BigTV English

Director Bobby: సీనియర్ హీరోలకు ఈయనే గోల్డెన్ డక్.. నాగ్ తెలుసుకుంటాడా.?

Director Bobby: సీనియర్ హీరోలకు ఈయనే గోల్డెన్ డక్.. నాగ్ తెలుసుకుంటాడా.?

Director Bobby: ఒకప్పుడు సీనియర్ హీరోలు.. యంగ్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న సీనియర్ దర్శకులు అయితేనే తమకు హిట్లు ఇవ్వగలరనే నమ్మకంతో ఉండేవారు. కానీ రోజులు మారిపోయాయి. యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయడానికి ఈ హీరోలు ముందుకొస్తున్నారు. పైగా ఆ దర్శకులు కూడా తమ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. అలాంటి డైరెక్టర్స్‌‌లో ఒకడు బాబీ. ప్రస్తుతం బాలకృష్ణతో తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ మూవీ విడుదలయ్యి కొన్నిరోజులే అయినా వెంటనే మరో సీనియర్ హీరోను లైన్‌లో పెట్టాడట బాబీ.


నాగార్జున మాస్టర్ ప్లాన్

2014లో రవితేజ హీరోగా నటించిన ‘పవర్’ అనే సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు బాబీ కొల్లీ. ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్నా కూడా రెండో చిత్రాన్ని వపన్ కళ్యాణ్‌తో చేసే ఛాన్స్ కొట్టేశాడు. అలా అప్పటినుండే సీనియర్ హీరోలను లైన్‌తో పెడుతూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నాడు. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి హీరో వెంకటేశ్‌తో ‘వెంకీ మామ’ తెరకెక్కించాడు. ఈ మూవీ క్లీన్ హిట్‌ను సాధించింది. ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవికి హిట్ అందించాడు బాబీ. ఇప్పుడు ‘డాకు మహారాజ్’తో బాలయ్యకు కూడా మంచి హిట్‌ను ఖాతాలో వేశాడు. సీనియర్ హీరోలకు గోల్డెన్ డక్‌గా మారిన బాబీ.. తన తరువాతి చిత్రాన్ని నాగార్జునతో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.


హిట్ కావాలి

సీనియర్ హీరో నాగార్జునకు ఇప్పుడు ఒక గుర్తుండిపోయే హిట్ ఇచ్చే దర్శకుడు కావాలి. సోలో హీరోగా నాగార్జున హిట్ కొట్టి చాలాకాలమే అవుతోంది. తను హీరోగా నటించిన చివరి చిత్రం ‘నా సామిరంగ’ కాస్త పరవాలేదనిపించింది. కానీ చాలాకాలంగా ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న తనకు అంతగా రిలీఫ్ అందించలేకపోయింది. ప్రస్తుతం నాగార్జున చేతిలో రెండు సినిమాలు ఉన్నా.. ఆ రెండిటిలో తను హీరోగా నటించడం లేదు. అందుకే సోలో హిట్ కోసం నాగ్ తపన పెరిగిపోయింది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు గోల్డెన్ డక్‌గా కనిపిస్తున్న బాబీ (Bobby)పై నాగార్జున దృష్టిపడిందని, తన తరువాతి సినిమా కోసం బాబీకి ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read: నాకు అంతే చాలు.. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అనడంపై అంజలి కామెంట్స్

హీరో కాదు

ప్రస్తుతం నాగార్జున (Nagarjuna).. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మూవీ చేస్తున్నాడు. కానీ అందులో హీరో ధనుష్. ధనుష్‌తో పాటు నాగ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఆయన నటిస్తున్న మరొక సినిమానే ‘కూలీ’. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో నాగార్జున ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. అలా చేతిలో ఉన్న రెండు సినిమాల్లో కూడా ఆయన హీరో కాకపోవడంతో మళ్లీ తను సోలో హీరోగా ఫామ్‌లోకి రావాలని నిర్ణయించుకున్నారు. అందుకే తన అప్‌కమింగ్ మూవీకి దర్శకుడిగా బాబీని ఎంచుకున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో దాదాపు అందరు సీనియర్ హీరోలకు హిట్లు ఇచ్చిన బాబీ.. నాగార్జున కెరీర్‌ను ఏ విధంగా ముందుకు నడిపించగలడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×