Satyabhama Today Episode January 28th: నిన్నటి ఎపిసోడ్ లో… సంజయ్ బండిపై వెళుతున్న సంధ్యని చూస్తుంది సత్య.. కాల్ చేసి అడిగితే కంప్యూటర్ క్లాస్ కి వెళ్లాను ఇప్పుడే ఇంట్లోకి వెళుతున్నా అంటుంది. సంజయ్ బైక్ పై నిన్ను చూశాను అంటే తను లిఫ్ట్ ఇచ్చాడని అబద్ధం చెబుతుంది. తనకి దూరంగా ఉండు అని చెబుతుంది..సత్య ఇంట్లోకి అడిగి పెట్టడంతో మీడియా వాళ్ళు అక్కడికి వస్తారు. వరంగల్ లో ఇలాంటి ధైర్యం ఎవరూ చేయలేదు అంటారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇలా చేశారా అంటే.. దీనికి ఎన్నికలకు ముడిపెడతారని నాకు తెలుసు.. సమాజంలో సమస్యల పట్ల ఇలాగే రియాక్టవుతాను. ప్రచారం కోసం కాదు తోటి ఆడపిల్లల పట్ల బాధ్యత అనుకుని చేశానంటుంది. అది మీడియాలో టెలికాస్ట్ అవడంతో అటు క్రిష్ ఫుల్ ఖుషి అవుతాడు.. ఆ వీడియో టీవీ లో రావడంతో సత్య క్రేజ్ పెరుగుతుంది. అయితే మహాదేవయ్యకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. ఎక్కడ విన్నా సత్య అనే పేరు వినిపిస్తుందని కోపంగా ఉంటాడు. ఇక పార్టీ నుంచి మహాదేవయ్యకు ఫోన్ వస్తుంది. నీ కోడలు క్రేజ్ పెరుగుతుంది. చూసుకో నువ్వు ఓడిపోకుండా ఏం చేస్తావో అది చెయ్యి అని అంటాడు. మహాదేవయ్య సత్యను ఎలాగైన అడ్డు తప్పించాలని అనుకుంటాడు. ఇక మహదేవయ్యసంజయ్ కు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాడు. నీ చిలక ని ఎలాగైనా ఈ సత్య పై ఉసిగొలుపు అదే ఎన్నికల నుంచి తప్పుకుంటుంది అని ప్లాన్ చేస్తారు.. సత్యకు సంజయ్ సంధ్య గురించి అసలు నిజం చెప్పేస్తాడు. పోటీ నుంచి తప్పుకోవాలని హెచ్చరిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం సంధ్య సంజయ్ కి ఫోన్ చేస్తే సత్య లిఫ్ట్ చేస్తుంది. వాళ్ల ప్రేమ విషయం సత్యకు తెలిసిపోతుంది.. ఇక సత్యా సంజయ్ దగ్గరకు వచ్చి తన చెల్లి జోలికి వస్తే అసలు ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. ఇక సంజయ్ కూడా సత్యకు ఎన్నికల నుంచి తప్పుకుంటేనే సంధ్యను విడిచిపెడతానని అంటాడు. నేను సంధ్యను లవ్ ట్యాప్ లో పడే దానికి కారణం నువ్వే నీ అందాన్ని నేను మర్చిపోలేను అందుకే సంధ్యకు వలవేసి ఎర్రగా వేసి నిన్ను పట్టుకోవాలని చూస్తున్నానని చెప్తాడు. నీ చెల్లెలు నీ పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకువచ్చి నరకాన్ని చూపిస్తానని వార్నింగ్ ఇస్తాడు. వెంటనే తన పుట్టింటికి వస్తుంది. సంజయ్ సంధ్య కు ఫోన్ చేస్తాడు. మీ అక్క ఎన్నికల నుంచి తప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందని మా బిగ్ డాడీ అనుకుంటున్నాడు నువ్వు అలానే మాట్లాడు అని రెచ్చగోడతాడు.
