Horoscope leo 2025 : గ్రహాల సంచారం ప్రకారం రాశి ఫలాలను అంచనా వేస్తారు. సింహ రాశి జాతకులకు ఈ సంవత్సరం 2025లో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సవరం సింహ రాశి జాతకులకు ఆదాయం -11, వ్యయం-11గా ఉంది. అంటే పదకొండు రూపాయలు సంపాదిస్తే పదకొండు రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. ధన పరంగా సింహ రాశి జాతకులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుందనే చెప్పాలి. ఇక రాజ్యపూజ్యం-3, అవమానం -6 గా ఉంది. అంటే ముగ్గురు మీకు గౌరవం ఇస్తే.. ఆరు మంది మిమ్మల్ని అవమానిస్తారు. ఇక ఈ సంవత్సరం నెలల వారీగా ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి : సింహ రాశి జాతకులకు ఈ నెలలో అవసరాలకు తగిన సొమ్ము చేతికి అందుతుంది. అలాగే అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. ఇండ్లు, వాహనాల కొనుగోళ్లు వాయిదా వాయిదా వేసుకొవడం మంచిది. కోర్టు వ్యవహారములు అనుకూలముగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు.
ఫిబ్రవరి : సింహ రాశి జాతకులకు ఈ నెలలో గతంలో ఉన్న ఇబ్బందులు తగ్గిపోతాయి. కొంత సొమ్ము చేతికి అందుతుంది. పండ్లు, కూరగాయలు, పాలు, పూల వ్యాపారులకు కొంత మేర లాభాలు గడిస్తారు.
మార్చి : సింహ రాశి జాతకులకు ఈ నెలలో వ్యాపారులకు గతంకంటే ఖర్చులు తగ్గును. విద్యా, వైద్యరంగాల వారు ఆదాయమునకు మించిన ఖర్చులు చేస్తారు. విశేష శ్రమ చేస్తే సామాన్య పలితం లభిస్తుంది.
ఏప్రిల్ : సింహ రాశి జాతకులకు ఈ నెలలో అధిక ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యము ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలెను. పై అధికారులతో చర్చలు జరుపుతారు. పాడి పరిశ్రమ, పండ్లు, కూరగాయలు అమ్మే వారికి ఈ నెల అనుకూలంగా ఉంది.
మే : సింహ రాశి జాతకులకు ఈ నెలలో శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. నెల చివరలో బాగుంటుంది. చేయు ప్రయత్న కార్యములు అన్నింట్లో విజయం చేకూరుతుంది. మాతృసౌఖ్యం, పేపరు వ్యాపారులకు ఆదాయం బాగుండును.
జూన్ : సింహ రాశి జాతకులకు ఈ నెలలో ఆరోగ్యం బాగుంటుంది. నెలంతా బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఈ నెలలో ఈ రాశి వారికి గొప్ప సన్మానాలు జరగుతాయి. సుఖ, సౌఖ్యాలు పొందుతారు. ఆదాయం ఎంత వచ్చినా వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
జూలై : సింహ రాశి జాతకులకు ఈ నెలలో వృత్తి వ్యాపారములలో ఎక్కువ లాభాలు ఉన్నాయి. సంఘములో సన్మానాలు పొందుతారు. అన్నింటా విజయం కలుగుతుంది. గాయకులకు, నటీనటులకు ఈ నెలంతా యోగదాయకంగా ఉంటుంది.
ఆగష్టు : సింహ రాశి జాతకులకు ఈ నెలలో సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. బొగ్గు, ఆయిల్, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీడియాలో పని చేసే వారికి శుభ సమయం.
సెప్టెంబర్ : సింహ రాశి జాతకులకు ఈ నెలలో పై అధికారుల ఆగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుంది. నెల ప్రారంభంలో వృత్తి, వ్యాపారాలలో నష్టాలు వచ్చినప్పటికీ.. తర్వాత అమితమైన లాభాలు కలుగుతాయి. వ్యవసాయదారులకు ఈ నెలంతా అద్బుతమైన పంటలు కలిసి వస్తాయి.
అక్టోబర్ : సింహ రాశి జాతకులకు ఈ నెలలో అకస్మాత్తుగా గొడవలు జరుగుతాయి. అన్నింట్లో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు. శరీరములో కొంత రుగ్మత ఉన్నప్పటికీ ఇబ్బంది ఉండదు. గాయకులకు, నటులకు, యోగదాయకముగా ఉంటుంది.
నవంబర్ : సింహ రాశి జాతకులకు ఈ నెలలో విజయం సాధిస్తారు. ధైర్యంగా ముందుకు వెళ్తారు. వ్యవసాయదారులకు పంటలు కలసి వస్తాయి. గాయకులకు నటులకు అద్బుతమైన యోగ కాలం ఉంది.
డిసెంబర్ : సింహ రాశి జాతకులకు ఈ నెలలో స్నేహితుల వలన ఇబ్బందులు అవమానములు ఎదుర్కొనవలసి వస్తుంది. స్త్రీల వలన ధనలాభమ, సుఖ సౌఖ్యాలు లభిస్తాయి. గృహ నిర్మాణ యోగము ఉంది.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?