Intinti Ramayanam Today Episode October 22 nd : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి పసిపిల్ల అని కూడా చూడకుండా ముష్టి వాడికి విసిరేసినట్టు విసిరేస్తుంది. దాంతో అవని చాలా బాధపడుతుంది. ఆరాధ్య తినబోతుంటే అవని వద్దని అంటుంది. వద్దమ్మా అని ఆరాధ్య తో అవని అంటుంది. మనుషులకి మనుషుల్లాగే ఇవ్వాలి ఏదో ముష్టి వాడికి విసిరేసినట్టు వేశావు అని అనుకోకుండా అడుగుతుంది అవని.. అయితే ఇక పల్లవి దగ్గరికి వెళ్లి అవని నువ్వు చేసిన విషయాల గురించి కమల్ కు చెబితే నీ పరిస్థితి ఏంటో ఊహించుకో అది గుర్తుపెట్టుకుని ఇంట్లో ప్రవర్తించు అని అంటుంది. అక్షయ్ ఇంటికి రాగానే ఏమైంది అని అడుగుతాడు. అవని ఏ మాట చెప్పదు. శ్రియ పల్లవిలు ఎలా ఉంటారో నేను అర్థం చేసుకోగలను నాన్న కోసం నువ్వు అర్థం చేసుకో నువ్వు సర్దుకుపోవాలి అని మాట తీసుకుంటాడు. గది కోసం శ్రీయ పెద్ద రచ్చ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఉదయం లేవగానే అవని పూజ చేసి అందరికీ కావాల్సిన అవసరాలని తీరుస్తుంది. వంటగదిలోకి వెళ్లి భానుమతి దగ్గరికి పార్వతి ఏం చేస్తున్నారు అత్తయ్య అని అంటుంది ఇంట్లో ఒక్కటే అవని పనులు చేస్తుంది కదా.. అందుకే ఏదో ఒకటి నా వంతు సాయం చేద్దామని కూరగాయలు చదువుతున్నానని అంటుంది. ప్రణతి అవని వదిన ఒక్కటే ఉదయం లేసి అందరికీ కావాల్సినవన్నీ చేసిపెడుతుంది. కానీ పల్లవి వదిన శ్రీయ వదినలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా పడుకున్నారు అని అంటుంది
పార్వతీ శ్రియ దగ్గరికి వెళ్లి ఏంటమ్మా ఇంకా లేవలేదు అవని ఉదయమే లేసి అన్ని పనులు చేస్తుంది. అని పార్వతి అడగ్గానే శ్రీయ ఇంత పొద్దున్నే నిద్ర లేచి నేనెందుకు చేయాలి? నాకేం అవసరమని మాట్లాడుతుంది. బంగారం లాంటి నిద్రని చెడగొట్టారు అని శ్రియ పార్వతీపై సీరియస్ అవుతుంది. ఆ తర్వాత శ్రీకర్ రాగానే కాలం మారిపోయింది జనరేషన్ కూడా మారిపోయింది అని వెళ్ళిపోతుంది పార్వతీ. ఇక పల్లవి కూడా హాల్లోకి అప్పుడే లేచి వస్తుంది. ఇప్పుడే నిద్ర లేస్తున్నావా అమ్మ అని పార్వతి అడుగుతుంది. అవునత్తయ్య ఫోన్ రావడంతోనే నిలుపు వచ్చేసింది బంగారం లాంటి నిద్ర చెడిపోయింది అని అంటుంది. ఒళ్ళు విరుచుకుంటూ రాజేంద్రప్రసాద్ దగ్గర కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది.
బయటి నుంచి వచ్చిన కమల్ పల్లవిని చూసి మా నాన్న ముందరే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా లే ముందు అనేసి అంటాడు. అక్క నాకు కాఫీ కావాలి లేవగానే నాకు కాఫీ తాగడం అలవాటు కదా అని పల్లవి అవనిని అడుగుతుంది. అయితే దీంతో గొడవ పెట్టుకుంటే మావయ్య గారి ఆరోగ్యం పాడవుతుంది. అసలైన టెన్షన్ పడతాడు అని అవని గొడవ ఎందుకని కాఫీ తెచ్చి ఇవ్వాలని అనుకుంటుంది.. ఆరాధ్య వంట గదిలోకి వచ్చి ఏవరికమ్మ కాఫీ అని అడుగుతుంది. పల్లవి పిన్ని కాఫీ అడిగింది కదమ్మా తనకే ఇవ్వాలని చేస్తున్నానని అవని అంటుంది.
ఆరాధ్య నేను ఇస్తానమ్మా అని కాఫీ తీసుకెళ్లి పల్లవి ఒడిలో విసిరేస్తుంది. ఏంటి ఇలా చేశావు కొంచమైన బుద్ధుందా అని పల్లవి సీరియస్ అవుతుంది. నిన్న నేను చికెన్ అడిగితే నువ్వెలా విసురు కొట్టావు పిన్ని. నేను కూడా అలానే ఇవ్వాలని నేర్చుకున్నాను అని ఆరాధ్య అంటుంది. అందరూ పల్లవి తిక్క కుదిరిందని అనుకుంటారు. అయితే అవని నా కూతురు చేసిన దాంట్లో ఏ సంబంధం లేదు. నువ్వు ఎలా చేశావో నిన్ను చూసే తను నేర్చుకునింది అని అంటుంది. అవని ఆఫీసుకు టైం అయింది. టెన్షన్ పడుతూ స్కూటీ కీ కోసం వెతుకుతుంది. కానీ ఆ కీని పల్లవి దాచి పెట్టేస్తుంది..
Also Read:మీనా కోసం బాలు టెన్షన్..రోహిణికి దిమ్మతిరిగే షాక్..దినేష్ కు చుక్కలు చూపించిన మీనా..
అక్కడికి వచ్చి నాకు కమల్ నేను నా బండి మీద ఆఫీస్ కి వదిలిపెడతాను అనేసి అంటాడు. ఇప్పుడే అక్కడికి ఇంటిని రెంటుకి ఇచ్చిన వ్యక్తి అక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వాలని దారుణంగా అవనిని అవమానిస్తాడు. అవని చేసిన పనికి మాకు తల కొట్టేసినట్లు ఉంది అని పల్లవిశ్రియాలు అంటారు. కానీ అక్షయ్ కమల్ మాత్రం మీరు అవనిని తప్పు చేసే మాట్లాడొద్దు అంటారు. ఇక కమల్ అవని ఇద్దరు కలిసి ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అక్కడికి వచ్చిన శ్రీకర్ నువ్వు ఇలా చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇంటికి మరో సమస్య వస్తుంది అని అంటారు. కానీ కమల్ మాత్రం శ్రీకర్ కి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. అవని వెళ్లిన లాయరు చక్రధర్ కి ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్తాడు. ఇప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి చక్రధర్ టెన్షన్ పడుతూ కనిపించడంతో ఏమైంది డాడీ అని అడుగుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి..