. అది చూసిన అందరు షాక్ అవుతారు. సత్య మహాదేవయ్యకు వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కింద జరిగిన లొల్లి గురించి మహాదేవయ్యను అడగటానికి క్రిష్ వెళ్తాడు. కానీ క్రిష్ తో మాట్లాడటానికి మహాదేవయ్య ఇష్టపడడు.. బాపు నీ కోపం ఏందో చెప్పు బాపు అనేసి అడుగుతాడు. క్రిష్ ని చూడగానే మహదేవ ఏం లేదు అని కోపంగా కసురుకుంటాడు. మీ మనసులో ఏదైనా ఉంటే నాకు చెప్పండి బాపు నేను చూసుకుంటాను అనేసి అనగానే మహదేవయ్యా అదేం లేదు నేను కోపంగా ఉన్నాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అంటాడు. ఏంటి మళ్లీ బాపు కోపంగా ఉన్నాడని క్రిష్ బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇక వెనకాల సత్య వస్తుంది. సత్యం చేసిన మహదేవయ్య నేను తిరగా చిరాగ్గా ఉన్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అంటాడు.. మీరు ఇంత కోపంగా ఉన్నారు రేపు నిజాలు బయటకు వస్తే ఇంకేమవుతారు అనేసి వెళ్ళిపోతుంది. ఇక సత్యా కృష్ణ దగ్గరికి వెళుతుంది. క్రిష్ ఏంటి చిన్నపిల్లల బాధపడుతున్నావు మీ నాన్న మనసులో ఎంత బాధ ఉంటే అలా అంటాడు మీరు మాట్లాడుకునేదంతా నేను విన్నాను అనేసి అంటుంది.
బాపు నిజంగానే తప్పు చేశాడా? అనుకుంటున్నావ్ సత్యా అంటే ఏమో ఆయన కూడా ఒక మామూలు మనిషే కదా ఏదైనా జరగొచ్చు ఆయనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అనేసి అంటుంది. ఆయన నా దృష్టిలో ఒక దేవుడు అనేసి క్రిష్ అంటాడు. నీకు సత్య ఆపోహ నుంచి బయటికి రా ఆయన ఒక మామూలు మనిషిలాగ చూడు ఆయన ఫీలింగ్స్ ఏంటో ఆయన బాధ ఏంటో నీకు అర్థం అవుతుందనేసి అంటుంది. నీ తండ్రి గురించి నీకు నిజం చెప్పాలని నేను ఆరాటపడుతున్నాను అని క్రిష్ అప్పుడే నీ మనసు తేలిక అవుతుందనేసి సత్య అంటుంది.. ఇక మైత్రి హర్ష ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని టెన్షన్ పడుతుంది. మైత్రి ఫ్రెండ్ శృతి వచ్చి హర్ష ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అనేసి అడుగుతుంది. నందిని ఉండగా ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాడు ఇక నువ్వు హర్షను మర్చిపోవడం మంచిదే అనేసి మైత్రికి సలహా ఇస్తుంది. మైత్రికి నా మీద ప్రేమ ఉంది అందుకే నన్ను ఇంటికి తీసుకెళ్లాడు నాతో క్లోజ్ గా ఉన్నాడు నాకు లక్షలు ఖర్చు చేశాడు అనేసి అంటుంది. రేపు నా బర్త్ డే కాబట్టి హర్షిక ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పు అప్పుడే వస్తాడు తనకు నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వే చూస్తావు కదా అనేసి అంటుంది.
