Preethi Sharma : ఒకప్పుడు సినిమా హీరోయిన్ అంటే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు.. ఇటీవల కాలంలో సీరియల్ హీరోయిన్ ల కోసం అభిమానులు తెగ వెతికేస్తుంటారు. సోషల్ మీడియాలో సీరియల్ హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు తెగ ఆసక్తి కనబరుస్తుంటారు.. ఇక ప్రస్తుతం సీరియల్ హీరోయిన్లు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ గురించి ఆసక్తికర విషయాలను కూడా పంచుకుంటున్నారు.. అంతేకాదు పలు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. తాజాగా సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ కూడా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది.. అందులో తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటుగా తనకి ఇష్టమైన వాటిని కూడా బయట పెట్టడంతో అభిమానులు ఆ ఇంటర్వ్యూ వీడియో కి కామెంట్లు పెడుతున్నారు.. అసలు ప్రీతి ఏముంది? తన గురించి ఎలాంటి విషయాలను బయటపెట్టింది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో ప్రీతి శర్మ ఒకరు.. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులకు సుపరిచితమే.. ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగులో ప్రసారమయ్యే ప్రముఖ సీరియల్ పడమటి సంధ్యారాగం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.. అప్పట్లో మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. మనిషన్నాక ఏదో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది అని పెద్దలు ఊరికే అనలేదు. ఒక్కొక్కరి అభిరుచికి తగ్గట్లుగా వాళ్ళు అలానే ఉండాలని అనుకుంటారు. ఈమెకు కూడా ఒక పిచ్చి ఉందని చెప్పింది. ప్రీతి శర్మకు టాటూలు వేయించుకోవడం అంటే చాలా ఇష్టం. ఆమె ఒంటిపై ఉన్న టాటూలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది.. ఇప్పుడు మరోసారి ఆమె టాటూ గురించి మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ అమ్మడు 1999 లో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించింది. ఆమె చిన్నతనంలోనే ఆమె కుటుంబం తమిళనాడులోని కోయంబత్తూరు కు వచ్చేసారు. తమిళనాడులోనే ఉంటున్న ఈ అమ్మడు పదో తరగతి వరకు తన చదువుని పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ నటనపై ఆసక్తి ఉండడంతో ఆమె అటుగా అడుగులు వేసింది. ఇండస్ట్రీ లోకి రాకముందు టిక్ టాక్ లో అనేక వీడియోలను పెడుతూ తన క్రేజ్ ని, ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చింది.. ఆ తర్వాత ఆమె సీరియస్లలో అవకాశాలు రావడంతో బుల్లితెర పైకి అడుగు పెట్టింది.. 2018లో కలర్స్ తమిళ్ లో వచ్చిన ‘ఓరు కదై పాడట్టుమా సర్?’ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు అటు సినిమాలు కూడా చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది..జెమిని టీవీలోని ‘కావ్యాంజలి’ సీరియల్ ద్వారా తెలుగు టెలివిజన్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారమైన పడమటి సంధ్యారాగం సీరియల్ లో కనిపించి జనాలను మరోసారి మెప్పించింది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
Also Read :డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం.. ఆమె మరణం తీరని లోటు..