Satyabhama Today Episode January 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. శేషు చెప్పిన నిజాన్ని విని షాక్ అవుతుంది. నందిని ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేస్తుంది. టీవీలో సత్య పోటీ చేయబోతున్నట్టు ప్రకటిస్తుంది అది విన్న విశ్వనాథ కుటుంబం అంతా షాక్ అవుతుంది. అసలు సత్య ఎందుకిలా చేస్తుందని మాట్లాడుకుంటారు. కానీ నందిని మాత్రం సత్యకు సపోర్ట్ చేస్తుంది. మాకన్నా ఎక్కువగా మీ నాన్న గురించి నీకే తెలుసు మరి ఎందుకు నువ్వు సత్యకు సపోర్ట్ చేయాలనుకుంటున్నావ్ అనేసి హర్ష అంటాడు. ఎలక్షన్లో పోటీ ఎవరైనా చేయొచ్చు తిక్క కుదిరితే నేను కూడా మా బాపుకి పోటీగా నిలుస్తాను అనేసి అంటుంది. అటు టెన్షన్ పడుతూ ఉంటుంది సత్తికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి ఏమంటుందో అంటే వినేదే అయితే ఎప్పుడో వినేది మన చేయి దాటి పోయింది విశాలాక్షి అని అంటాడు. ఇక సత్యా పోటీలో నిలబడుతున్న విషయం నరసింహ తెలుసుకొని సంబర్ పడిపోతాడు. మహదేవయ్యకు తన ఇంటి నుంచి పోటీ రాబోతుంది ఇది కదా మజా అంటే అని గంతులు వేస్తాడు. మహాదేవయ్యను హెచ్చరిస్తారు అందరు.. క్రిష్ ను ట్రాప్ చేస్తుంది సత్య.. బెడ్ రూమ్ లో ఓన్లీ రొమాన్స్ అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తర్వాత రోజు ఉదయం సత్య కాఫీ తీసుకొచ్చి భైరవికి మహదేవయ్యకు ఇస్తుంది. మహదేవయ్య తన మనిషిని పిలిచి నామినేషన్ కి టైం అయింది ఎలా చేయాలా అనేది అడుగుతాడు. నువ్వు చెప్పు చిన్న కోడలా నువ్వెలా వెళ్లి నామినేషన్ చేస్తావంటే నాకు అంత ఆడంబరాలు అవసరం లేదు అని అంటుంది.. నీకోసం పదిమంది ఎవరు వస్తారో నేను చూస్తాను. ఆ మాత్రం తెలియకుండానే నామినేషన్స్ లో నిలబడ్డావా అనేసి మహాదేవయ్యా సత్యకు కౌంటర్ లేస్తాడు. సత్య మాత్రం పది మందిని తెచ్చుకోలేనా అనేసి ధీమా గా ఉంటుంది.. ఇక క్రిష్ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని అడుగుతుంది. నామినేషన్ వేయాలంటే పదిమంది కావాలా అనేసి అంటుంది. ఈ మాత్రం కూడా తెలియకుండా నువ్వు ఎలక్షన్స్ లో ఎలా నిలబడదామనుకున్నావో ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేద్దాం అనుకున్నాం అనేసి చులకనగా మాట్లాడుతాడు. గదిలోపల రాజకీయాల గురించి మాట్లాడొద్దు అన్నావ్ ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ అని క్రిష్ అంటాడు అయితే గార్డెన్ లోకి వెళ్లి మాట్లాడుకుందాం రా అని అనగానే నాకు ఆ పట్టింపులు లేవు అని క్రిష్ చెప్తాడు.
