Big Tv Kissik Talks: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సురేష్ తేజ (Suresh Teja)ఒకరు. ఈయన సురేష్ తేజ కంటే కూడా సురేఖ వాణి(Surekha Vani) భర్తగా చాలా మందికి తెలుసు. ఈయన సీరియల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగారు. ఇలా దర్శకుడిగా కొనసాగుతున్న సురేష్ తేజ సురేఖ వాణి తో కలిసి ఏడు అడుగులు నడిచారు. ఇక ఈ దంపతులకు ఒక కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఇలా సురేఖ వాణి సురేష్ కుమార్తెగా సుప్రీత(Supritha) ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. సురేష్ తేజ 2019వ సంవత్సరంలో అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.
ఇలా తన తండ్రి మరణం జీర్ణించుకోలేనిది అంటూ ఈమె పలు సందర్భాలలో తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా సుప్రీత కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన తండ్రి మరణం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. తన తండ్రి 2019 మే లో చనిపోయారని తెలిపారు. తనకు తోబుట్టువులు, సోదరులు ఎవరూ లేకపోతే తన తండ్రి అంత్యక్రియలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నింటిని కూడా తానే చేశానని తెలిపారు. అయితే ఈ విషయంపై చాలామంది నన్ను విమర్శించారని సుప్రీత ఎమోషనల్ అయ్యారు.
ఇలా తన తండ్రి మరణించిన తర్వాత నేను కొడుకుగా ఆ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేయడంతో చాలామంది కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం మాత్రమే, వ్యూస్ కోసమే అంటూ చాలా విమర్శలు చేశారు. ఆ సమయంలో తాను ఎంత బాధ పడ్డానో నాకే తెలుసు.. ఇలాంటి బాధలన్నీ నాకెందుకు దేవుడా నన్ను కూడా తీసుకెళ్లిపో అని చాలా ఏడ్చానని సుప్రీత ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా తండ్రికి కొడుకుగా చేయాల్సిన కార్యక్రమాలు చేయడంతోనే ఈ విమర్శలు వచ్చాయని తెలుస్తుంది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుప్రీత తన కెరియర్ గురించి అలాగే సోషల్ మీడియాలో తమ గురించి వచ్చే విమర్శలపై కూడా స్పందించారని తెలుస్తోంది అదే విధంగా తన తల్లి సురేఖవాణి కెరియర్ గురించి ఆమె పట్ల వస్తున్న విమర్శలు గురించి కూడా ఈ కార్యక్రమంలో సుప్రీత ప్రస్తావించినట్టు ప్రోమో వీడియో చూస్తేనే స్పష్టమవుతుంది. ఈ కార్యక్రమంలో ఈమె ఎలాంటి విషయాల గురించి మాట్లాడారనేది తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది.
Also Read: సందీప్ కిషన్ ‘సిగ్మా’ మూవీ రివ్యూ … సీఎం కొడుకు హిట్ కొట్టాడా?