Kissik Talks Shobha Shetty : బిగ్ టీవీ (Big tv) నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ప్రతివారం ఈ కార్యక్రమంలోభాగంగా బుల్లితెర నటీనటులు పాల్గొంటూ వారి వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ కార్యక్రమానికి వర్ష యాంకర్ గా వ్యవహరిస్తూ ఎన్నో ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమానికి బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి (Shobha Shetty) హాజరయ్యారు తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రసారమవుతుంది.
మొదటి సంపాదన..
ఈ కార్యక్రమంలో భాగంగా శోభ శెట్టి ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈమె పెద్ద ఎత్తున బుల్లితెర సీరియల్స్ తో పాటు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒక్కో షో కోసం శోభా శెట్టి భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్(Remuneration) తీసుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి తెలియజేశారు. వర్ష శోభా శెట్టిని ప్రశ్నిస్తూ అసలు కెరియర్ ఎలా ప్రారంభమైంది? అవకాశాలు ఎలా వచ్చాయి? అంటూ ప్రశ్నించారు.
కాలేజ్ ఈవెంట్ లో…
ఈ ప్రశ్నకు శోభ శెట్టి సమాధానం చెబుతూ.. తాను కాలేజీలో ఉన్నప్పుడు కూడా హైపర్ యాక్టివ్ గా ఉండే దాన్ని, ఏదైనా ఈవెంట్ ఉంది అంటే నేనే ముందు వెళ్లి పార్టిసిపేట్ చేసేదాన్ని అలా ఒకసారి మా కాలేజ్ కు ఒక డైరెక్టర్ వచ్చారు. అక్కడ నన్ను చూసిన ఆయన చాలా బాగున్నావ్ సీరియల్స్ లో ట్రై చేయొచ్చు కదా అని చెప్పి వెళ్లారు. తరువాత తన మేనేజర్ వచ్చి నా నెంబర్ , మిగతా అన్ని డీటెయిల్స్ తీసుకొని వెళ్లారు. మరుసటి రోజు కాల్ చేసి ఇలా ఆడిషన్ ఉంది రమ్మని చెప్తే నేను అమ్మ వెళ్ళామని శోభాశెట్టి వెల్లడించారు. ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఫొటోస్ ఇవ్వమని చెప్పగా తాను పాస్ ఫోటో ఇచ్చానని దాంతో వాళ్లే మరుసటి రోజు ఫోటో షూట్ చేసి ఆడిషన్ చేసి సీరియల్ లో ఛాన్స్ ఇచ్చారని శోభ తెలియచేశారు.
ఇలా తాను ఫస్ట్ ఒక కామెడీ సీరియల్ లో నటించాను అంటూ కెరియర్ మొదటి రోజులను గుర్తు చేసుకున్నారు. అయితే ఈ సీరియల్ లో చేసినందుకు నాకు రోజుకు రూ.750 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చేవారని శోభాశెట్టి తన మొదటి సంపాదన గురించి తెలియజేశారు. ఇలా రూ.750 లతో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు ఒక్కో సీరియల్ కోసం రోజుకు వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా కమిట్ అవుతున్నానని ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయి అంటూ శోభా శెట్టి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన కెరియర్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అలాగే తన ఫ్యామిలీ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను అందరితో పంచుకున్నారు.
Also Read: Conistable Kanakam: విడుదలకు సిద్ధమైన కానిస్టేబుల్ కనకం… ఎప్పుడు? ఎక్కడంటే?