BigTV English

Satyabhama Today Episode : చక్రవర్తికి నిజం చెప్పిన సత్య.. కొత్త జంట హనీమూన్ కు ప్లాన్..

Satyabhama Today Episode : చక్రవర్తికి నిజం చెప్పిన సత్య.. కొత్త జంట హనీమూన్ కు ప్లాన్..

Satyabhama Today Episode February 8 th:  నిన్నటి ఎపిసోడ్లో.. సంజయ్ సంధ్యలకు శోభనం ఏర్పాట్లు చేస్తుంది బైరవి. ఈరోజు వీళ్ళిద్దరి శోభనం జరిపిస్తే సంధ్య నాకు కొంగు పట్టుకుని తిరుగుతుందని ప్లాన్ వేస్తుంది బైరవి అనుకున్నట్లుగానే సంధ్యకు సంజయ్ కు శోభనం శోభనం జరిపించాలని అనుకుంటుంది. ఇక సత్య గదిలోకి వెళ్లే సరికి క్రిష్ బెడ్ సర్దుతూ సత్య వెంట పడుతుంది. క్రిష్ సత్యతో కాసేపు మనం ఫస్ట్ నైట్ చేసుకునే అమ్మాయి అబ్బాయిలా మారిపోదాం అంటే సత్య తాను అబ్బాయి అని క్రిష్ని అమ్మాయిలా నటించమని అంటుంది. క్రిష్ సిగ్గు పడుతూ సత్య దగ్గరకు రావడంతో సత్య క్రిష్ని పట్టుకొని కొరికేస్తాను నిన్ను మొత్తం కొరికేస్తాను అని అంటుంది. ఇద్దరూ చక్కగా నవ్వుకుంటారు. సత్య నవ్వు చూసిన క్రిష్ నువ్వు నీలాఉంటేనే బాగుంటుంది సత్య. ఏం మిస్ అవుతున్నావ్ తెలుసా అని అడుగుతాడు.. ఆ తర్వాత చీర కలిపినందుకు పెద్ద రచ్చ చేసిన భైరవి సత్యకు ఇంకెలాగైనా కోపం తెప్పించాలి సంధ్యను పూర్తిగా నా వైపు మార్చుకోవాలని పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది. ఇక సంధ్య, సంధ్యల కోసం ఫస్ట్ నైట్ ఏర్పాట్లను చేస్తుంది భైరవి.. ఇక అంతా సరదాగా ఉంటారు. కానీ సత్య కోపంగా ఉంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంధ్య, సంజయ్ లు తమ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ బంధాటాడుతారు అయితే బంతి పోయి సంధ్య క్రిష్ కి వేస్తుంది. క్రిష్ సత్యకు వేస్తాడు సత్య కోపంతో ఆ బంతిని విసిరి కొడుతుంది.. ఇక అందరూ తల ఒక మాట అంటారు దాంతో భైరవి నీ పెళ్ళానికి ఈ శోభనం ముచ్చట్లు ఇష్టం లేకపోతే లోపలికి వెళ్ళమని రా ఇక్కడ ఎందుకు అనవసరంగా అనేసి అనగానే సత్య నాకు ఇష్టం లేదని లోపలికి వెళ్తుంది ఇక క్రిష్ కుడా వెనకాల వెళ్తాడు. ఏమైంది సత్యా ఎందుకు అలా చేశావు నువ్వు కావాలని చేయలేదు నాకు తెలుసు.. కానీ అందరు అలానే అనుకుంటున్నారు కదా అనేసి అనగానే సత్య బాధపడి మళ్లీ కిందికి వెళ్దాం రా వాళ్ల చేత ఉంగరాలు ఇస్తున్నారని తీసుకెళ్తాడు. ఇక కింద సంధ్యా సంజీవ్లతో ఉంగరాలట ఆడిపిస్తారు. సంధ్య ఉంగరాన్ని తీసుకుంటుంది. ముహూర్తం ఎన్నిటికి అని జయమ్మ అడుగుతుంది. పంతులు అడిగారా అని అడిగితే పంతులును అడగలేదు అత్తమ్మ ఇంత దూరం వచ్చిన తర్వాత ముహూర్తం ఎందుకు వాళ్లిద్దరు ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకున్నారా అని అనగానే పెళ్లికి ముహూర్తం లేకపోయినా దీనికి మాత్రం ముహూర్తం ఉండాలి అని పంచాంగం బుక్కు తీసి చూస్తుంది..

