Tv Anchors : ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో టీవీ చానల్స్ ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంటాయి. ముఖ్యంగా సీరియల్స్ సినిమాలు మాత్రమే కాదు కొన్ని స్పెషల్ షోలు కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఉదాహరణకు ఢీ షో అలాగే పలు కార్యక్రమాలు జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే టీవీ షోలకు కేవలం ఫిమేల్ యాంకర్స్ మాత్రమే కాదు మేల్ యాంకర్స్ కూడా ఉన్నారు. అయితే ఈ యాంకర్లు ఒకవైపు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరిస్తూనే, మరోవైపు సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంటూ వస్తున్నారు. అయితే కేవలం సైడ్ క్యారెక్టర్లలో మాత్రమే కాదు హీరోలుగా కూడా నటించి తమ సత్తాని చాటే ఎందుకు వరుస ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం షోలు మాత్రమే కాదు సినిమాలలో కూడా నటిస్తూ తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. యాంకర్ నుంచి హీరోలుగా మారిన స్టార్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హీరోలుగా మారిన తెలుగు మేల్ యాంకర్లలో ముఖ్యంగా ఓంకార్, ప్రదీప్ మాచిరాజు ఉన్నారు. ఓంకార్ మొదట టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత దర్శకత్వం వహించి, నటుడిగా కూడా విజయవంతమయ్యారు. ప్రదీప్ మాచిరాజు ఒక ప్రముఖ టెలివిజన్ యాంకర్, ఆయన తన కామెడీ టైమింగ్, యాంకరింగ్‌తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, సినిమాల్లో కూడా నటించారు.. హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. హీరోలుగా గా చేసిన మేల్ యాంకర్స్ ఎవరో చూద్దాం..
తెలుగు మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా ప్రారంభించి, యాంకరింగ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత, దర్శకుడిగా మారి, పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. నటుడుగా కూడా ఆయన తన సత్తాని చాటుతూ వస్తున్నాడు. అలాగే ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.
బుల్లితరపై టాప్ మేల్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు పేరు మొదటగా వినిపిస్తుంది.. ఆర్జె గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బుల్లితెర యాంకర్ గా అడుగుపెట్టాడు. ఒక్కో షో తో తన టాలెంట్ నిరూపించుకుంటూ తెలుగు ఆడియన్స్ గుండెల్లో స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్నారు.. ఈయన సినిమాలో నటుడుగా చేశారు. 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా? అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
బుల్లితెరపై టాప్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు సుడిగాలి సుదీర్. తన టాలెంట్ తో కామెడీ టైమింగ్ తో జనాలను ఆకట్టుకోవడంతో అతి తక్కువ కాలంలోనే టీం లీడర్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో స్కిట్లలో నటించిన ఆయన హీరోగా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ అయ్యాడు. పలు సినిమాల్లో నటించిన సరే ఆ సినిమాలో అంతగా ఆకట్టుకోలేదు కానీ సుదీర్ కి మాత్రం అవకాశాలు తగ్గలేదు.
Also Read :’ బ్రహ్మముడి’ రాజ్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?
వీళ్లే కాదు ఇండస్ట్రీలో పలువురు యాంకర్లు హీరోలుగా మారి సక్సెస్ అవుతున్నారు. ఒకవైపు వెండితెరపై వరుసగా సినిమాలు చేస్తున్న సరే మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో సందడి చేస్తూ వస్తున్నారు.