Big Tv Kissik Talks: అనన్య శర్మ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. నటిగా పలు సినిమాలు,సిరీస్ లలో నటించిన ఈమె 30 వెడ్స్ 21 అనే సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనన్య నటించిన హై అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అనన్య తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా అనన్య(Ananya Sharma) తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన అంశాల గురించి కూడా మాట్లాడారు.
ఈ సందర్భంగా అనన్య సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో రకాల విమర్శలు వస్తూ ఉంటాయి. ఇదే అంశం గురించి వర్ష మాట్లాడుతూ ఎప్పుడైనా ఇంస్టాగ్రామ్ లో ఫోన్ కాల్స్ రావడం లేదంటే నెగిటివ్ కామెంట్లు రావడం జరిగిందా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నేను చేసిన పోస్ట్ ఒక దాంట్లో ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. నిన్ను పుట్టించిన మీ మదర్ అంటూ పేరు ప్రస్తావిస్తూ బ్యాడ్ కామెంట్స్ చేశారని, అది నేను తీసుకోలేకపోయానని అనన్య తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అనన్య తన తండ్రి గురించి కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలో ఎలాంటి సిచువేషన్ ఎప్పుడైనా రాకూడదని ఉందా అంటే అది కేవలం తన తండ్రిని కోల్పోవడమేనని ఈమె తెలిపారు. పేరెంట్స్ లేకపోవడం అనేది చాలా కష్టమని తన తండ్రిని గుర్తు చేసుకుంటూ అనన్య కాస్త ఎమోషనల్ అయ్యారు. నాకు దేవుడు మీద నమ్మకం లేదని పూజ చేస్తే మన జీవితం మారిపోతుంది అనే విషయాలను తాను నమ్మనని ఈ సందర్భంగా అనన్య తెలిపారు.
ఇక తాను రాత్రిపూట నిద్రపోయే సమయంలో తనతో ఎవరైనా మాట్లాడితే కచ్చితంగా నేను కూడా వారికి సమాధానం చెబుతాను కానీ పొద్దునికి ఆ విషయాలన్ని మర్చిపోతానని తనకు ఈ అలవాటు ఉంది అంటూ అనన్య షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. 30 వెడ్స్ 21 సిరీస్ షూటింగ్ సమయంలో నరేషన్ కు డేట్స్ ఇచ్చి మర్చిపోయేదాన్ని తరువాత వాళ్లు ఏంటి మేడం రాలేదు అంటూ అడిగే వారని ఈ సందర్భంగా అనన్య తనకున్నటువంటి వింత అలవాటు గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో ఈమె తన లవ్ బ్రేకప్ గురించి ఫ్రెండ్స్ వెన్నుపోటు పొడవడం గురించి కూడా మాట్లాడారు.
Also Read: ఇంటిమేట్ సీన్స్.. బట్టలతో ప్రాబ్లం కాదు.. ఇండస్ట్రీపై అనన్య శర్మ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!