మంచి ముహూర్తం లేదని చెప్పడంతో సంజయ్ సంధ్య ఇద్దరు షాక్ అవుతారు. ఇక ఎవరి దారిన వారన్నట్టుగా వేర్వేరు రూంలో పడుకుంటారు. ఉదయం లేవగానే సోఫాలో కూర్చుని ఏదో కోల్పోయినట్లు బాధగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చేసింది మా అక్క అని సంధ్య అంటుంది. సంజయ్ కూడా ఏమీ తెలియనట్లు ఇదంతా మీ అక్క చేసిందా ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఏంటి అని షాక్ అయినట్టు యాక్ట్ చేస్తాడు.. ఇక అప్పుడే మహదేవయ్య అక్కడికి వస్తాడు. నేను మీ అత్తయ్య ముహూర్తాలు పట్టింపులు అవన్నీ ఏం పట్టించుకోమమ్మా కానీ అమ్మ గురించి తెలిసింది కదా ఆ చాదస్తం ఎక్కువ అయితే మీకు హనీమూన్ ఏర్పాట్లు చేశాను మీరు మరో మూడు రెండు రోజుల్లో హనీమూన్ కి వెళ్ళబోతున్నారు అని మహదేవయ్య అంటారు. ఆ విషయాన్ని సత్య వింటుంది..


ఇక మహదేవ సత్య దగ్గరికి వచ్చి ఏంటి కోడలా ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటున్నవా లేకపోతే నీ చెల్లి ప్రాణాలు పోగొట్టుకుంటుంది నీకు ఏది కావాలో ఆలోచించుకో నీ చెల్లి ప్రాణాల ఎలక్షన్స్ లో నిలబడడం అనేసి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఇక సత్యా సంధ్య ని ఎలా కాపాడుకోవాలని టెన్షన్ పడుతూ ఉంటుంది. రూమ్ లోకి వెళ్లి ఏడుస్తుంది ఆ తర్వాత ఏం చేయాలి నాకున్నదే రెండు రోజులు ఒకదాని వెనక ఒకటి వస్తుందని బాధపడుతుంది. ఇక చక్రవర్తి కి ఫోన్ చేస్తుంది సంజయ్ కి పెళ్లైన విషయం మీకు తెలుసా అసలు మీరు ఈ ప్రపంచం లోనే ఉన్నారా? ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అవతలి వాళ్ళు ఏమైనా మీరు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నారా అనేసి సత్య చక్రవర్తిని నిలదీస్తుంది.

మా అన్నయ్య సంజయ్ పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు ఒప్పుకోడు కదా అనేసి అంటాడు.. అదంతా వాళ్ళు పెద్ద డ్రామా చేస్తున్నారు తండ్రి కొడుకులు కలిసి నా చెల్లెల్ని ట్రాప్ చేసి నన్ను ఎన్నికల నుంచి తప్పించాలని చూస్తున్నారు మీరు ఏదో ఒకటి చేయాలి మామయ్య అనేసి సత్య బాధపడుతుంది. సడన్గావడు షాక్ ఇస్తాడని అస్సలు అనుకోలేదమ్మా. వాడు రూపాని అమ్మాయిని ఫారిన్లో ప్రేమించాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. మరి ఇప్పుడు సంధ్య ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని అనగానే ఆ విషయాన్ని మీరే చెప్పండి మావయ్య అనేసి అంటుంది. సత్య చక్రవర్తి తో మాట్లాడటం క్రిష్ వింటాడు. నువ్వు బాబాయ్ ని ఎందుకు రమ్మని చెప్పావు సంజయ్ పెళ్లి గురించి బాబాయి ఎంత రచ్చ చేస్తాడు ఇది ఆలోచించవా అని సత్యము నాన్న మాటలు అంటాడు క్రిష్..

క్రిష్ మాటలు విన్న సత్య బాధపడుతుంది. నేను స్వార్ధపరగాలని మీరు అనుకుంటున్నారు నా చెల్లి మీద నాకు ద్వేషముంటే నేను ఎందుకు ఇలా చేస్తాను తనకు దాన్ని వదిలేసేదాన్ని కదా అయినా కానీ సంజయ్ మాయలో పడి అది తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందని నేను బాధపడుతున్నాను అది మీకు ఎందుకు అర్థం కాదు ఇప్పుడు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా తిడతావా అనేసి సత్య బాధపడుతుంది. ఇక ఉదయం లేవగానే అక్కాచెల్లెల్లు ఇద్దరు పూజ చేయడానికి ఎదురెదురుగా వస్తారు.. సంధ్య మొత్తానికి పూజ చేసే అవకాశాన్ని అందుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×