Pv Sindhu Wedding: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు డిసెంబర్ 22న ఉదయపూర్‌లో వివాహం చేసుకోనున్నారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ( Pv Sindhu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన రెండు తెలుగు రాష్ట్రాలకు… ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. ఏపీకి చెందిన పీవీ సింధు… దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇండియాకు ఎన్నో విజయాలను కూడా అందించిన ఘనత పీవీ సింధు ( Pv Sindhu ) సొంతం. అయితే అలాంటి పీవీ సింధు ( Pv Sindhu ) ఇప్పుడు కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు పీవీ సింధు ( Pv Sindhu ). ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: IND vs AUS 2nd Test: రెండో టెస్ట్ కోసం టీమిండియాలో భారీ మార్పులు..రోహిత్ ఎక్కడంటే ?
పీవీ సింధు ( Pv Sindhu ) … ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. హైదరాబాద్ మహా నగరానికి చెందిన ఓ ప్రముఖ బిజినెస్ మాన్ ను వివాహం చేసుకోబోతున్నారు పీవీ సింధు. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మాన్ వెంకట దత్త సాయి ( Venkata Datta Sai ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకోనున్నారు పి వి సింధు. వెంకట దత్త సాయి వ్యాపారవేత్తనే కాదు…పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ మేరకు ఇరు కుటుంబాల మధ్య… అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. కానీ వాటిని సీక్రెట్ గా నిర్వహించారు.
డిసెంబర్ 22వ తేదీ అంటే ఇదే నెలలో… పీవీ సింధు పెళ్లి ( Pv Sindhu Wedding) జరగబోతుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో పీవీ సింధు పెళ్లి ( Pv Sindhu Wedding) జరుగనుంది. ఇక ఈ నెల 24 వ తేదీన హైదరాబాద్ రిసెస్ఫన్ ఉందట. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పీవీ సింధు ( Pv Sindhu ) కుటుంబ సభ్యులు. అయితే… డిసెంబర్ 22వ తేదీన… పీవీ సింధు పెళ్లి ( Pv Sindhu Wedding) కొంత మంది
Also Read: U19 Asia Cup India vs Japan: U 19 ఆసియా కప్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ..
సమక్షంలోనే జరుగనుందని అంటున్నారు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలోనే పెళ్లి జరుగుతుందుని చెబుతున్నారు. అయితే.. రహస్యంగా పీవీ సింధూ, వెంకట సాయి దత్త ఎంగేజ్మెంట్ చేశారు. కానీ పెళ్లికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే.. తేదీలు అనౌన్స్ చేశారు. వాస్తవంగా… పీవీ సింధు, వెంకట సాయి దత్త కుటుంబ మధ్య బంధం ఎప్పటి నుంచో ఉందట. ఇరు కుటుంబాలు ప్రతి పండుగను కలిసే నిర్వహించుకుంటాయట. ఈ తరుణంలోనే.. పీవీ సింధు ( Pv Sindhu ) , హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మాన్ వెంకట దత్త సాయి ( Venkata Datta Sai ) వివాహం ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో డిసెంబర్ 20న పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.