CM Chandrababu Visit UAE: నవంబర్‌లో నిర్వహించే విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను విశాఖకు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు మంత్రి లోకేష్.. ఇంకోవైపు సీఎం చంద్రబాబు ఫారెన్ టూర్లకు శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి మూడురోజులపాటు యూఏఈ పర్యటనకు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు యూఏఈ టూర్
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఇన్నాళ్లు ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు సీఎం చంద్రబాబు. రీసెంట్‌గా గూగుల్ కంపెనీ రాకతో ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఏపీకి పెట్టుబడులు రప్పించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సింగపూర్‌లో పర్యటించిన వచ్చిన సీఎం చంద్రబాబు, బుధవారం యూఏఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి మూడురోజులపాటు అక్కడ పర్యటించనున్నారు.
అమరావతి నేరుగా హైదరాబాద్‌కు వచ్చారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్ నుంచి నేరుగా దుబాయ్‌కి బయలుదేరారు. పర్యటన ప్రధానంగా దుబాయ్, అబుదాబి ప్రాంతాల్లో జరగనుంది. ఈ టూర్‌లో భాగంగా సీఎం చంద్రబాబు పలువురు పారిశ్రామిక వేత్తలతో వన్-టు-వన్ సమావేశాలలో పాల్గొంటారు. దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం, దుబాయ్‌లో భాగస్వామ్య సమ్మిట్, ఆ తర్వాత రోడ్ షో చేయనున్నారు.
దుబాయ్ తరహాలో అభివృద్ధికి ప్లాన్
బుధవారం మధ్యాహ్నం నుంచి పీఎన్సీ మెనాన్ (సోభా గ్రూప్ చైర్మన్)తో ఏపీలో ఇన్‌ఫ్రా అభివృద్ధి, ఐటీ పార్కులపై చర్చించనున్నారు. షరఫ్ గ్రూప్ ఫౌండర్ తో లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ సదుపాయాలపై మాట్లాడుతారు. ట్రాన్స్‌వరల్డ్ గ్రూప్ ఛైర్మన్‌తో పోర్టులు, షిప్ మేనేజ్‌మెంట్, సొల్యూషన్స్ అభివృద్ధిపై ఆలోచనలు చేయనున్నారు.
బుధవారం సాయంత్రం దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం సందర్శన చేయనున్నారు సీఎం చంద్రబాబు. సాయంత్రం 7 గంటలకు సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రోడ్‌షోలో పాల్గొంటారు. బుధవారం టూర్ మొత్తం దుబాయ్‌లో సాగుతుంది. గురువారం అక్టోబర్ 23న యూఏఈ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి అల్సువైదీతో కలిసి బాప్స్ మందిరాన్ని సందర్శిస్తారు.
ALSO READ: కందుకూరు హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు
మధ్యాహ్నం అబుదాబీలో ఎయ్‌డీఎన్‌ఒసీ ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నాస్సర్ అల్ ముహైరీ, జీ42 ఇంటర్నేషనల్ సీఈఓ మన్సూర్ అల్ మన్సూరీ, లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, అగ్తియా గ్రూప్ ఎండీ సల్మీన్ అలమేరీ, బైనాన్స్ సీఎంఓ రాచెల్‌తో సమావేశాలు ఉండనున్నాయి. యాస్ ఐలాండ్ సందర్శన, బిజినెస్ రౌండ్‌టేబుల్ మీటింగ్ కూడా ఉంటాయి.
మూడో రోజు అంటే అక్టోబర్ 24 ఫెరారీ వరల్డ్, యాస్ వాటర్‌వరల్డ్, వార్నర్ బ్రోస్ వరల్డ్, సీ వరల్డ్ యాస్ ఐలాండ్ వాటిని సందర్శన చేయనున్నారు సీఎం చంద్రబాబు. వాటిని ఖర్చు, నిర్వహణ గురించి అడిగి తెలుసుకోనున్నారు. అలాగే ఆ దేశ వాణిజ్య మంత్రి తాని బిన్ అహ్మద్ అల్ జెయౌదీ-పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్మర్రీలతో సమావేశం కానున్నారు.
ఎమిరేట్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్, ఏపీ తెలుగు డయాస్పోరా ఈవెంట్ లె మెరిడియన్ గ్రేట్ బాల్‌రూమ్‌లో సాయంత్రం ఉండనుంది. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు సీఎం చంద్రబాబు. విశాఖ వేదికగా నవంబర్ 14, 15 పార్టనర్ షిప్ సమ్మిట్ జరగనుంది. అక్కడికి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు.
నవంబర్ లో నిర్వహించే విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునేందుకు ఇప్పటికే మంత్రి లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా… ఇప్పటికే సింగపూర్ లో పర్యటించిన వచ్చిన చంద్రబాబు గారు, ఇప్పుడు యూఏఈ పర్యటనకు… pic.twitter.com/2GSBxre2fQ
— Telugu Desam Party (@JaiTDP) October 21, 2025