Satyabhama Today Episode October 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. మహదేవయ్యకు గాయం తగలడంతో క్రిష్ బాధ పడిపోతాడు. అందరు కలిసి బాపు మీద నీకు కోపం ఉండొచ్చు కానీ మరి ఇంత ద్వేషం ఉండకూడదు.. నీ ఇష్టాలను నేను అర్థం చేసుకున్నా నాకు బాపు అంటే ఎంత ఇష్టమో నువ్వు అర్థం చేసుకోవాలని సత్యకు క్రిష్ చెబుతాడు.. ఇక సత్య కూడా క్రిష్ మనసును అర్థం చేసుకుంది.. ఇక భైరవి, పంకజం సత్యను ఇంట్లో నుంచి ఎలా పంపించాలని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ బామ్మ పండగ పూట నీ మొగుడు ఇంకా పడుకున్నాడా అంటుంది. దానికి ఆయనను లేపడం నా వాల్ల కాదు అంటుంది. ఎక్కడ వెదవ అంటే సత్య నేను తీసుకెళ్తాను చూడు నువ్వే అని బామ్మను క్రిష్ దగ్గరకు తీసుకొని వెళ్తుంది. క్రిష్ బామ్మ అరుస్తుంది లేవు అని సత్య అడిగితే, దాన్ని చంపుతాను అని చెప్పు అంటాడు. నువ్వు లేకుంటే గొడవలు వస్తాయని సత్య అంటుంది. ఏ కోడి లేవక ముందు లేస్తుంది.. అరుస్తుంది. ఎక్కువ మాట్లాడితే దాన్ని తాత దగ్గరకు పంపిస్తాను అని చెప్పు.. ఆ పొట్టి దానికి అని బూతులు తిడతాడు.. దానికి బామ్మ కోపంగా ఉంటుంది. ఇక లేవరా అని అంటే క్రిష్ బామ్మను లాగుతాడు.. దానికి నడుం విరిగిందని అరుస్తుంది. నువ్వేం చేస్తున్నావే ఇక్కడ అని క్రిష్ బామ్మను అడుగుతాడు. బుద్ది తక్కువ అయ్యి వచ్చాను అంటుంది. క్రిష్ కు నాలుగు చివాట్లు పెట్టి వెళ్తుంది.
ఇక క్రిష్ సత్యతో రొమాన్స్ చేస్తాడు.. కాసేపు వీరిద్దరి రొమాన్స్ తో అందంగా ఉంటుంది. ఆ తర్వాత క్రిష్ నుంచి తప్పించుకొని సత్య వెళ్ళిపోతుంది.. ఇక మహాదేవయ్య క్రిష్ ను పిలిచి 5 కోట్ల డబ్బులను పార్టీకి ఇవ్వాలని చెబుతాడు. వాడు నరసింహ రెండున్నర కోట్లు మాత్రమే ఇచ్చాడు. వాడికన్నా మనం తగ్గేదేలే అని 5 కోట్లు ఎవరి కంట పడకుండా పార్టీకి చేరాలని చెబుతాడు. అలాగే బాపు అని క్రిష్ అనుకుంటాడు. అప్పుడు తన మనిషి ఇంత డబ్బులు చిన్నా బాబు తీసుకెళ్లడం మంచిది కాదు. ఆ నరసింహం దెబ్బ తిన్నాడు ఏదైనా చేస్తే ప్రమాదం.. మంది వెళ్తే మంచిది అంటాడు.. నాకేం కాదు బాపు చూపినట్లు తీసుకొని ఇచ్చి వస్తాను అని అంటాడు. అది విన్న సత్య క్రిష్ కు ఏదైనా అవుతుందేమో అని భయపడుతుంది.
క్రిష్ లోపలికి రాగానే భర్తతో ప్రేమగా మాట్లాడుతుంది. ఆ డబ్బులు ఇవ్వొద్దు అని ముద్దులతో భర్తకు చెప్పే ప్రయత్నం చేస్తుంది.. క్రిష్ మాత్రం వినడు. క్రిష్ ప్రమాదంలో పడుతున్నాడని సత్య బాధపడుతుంది. అది విన్న మహదేవ సత్య దగ్గరకు వస్తాడు. నువ్వు ముద్దులతో మురిపించిన నువ్వు ఏం చేసినా వాడు నా దగ్గర నుంచి బయటకు పోడు. నీ మెడలో వాడు పసుపు తాడు కడితే వారిని ఆడించే తాడు నా చేతిలో ఉంది అనేసి మహాదేవ సత్యతో అంటాడు. నీకు అంత దమ్మే ఉంటే వాన్ని ఆ డబ్బులు ఇవ్వకుండా ఆపు అనేసి సత్యతో మహదేవయ్యా ఛాలెంజ్ చేస్తాడు. సత్య ఎలాగైనా సరే కృష్ణ ఈ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలని ఆలోచిస్తుంది.
ఇక హర్ష మైత్రికి డబ్బులు సర్దుబాటు అవ్వలేదని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళమ్మ కాఫీ తీసుకుని వస్తే అమ్మా నేను నగలు ఇస్తావా మళ్ళీ తెచ్చి ఇస్తానని అడుగుతాడు . హర్ష వాళ్ళ నాన్న మాత్రం అందుకు కుదరదు అనేసి అంటాడు. ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు కానీ మేము ఏమీ అనలేదు అయితే ఇప్పుడు నీ తలకు మించిన భారాన్ని నీ మీద వేసుకోవద్దు అనేసి ఇంట్లో అందరూ తలా ఒక మాట ఇస్తారు. నా మీద మీకు అనుమానం ఉందా అనేసి హర్ష అడుగుతాడు. మాకు ఎవరికీ అనుమానం లేదురా కానీ నందిని కి అనుమానం రాకుండా చూసుకో అనేసి అంటారు. ఇక అప్పుడే నందిని వస్తుంది హర్ష వాళ్ళ బామ్మ మైత్రికి డబ్బులు సర్దుబాటు అవ్వలేదని మీ ఆయన ఆలోచిస్తున్నాడని చెప్తుంది. హర్ష ఏం కాదు నేను ఎక్కడ ఒకచోట తీసుకొస్తానని వెళ్ళిపోతాడు. ఇకనందిని ఈరోజు పండగపూట అన్ని వంటలు నేనే చేస్తాను నా వెనకండి మీరు చూస్తూ ఉండండి అత్తమ్మ అనేసి నందిని కూడా లోపలికి వెళ్ళిపోతుంది.
అటు సంజయ్ సంధ్య నువ్వు లైన్లో పెట్టే పనిలో ఉంటాడు. సంధ్య గుడికి వెళ్లడం గమనించి ఆమెకి దారిలో కనిపిస్తాడు తన మాటలతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తాడు. ఇక ఇంట్లో సత్య పూజలు చేస్తుంది. క్రిష్ ఆశీర్వాదం తీసుకోవాలని చెబితే, దానికి క్రిష్ పెద్ద క్లాస్ పీకుతాడు. ఇక బామ్మ ఆశీర్వాదం తీసుకోవాలని ఇటు రమ్మని అంటాడు దానికి తప్పుగా అర్థం చేసుకున్న అబ్బా నేను రాను అనేసి అంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మహాదేవ ఇంటికి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లు వస్తారు మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉందని సోదాలు నిర్వహించాలని చెప్తారు మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి..