E-Paper
Advertisement

3 సార్లు బ్రేకప్.. కోలుకోలేకపోయాను – సుప్రీత

3 సార్లు బ్రేకప్.. కోలుకోలేకపోయాను – సుప్రీత
Advertisement

 Kissik Talks supritha: సుప్రీత.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా గ్లామర్ తో నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సినిమాలలోకి రాకముందే సురేఖ వాణి కూతురుగా ఇటు సోషల్ మీడియా ద్వారా మరింత ఆదరణ సొంతం చేసుకున్న సుప్రీత.. బిగ్ బాస్ రన్నర్ అమర్దీప్ చౌదరితో నాయుడు గారి అమ్మాయితో చౌదరి గారి అబ్బాయి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మంచు లక్ష్మీ ప్రధాన పాత్ర పోషించిన లేచింది మహిళా లోకం సినిమాలో కూడా కీలకపాత్ర పోషించిన ఈమె.. ఇప్పుడు మాస్ జాతర షోలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

మూడుసార్లు బ్రేకప్..

ఒకవైపు షోలు.. మరొకవైపు సినిమాలు.. అలాగే ఆల్బమ్ సాంగ్స్ అంటూ బిజీగా మారిన సుప్రీత తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్నో విషయాలను పంచుకున్న ఈమె.. తన జీవితంలో ఇప్పటివరకు మూడుసార్లు బ్రేకప్ అయిందని, ఆ నరకం నుండి బయటపడడానికి చాలా సమయం పట్టింది అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బయటకు సరదాగా కనిపించే సుప్రీత మనసులో ఇంత బాధ ఉందా అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

దీపం వెలగలేదు..

Advertisement

హోస్ట్ వర్ష ప్రశ్నిస్తూ.. ఎప్పుడైనా బ్రేకప్ జరిగిందా? అంటూ అడగగా.. “మూడు బ్రేకప్ లు జరిగాయి. రెండవసారి బ్రేకప్ జరిగినప్పుడు నన్ను నేను మళ్ళీ మామూలు స్థితికి తెచ్చుకోలేకపోయాను. చాలా భయపడిపోయాను. మెడికేషన్ కి వెళ్ళాను.. ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకున్నాను. ముఖ్యంగా ఆ ట్రామా నా మూడవ రిలేషన్ పై పడింది. ఆ దీపం వెలగలేదు” అంటూ తన రిలేషన్ బ్రేకప్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది సుప్రీత.

అసలు బ్రేకప్ ఎందుకు అవుతుందంటే?

బ్రేకప్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఎందుకు అవుతుంది? అంటూ వర్షా అడగగా.? సుప్రీత మాట్లాడుతూ.. మొదటగా ఎవరికీ కూడా సహనం లేదు.. పోతే పోతుంది అనుకుంటారు.? కానీ దాని వెనకాల ఎంత పెయిన్ ఉంటుందనేది ఎవరు అర్థం చేసుకోరు.. అంటూ తెలిపింది.

Advertisement

also read: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది..’రోహిణి ఇంజనీరింగ్ కాలేజ్’ ప్రత్యేకతలివే!

సోషల్ మీడియా ట్రోల్స్ పై రియాక్షన్..

ఇకపోతే తల్లి కూతుర్లు ఇద్దరు ఒకే రకమైన డ్రెస్సులు వేసుకొని గ్లామర్ షో చేస్తూ తెగ రీల్స్ చేసిన రోజుల్లో వీళ్లిద్దరిపై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా సుప్రీత సురేఖ వాణికి తల్లి అయ్యిందా? లేక తల్లి కూతురికి చెప్పదా? అంటూ ఎంతోమంది విమర్శలు గుప్పించారు.. దీనిపై ఆమె మాట్లాడుతూ.. నేను 20 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడే గుడ్ టచ్ , బాడ్ టచ్ గురించి మా అమ్మ నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. మా అమ్మకి ఇప్పుడు 46.. మా ఇద్దరి మధ్య 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. మా అమ్మ తన జీవితాన్ని ఇంక ఎక్కడ చూసింది . అంటూ తన బాధను వ్యక్తం చేసింది సుప్రీత. అందుకే ప్రపంచాన్ని నాతోపాటు మా అమ్మకి కూడా చూపిస్తున్నాను అంటూ ట్రోలర్స్ కి గట్టిగా సమాధానం ఇచ్చింది.

Related News

తిరిగితే తప్పేంటీ…తల్లితో విదేశీ పర్యటనలపై సుప్రత ఫైర్!

నాన్న మరణం.. పబ్లిసిటీ కోసమే అంటూ విమర్శలు!

సుప్రీతకు సినిమా అవకాశాలు రాలేదా..అందుకే ఇలా చేస్తున్నారా?

నా వల్ల కావట్లేదు.. పెళ్లి చేసేయ్ అమ్మ.. సుప్రీత కామెంట్స్ వైరల్!

ఇండస్ట్రీకి దూరంగా సురేఖ వాణి… అసలు కారణం చెప్పిన సుప్రీత!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు నటి…పోస్ట్ వైరల్!

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode October 2nd ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్‌: మనోజ్‌, రోహిణిలను విడదీసేందుకు ప్రభావతి వేసిన ప్లాన్‌ సక్సెస్‌ అయ్యేనా..?              

Big Stories

Advertisement
×