E-Paper
Advertisement

డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం.. ఆమె మరణం తీరని లోటు..

డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం.. ఆమె మరణం తీరని లోటు..
Advertisement

Tollywood Director : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అక్క మెహర్ జ్యోతి సుంకర కన్నుమూశారు. ఈ విషయాన్ని మెహర్ రమేశ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. తన అక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె ఫొటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ధైర్యం చెబుతూ సోషల్ మీడియాలో రిప్లై ఇస్తున్నారు.. మెహర్ జ్యోతి సుంకర ఆత్మకు శాంతి కలగాలి అంటూ ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. రీసెంట్ గానే తన కూతురి పెళ్లి ని గ్రాండ్గా చేసిన డైరెక్టర్ కు ఇప్పుడు తన సోదరీ మరణ వార్త తీరని విషాదాన్ని మిగిల్చింది.. ఆమెను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. నేడు ఆమె అంత్యక్రియలను స్వయంగా డైరెక్టర్ మెహర్ రమేష్ చేయించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బంధువులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని సమాచారం..

అక్క మరణం నన్ను బాధించింది..

టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ చిన్నక్క అనారోగ్య సమస్యల కారణంగా చికిత్స పొందుతూ మరణించిన విషయాన్ని డైరెక్టర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. తన చిన్న అక్క మెహర్ జ్యోతి సుంకర గత 14 రోజులుగా తీవ్రమైన వైరల్ న్యూమోనియాతో బాధపడుతున్నారని, ఆ సమస్యకు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని డైరెక్టర్ ఎమోషనల్ అవుతున్నారు. తన సోదరితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఓ పోస్ట్ పెట్టారు. చిన్నప్పటి నుంచి తనను ఎంతగానో ప్రోత్సహిస్తూ, తల్లిలాగా అన్ని దగ్గరుండి తానే చూసుకునేది అని డైరెక్టర్ అన్నారు.. తన కూతురు పెళ్లిని తానే స్వయంగా భుజాల మీద వేసుకొని అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చేసింది అని డైరెక్టర్ పోస్టులో పేర్కొన్నారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఎంతో సంతోషంగా గడిపామని గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తి త్వరగా కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. ఆయనతో కలిసి పనిచేస్తున్న నటీనటులు మెహర్ రమేష్ కి రిప్లై ఇస్తూ ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. తన అక్క అంత్యక్రియలను తానే స్వయంగా నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం..

Advertisement

మెహర్ రమేష్ సినిమాల విషయానికొస్తే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా, డైరెక్టర్ గా పలు సినిమాలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు మెహర్ రమేష్.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలతో ఆయన సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. ఆయన చివరగా.. ‘భోళా శంకర్’ మూవీ తీశారు. అయితే కీర్తి సురేష్, తమన్నా భాటియా, మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఒకప్పుడు హిట్ సినిమాలను తన కథలు వేసుకున్న డైరెక్టర్ కు ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం ఆయన భారీ యాక్షన్ సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఓ స్టార్ హీరోతో సినిమాని ప్రకటించనున్నట్లు సమాచారం..

Advertisement

Also Read :శ్రద్దా కపూర్ నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..? మూవీ కన్నా అక్కడే ఎక్కువ..

Related News

ఢిల్లీ ఘర్షణల వెనుక కుట్ర కోణం ఉందా? నటుడు నరేష్ పోస్ట్ వైరల్

శ్రద్దా కపూర్ నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..? మూవీ కన్నా అక్కడే ఎక్కువ..

హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. నటి కేలి హాటిల్ కన్నుమూత..

హంస లాంటి సోయగాలతో మైమరపిస్తున్న నిధి అగర్వాల్!

ఒకే సినిమాలో 12 పాత్రలు.. కమల్ హాసన్‌ను మించిపోయిన ప్రియాంక చోప్రా!

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×