అధికారంలో ఉండే పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళు కేవలం ఆ పార్టీ ఇన్చార్జ్ సంతకం పెడితే సరిపోతుంది. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళు ఆయన వెనకాల ఒక 10 15 మంది ఉండాలి ఎందుకంటే ఒక పదిమంది కూడా లేనివాడు ఎలక్షన్స్ లో ఎలా నిలబడతాడని అందరూ అంటారు. అప్పుడే నామినేషన్స్ ని తీసుకుంటారు. లేదంటే మాత్రం నామినేషన్స్ ని రిజెక్ట్ చేస్తారని క్రిష్ చెప్తాడు మరి నీ తరఫున పదిమంది ఎవరు అనగానే నా భర్త అనేసి అంటుంది. దానికి క్రిష్ మాత్రం చాన్సే లేదు అనేసి అంటాడు.. ఇక క్రిష్ బయట పనోల్లతో పనిచేస్తుంటాడు. నందు నీ కోపంగా వచ్చి బాపు అని అరుస్తుంది. ఇక క్రిష్ ఏమైంది అలా అరుస్తున్నావని అంటాడు. మహదేవయ్య కూడా ఏంది బిడ్డ ఎలా వచ్చావు అనేసి నన్ను దగ్గరికి వెళ్తాడు చాలు ఆపు నీ నాటకాలని నందిని కసురుకుంటుంది.. ఇక జయమ్మ ఏమైంది అలా అరుస్తున్నామంటే నాన్న నా మీద చాలా ప్రేమతో చేస్తున్నాడు. నాకు అత్తింటి వాళ్ళని కష్టపెడుతున్నాడు నా అత్తమామల్ని కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తున్నాడని నందిని ఆరోపిస్తుంది. నీకెవరు చెప్పారే ఇదంతా అనేసి జయం అనగానే సాక్ష్యం లేకుండా నేను ఇంత రాలేదు మాకు ఎవరైతే ఇళ్ళు అమ్మాడో ఆ శేషునే ఇదంతా చెప్పాడు అనేసి చెప్తుంది.
ఆ శేషు ఎక్కడున్నా రెండు నిమిషాల్లో తీసుకురావాలనేసి చిన్నాకి చెప్తాడు చిన్న తన మనుషులతో శేషుని తీసుకొని వస్తారు. ఇక్కడ ఏమి ఎవరుమంతా వేరేగా ఉంది అనేసి ఆలోచిస్తూ వస్తాడు. నిన్న నువ్వు నాకు ఏదైతే చెప్పావు అది వీళ్ళందరూ ముందర చెప్పు నువ్వు దొంగ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మా ఇంటిని కబ్జా చేసావు కదా అనేసి నందిని నిలదీస్తుంది. శేషు మనం బాగోగులు గురించి మాత్రమే కదా మాట్లాడుకుంది అయ్యో రామ మహాదేవయ్య గారు దేవుడని ఆకాశానికి ఎత్తేస్తాడు. ఇక క్రిష్ అతని పంపిస్తాడు.. దీన్ని కూడా కొనేశావా నీ రాజకీయ బుద్ధి చూపించినావు కదా అనేసి నందిని అంటుంది. భైరవి నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పేసి అరుస్తుంది. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో బాపు నువ్వు ఇలాంటి రాక్షసుడు కాబట్టే వదినా నీకు పోటీగా ఎమ్మెల్యేగా నిలబడాలనుకుంటుంది వదినకి ఎవరు సపోర్ట్ చేయాలనుకుంటున్నావేమో నేను వదినకు సపోర్ట్ గా ఉంటానని చెప్పేసి హామీ ఇస్తుంది. నంది నీతో మాట్లాడుతుంది నువ్వు తొందర పడ్డావు నందిని అనేసి సత్య అంటుంది. ఇప్పటికి చాలా ఆలస్యం చేసిన వదిన నేను సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది నువ్వు ఎలక్షన్లో నిలబడు అనేసి భరోసా ఇచ్చి వెళ్తుంది..
సంజయ్ సంధ్య కు ఫోన్ చేసి సత్య పై లేనిపోనివి నూరిపోస్తాడు. మనల్ని కలుసుకుని ఇవ్వకుండా చేస్తుందనేసి మనసులో అనుమానాన్ని కలిగిస్తాడు. సంధ్య నువ్వు ఎలాగైనా లొంగదీసుకోవాలని సత్యను బ్యాడ్ చేయాలని సంజయ్ ప్లాన్ చేసి మరి సంధ్య కు నూరిపోస్తాడు. అది నమ్మిన సంధ్య ఎలాగ నా అక్కని కంట్రోల్ చేయాలి ఎలక్షన్స్ లో నిలబడకుండా చేయాలి అనేసి అనుకుంటుంది. ఇక మహదేవయ్యతో సత్య ఛాలెంజ్ చేస్తుంది. హిరణ్యకశిపుడు కథని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..