E-Paper
Advertisement

Conistable Kanakam: విడుదలకు సిద్ధమైన కానిస్టేబుల్ కనకం… ఎప్పుడు? ఎక్కడంటే?

Conistable Kanakam: విడుదలకు సిద్ధమైన కానిస్టేబుల్ కనకం… ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Conistable Kanakam: ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీలలో విడుదల అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తెలుగులో కూడా ఎన్నో ఓటీటీ వేదికలు ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ (Etv Win)ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే ఈ టీవీ విన్ మరో యాక్షన్ త్రిల్లర్ కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. ప్రశాంత్ కుమార్ (Prashanth Kumar)దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ (Varsha Bollamma)ప్రధాన పాత్రలో నటించిన “కానిస్టేబుల్ కనకం”(Conistable Kanakam) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

షేక్ చేయటానికి సిద్ధమవుతోంది..

Advertisement

ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈటీవీ విన్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ సిరీస్ విడుదల తేదీని అధికారకంగా ప్రకటించారు. ఈ సిరీస్ ఆగస్టు 14వ తేదీ ఈటీవీ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ సిరీస్ కి సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేస్తూ… “నిత్యం మనం చూసే పోలీస్ కాదు.. ఇది సాధారణమైన కేసు కాదు.. కానిస్టేబుల్ కనకం అన్నింటిని షేక్ చేయడానికి సిద్ధమవుతోంది అంటూ ఈ టీవీ విన్ అధికారక విడుదల తేదీని ప్రకటించింది.

వివాదంలో నిలిచిన కానిస్టేబుల్ కనకం..

Advertisement

ఆగస్టు 14వ తేదీ ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మెల్లమెల్లగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెడుతున్నారు. అయితే ఇటీవల ఈ సిరీస్ విషయంలో దర్శకుడు ప్రశాంత్ కుమార్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ గురించి ముందుగా ఈయన మరొక ఓటీటీకి కథ చెప్పారని అయితే కొన్ని కారణాలవల్ల వాళ్ళు రిజెక్ట్ చేయడంతో ఈటీవీ విన్ వాళ్లు ఓకే చేయడంతో ఇక్కడ చేస్తున్నట్లు తెలిపారు కానీ తన కథ మొత్తం విన్నటువంటి సదరు ఓటీటీ సమస్థ ఈ కథతో విరాటపాలెం అనే సిరీస్ కాపీ చేశారు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

ఇలా సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లను కూడా కాపీ చేస్తారని తెలియదు అంటూ విరాటపాలెం సిరీస్ పై తీవ్ర స్థాయిలో ప్రశాంత్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ సిరీస్ విషయంలో కోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. ఇలా ఎన్నో వివాదాలను దాటుకొని కానిస్టేబుల్ కనకం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. మరి ఈ సిరీస్ ద్వారా వర్ష బొల్లమ్మ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈమె ఇటీవల తమ్ముడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

Also Read: HHVM: వీరమల్లు నాకు నచ్చలేదు.. మొహం మీదే చెప్పిన నెటిజన్.. నిధి మైండ్ బ్లోయింగ్ రిప్లై!

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×