ఇక భైరవి ఆ గలీజ్ మొహం దాన్ని చూడకుండా అంటే ఎంత ప్రశాంతంగా ఉందో అనేసి అనుకుంటూ బెడ్ రూమ్ లోకి వస్తుంది. ఇక బెడ్ రూమ్ లో అప్పటికే గంగ ఉంటుంది. భైరవి నగలన్నీ గంగ ధరించి ముచ్చట పడుతుంది. ఆ నగలని వేసుకుంటే మహాలక్ష్మి లా ఉన్నానని మురిసిపోతూ ఉంటుంది. గంగను చూసి బైరవి షాక్ అవుతుంది. ఆ పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చి నానగలు వేసుకుంటావా ఇదేమైనా నీ అయ్యగారు అడ్డా అనుకున్నావా అనేసి బైరవి గంగను అడుగుతుంది. ఇది ఎవరు ఈ మనునగలవే కదా? మన మొగుడు కొనిచ్చిన వే కదా అనేసి అడుగుతుంది. దానికి భైరవి మాటకు ముందు మనము ఒకడు మాట వెనకాల మన మొగుడు అని నాకు చిరాకు తెప్పించకు అనేసి ఇద్దరు వాదనకు దిగుతారు. ఇక ముందు నువ్వు నా నగలు తీసే అనేసి బైరవి అడుగుతుంది. వీళ్ళిద్దరూ వాదరని చూసి సత్య మురిసిపోతుంది. అత్తయ్య ఏమైంది ఎందుకు మీరు ఇలా గొడవ పడుతున్నారని సత్య లోపలికి వస్తుంది. ఎన్ని రోజులు ఈ ఆవిడతో ఎలా వేగావ్ సత్య అనేసి గంగా అంటుంది.
ఇక భైరవి గంగను బ్రతిమలాడమని అడుగుతుంది. ఇక సత్యా రేపటి రిపోర్ట్స్ వచ్చేంతవరకు నువ్వు బుద్ధిగా ఉండు. అసలు నిజం బయటికి వచ్చిన తర్వాతే ఈ వాదనలన్నీ ఉంటాయి అనేసి గంగకి చెప్తుంది. నువ్వేదైనా తేల్చుకోవాలన్న మాట్లాడాలన్నా అవన్నీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే అనేసి గంగకి చెప్తుంది. ఇక సత్య బైరవిని బయటికి తీసుకొస్తుంది. నా కొడుకుని పట్టుకొని దాని కొడుకు అంటుంది నా మొగుడిని పట్టుకుని దాని మొగుడు అంటుంది. నేనెందుకు తగ్గాలి దాని విషయంలో నేను అసలు తగ్గేదే లేదు అనేసి అంటుంది. ఇప్పుడు ఆ గంగ అంత రెచ్చిపోవడానికి కారణం మావయ్యే మామయ్య ఇలా ఇవ్వడం వల్లే రెచ్చిపోతుంది అనేసి అంటుంది. ఎందుకు పొగరాదు మావయ్య ఎక్కడో నిప్పు పెట్టాడు అందుకే ఇప్పుడు ఈ పొగ చుట్టుకుంది అనేసి భైరవికి చెప్తుంది. రేపు భైరవి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాని పని చెప్తాను తొక్క తీసిన నార తీస్తానని వెళ్ళిపోతుంది. ఇక సత్య నన్ను అడ్డంగా ఇరికించిందని మహదేవయ్యా ఆలోచిస్తుంటాడు. ఎస్సై కి ఫోన్ చేసి దీని రిపోర్ట్స్ మీ స్టేషన్ కి వస్తాయి కదా వాటిని మార్చాలి అనేసి అడుగుతాడు. దానికి మహదేవయ్యను ఆ ఎస్ఐ నావల్ల కాదండి అది నా చేతులు లేని పని అనేసి అంటాడు. మీడియా కళ్ళని ఆ రిపోర్ట్స్ మీదే ఉన్నాయి వాటితో అందరినీ తప్పించి రిపోర్ట్స్ మార్చడం నావల్ల కాదనేసి ఎస్ఐ చేతులెత్తేస్తాడు. ఇక ఆ ఏరియా పార్టీ ఇంచార్జ్ కి ఫోన్ చేస్తాడు. ఆయన కూడా నా చేతిలో లేని పని అనేసి చేతులెత్తేస్తాడు. ఇక సత్యా అక్కడికి వచ్చి ఏంటి రిపోర్ట్స్ మీకు అనుకూలంగా రాలేదనుకుంటున్నారా అనేసి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపుటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..