ఇక సత్యా సంధ్య వాళ్ళ ఇంటికి వస్తుంది.. ముందర సంధ్య చంప పగలగొడుతుంది. ఇంట్లో వాళ్లందరికీ సంజయ్ గురించి అసలు నిజం బయటపెడుతుంది. సంధ్య కూడా అక్క నా పెళ్లిని చెడగొట్టాలని ప్లాన్ చేస్తుందని అందరి ముందర చెప్తుంది.. ఇక సత్య తనపై కన్నేసిన విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తుంది. సంధ్యాను అడ్డుపెట్టుకొని నన్ను ఎన్నికల నుంచి తప్పించాలని పెద్ద ప్లాన్ వేశారు సంధ్య వాళ్ళ ఉచ్చులో పడిపోయింది ఇక బయటకు రావడం కష్టం అది గుడ్డిగా నమ్మేసింది అని అంటుంది. ఈ సంధ్య అక్కకి నేను పెద్దింటి కోడలు అవుతున్నాను కదా అందుకే కుళ్ళు ఆ ఇంటికే నేను కోడలుగా వస్తే తన పంతం చెల్లదని తన ఫీలవుతుందని మాటకు మాట సమాధానం చెప్తుంది. నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకు ఎందుకు అలాంటి కండీషన్ పెడతారు. వాళ్ల టార్గెట్ నేను సంధ్య. నన్ను ఓడించడానికి నిన్ను బలి చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా. అమాయకంగా చెల్లి వాళ్లు ఉచ్చులో లాగుతుంది. అందరి జీవితాలు అయోమయంలో పడతాయి నాన్న. మనసులో సంజయ్ ఆ మహదేవయ్య కొడుకు అది నేను ఎలా చెప్పగలను చెప్పినా ఎవరు నమ్ముతారు. కానీ విశాలక్షి వచ్చి మాత్రం సత్య చెప్పిందానికి ఒప్పుకుంటుంది. అందుకు రేపు పెళ్లిచూపులు జరగబోతున్నాయి ఆ అబ్బాయిని ఖాయం చేస్తాం ఇక నువ్వు వెళ్ళు నువ్వు నిశ్చింతగా ఉండు నీ పని నువ్వు చూసుకో అనేసి విశాలాక్షి అంటుంది.
పైకి మంచిగా కనిపించే సంజయ్ ఇలాంటి పని చేస్తాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను వదిన అనేసి నందిని అంటుంది. బాపు ఎన్నికల నుంచి నేను తప్పించాలని ఇలాంటి ప్లాన్లు వేశారంటే నువ్వు ఒంటరిగా అక్కడ పోరాటం చేస్తావని భయమేస్తుందని నందిని అంటుంది.. ఇక సంజయ్ స్వీట్స్ తీసుకొని మహదేవయ్య దగ్గరకు వెళ్తాడు. సత్య ఎలక్షన్లో పోటీ పడదని సంధ్య అడ్డుకుంటుందని అక్కడ మంట పెట్టానని చెప్తాడు. ఇద్దరూ హ్యాపీగా స్వీట్స్ తింటారు. ఇంతలో ఇంటిళ్లపాది అక్కడికి వస్తారు. ఏంటి స్పెషల్ అని అడుగుతారు. దాంతో ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. మహదేవయ్య అందరితో సంజయ్ ప్రేమలో పడ్డాడని చెప్తాడు.. భైరవి స్వీట్ చాలా చేదుగా ఉంది పోయి ఇంకొక కొరివిని ఇంట్లో పెట్టుకోవాలా అనేసి అంటుంది. క్రిష్ మాత్రం ఆ ఇంటి పై ఎటువంటి మాట పడనివ్వకుండా చాలా మర్యాదస్తులు కుటుంబమని చెప్తాడు. అప్పుడే సత్య ఎంట్రీ ఇస్తుంది.
ఇక సత్య వస్తే క్రిష్ వెళ్లి స్వీట్ ఇవ్వమని చెప్తాడు. సంజయ్ సత్యకి స్వీట్ ఇస్తే సత్య దాన్ని విసిరి కింద కొడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఓడిన వాడు మళ్లీ గెలవొచ్చు కానీ దిగజారిన వాడు ఎందుకూ పనికి రాడని నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమవుతుందని సంజయ్తో అంటుంది. సంధ్యతో నీ పెళ్లి జరగదు అని సంధ్యని మర్చిపో అని వార్నింగ్ ఇస్తుంది. సంజయ్ తమని విడదీయొద్దని అంటాడు. నీ పెళ్లాం మన ఫ్యామిలీనే అవమానించిందని రుద్ర క్రిష్తో అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. క్రిష్ కు సంజయ్ అసలు స్వరూపం గురించి చెప్పేస్తుందేమో చూడాలి..