Gautam Gambhir: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా ప్లేయర్ల ఆట తీరుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. గంభీర్ భారత జట్టుకు కోచ్ గా వచ్చిన తరువాత కేవలం బంగ్లాదేశ్ సిరీస్ మినహా న్యూజిలాండ్ చేతిలో సొంత గడ్డపై ఓటమి, ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర ట్రోఫీలో భారత జట్టు పరాభవాలపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Travis Head: కావ్యా పాపపై ట్రోలింగ్…SRH నుంచి హెడ్ ఔట్…?
డ్రెస్సింగ్ రూమ్ లో వికెట్ కీపర్ రీషబ్ పంత్ తో పాటు ఇతర సీనియర్లపై కూడా గంభీర్ తీవ్ర అసహనం కనబరిచారట. మళ్లీ ఇటువంటివి రిపీట్ అయితే వేటు తప్పదని హెచ్చరించారట. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ప్రణాళికలు అమలు చేయడంలో భారత ఆటగాళ్లు విఫలమైనందుకు కోచ్ గంభీర్ అందరికీ చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం వేడెక్కిందని.. కెప్టెన్ రోహిత్ శర్మతో కోచ్ గంభీర్ కి విభేదాలు వచ్చినట్లు కొన్ని వార్త కథనాలు పేర్కొంటున్నాయి.
దీనిపై తాజాగా గంభీర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోచ్ కి, ప్లేయర్స్ కి మధ్య చర్చ డ్రెస్సింగ్ రూమ్ వరకే పరిమితం కావాలని.. అవి బయటకు రాకూడదని సూచించారు. అయితే గత కొద్ది రోజులుగా వరుసగా విఫలం అవుతున్న రోహిత్ శర్మ.. ఇక రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు అంటూ జోరుగా చర్చ జరుగుతున్న వేళ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిడ్నీ వేదికగా జరగబోయే ఐదవ టెస్ట్ లో రోహిత్ శర్మ ఆడబోతున్నారా..? అని తాజా ప్రెస్ మీట్ లో గంభీర్ కి ప్రశ్న ఎదురైంది.
దీనిపై ఆయన స్పందిస్తూ.. రేపు పిచ్ ని పరిశీలించి, టాస్ తరువాతే జట్టును ప్రకటిస్తామని గంభీర్ తెలిపారు. అయితే ఈ ఐదవ టెస్ట్ కి రోహిత్ ని పక్కన పెట్టి.. కెప్టెన్ బాధ్యతలను బూమ్రా కి అప్పగించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ పై గంభీర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని.. ఈ నేపథ్యంలో మిగతా ఆటగాళ్లు నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడట. దీంతో రోహిత్ ఒంటరిగా మిగిలిపోయాడని కథనాలు వెలువడుతున్నాయి.
ఈ చివరి టెస్ట్ లో టీం ఇండియా విజయం సాధిస్తే సిరీస్ ని 2 – 2 తో డ్రా చేసుకోగలుగుతుంది. లేదంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చేజారడంతోపాటు డబ్ల్యూటీసి ఫైనల్ ఆశలు కూడా గల్లంతవుతాయి. ఈ నేపథ్యంలోనే భారత ఆటగాళ్లపై కోచ్ గంభీర్ తీవ్ర ఆచారం వ్యక్తం చేశారట. జట్టు ప్రదర్శనను విశ్లేషించే క్రమంలో ప్లేయర్స్ తప్పులను ఎత్తి చూపిస్తూ.. కొందరు ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్లు ఆడకుండా, సొంత ఆట ఆడుతున్నారని మండిపడ్డారట.
Also Read: Glenn Maxwell’s Catch: మాక్స్ వెల్ క్రేజీ క్యాచ్..బిత్తరపోయిన బ్యాట్స్ మెన్ !
ఇకనుండి తాను చెప్పినట్లే ఆడాలని హుకుం జారీ చేశాడని సమాచారం. ఇక బౌలర్ల విషయంలోనూ బూమ్రా మినహా పెద్దగా ఎవరు రాణించడం లేదని క్లాస్ తీసుకున్నారట. ఆరు నెలలుగా ప్లేయర్స్ కి స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ ఎవరు దానిని నిలబెట్టుకోలేకపోతున్నారని.. ఇకపై వాతావరణం ఇలా ఉండదని హెచ్చరించారట గంభీర్. జట్టు వ్యూహాలకు అనుగుణంగా ఆడని వారిపై తప్పకుండా వేటు పడుతుందని వార్నింగ్ ఇచ్చారట.