Gundeninda GudiGantalu Today episode October 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతితో సహా అందరూ కూడా దీపావళి కోసం పూజలు చేస్తారు. ఇంట్లో ఎంతో సందడి వాతావరణం నెలకొంటుంది. సత్యం తమ ముగ్గురు కోడళ్ళకు దీపావళి కానుకలు ఇస్తాడు. ముగ్గురు కలిసి ఎరుపు రంగు చీరలో పూజకు వస్తారు. ఇంటిని పూలతో ముస్తాబు చేయడంతో పాటుగా దీపాలతో ఎంతో చక్కగా అలంకరిస్తారు. ఇక అందరూ సరదాగా పూజను మొదలు పెడతారు. పూజ పూర్తవ్వగానే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. పండగ రోజు పూలకు మంచి డిమాండ్ ఉంటుందని మీనా ఈరోజు చేస్తే మనకి మంచిగా డబ్బులు వస్తాయని బాలుతో అంటుంది.. మీనాకు విద్య ఫోన్ చేసి మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ఉన్నాయి పువ్వులు తీసుకురావాలని అడుగుతుంది. ఆ పువ్వులను తీసుకురాగానే దినేష్ మీనాని బయట నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మనుషుల్ని పెట్టి కొట్టించిన నీకు బుద్ధి రాలేదా నన్ను ఇంకా వదలవా అని రోహిణి అంటుంది. నువ్వు మనుషులని పెట్టి కొట్టించినందుకే నీ మీద ఇంకా నాకు కసి పెరిగింది నీ గురించి అన్ని నిజాలను బయట పెట్టేస్తాను అని బెదిరించేస్తాడు. నువ్వు అర్జెంటుగా నాకు లక్ష రూపాయలు ఇవ్వకుంటే మీ ఇంటికి వచ్చి ఈ విషయాన్ని ఫోటోలతో సహా చూపిస్తాను అని రోహిణి బెదిరిస్తాడు. రోహిణి వెంటనే విద్య దగ్గరికి వెళ్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఆ దినేష్ గాడు వెంటనే లక్ష రూపాయలు ఇవ్వాలని అంటున్నాడు. నాకు భయంగా ఉంది ఎవడు అన్నట్లుగానే ఆ చేసేస్తాడేమో.. వాడికి కచ్చితంగా లక్ష రూపాయలు ఇవ్వాలి అని అనుకుంటుంది.. దినేష్ మనుషులు ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి అనగానే బయటకు వచ్చిన మీనాని కిడ్నాప్ చేసి తీసుకొని వస్తారు.
బాలు మీనా ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాలని టెన్షన్ పడుతూ ఉంటాడు.. విద్యా వాల ఇంటికి వెళ్లి మీనా ఇంకా రాలేదు ఎవరో తీసుకెళ్లారు అని చెప్తారు. అయితే మీనాను అక్కడ నుంచి ఎవరో తీసుకెళ్లారు అని తెలుసుకున్న బాలు ఎలాగైనా సరే మీనాన్ని కాపాడుకోవాలని అనుకుంటాడు.. మీనాకు ఫోన్ చేస్తే ఫోన్ అక్కడ పడేసి వెళ్లిపోయి ఉంటారు. అయితే మీనా చచ్చిన పువ్వులను ఒకసారి బాలు గుర్తు చేసుకుంటాడు. అ పూలు బాలు కోసమే మీనా ఒక్కొక్కటిగా వదులుతూ దారి చూపిస్తుంది. బాలు నువ్వు నాకోసమే ఈ పువ్వుల నీలా వదిలేసావు మీనా నిన్ను కచ్చితంగా కాపాడుకుంటాను అని అంటాడు.
దినేష్ మాత్రం రోహిణిని పిచ్చిపిచ్చిగా చేసేయాలి దాని ముక్కుని చెవులని కోసేసి రాక్షసి లాగా తయారు చేస్తాను అని సంతోష పడుతూ ఉంటాడు. తన మనిషి వచ్చి అన్నా రోహిణిని తీసుకొని వచ్చాము అని అంటాడు. దినేష్ అక్కడికి వెళ్లి చూడగానే మీనా కనిపించడంతో తన మనిషిని ఎందుకురా దీన్ని తీసుకొచ్చావు అని అంటాడు. ఎర్ర చీరాని అనగానే మేము ఈ అమ్మాయిని తీసుకొని వచ్చామన్నా అని అంటాడు.. ఇది రోహిణి కాదురా నన్ను కొట్టి పోలీసులకు అప్పగించిన బాలు గాడి పెళ్ళాం. ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటాడు.
ఇక రోహిణి మనోజ్ దగ్గరికి డబ్బులు కావాలని వచ్చి అడుగుతుంది.. కానీ మనోజ్ డబ్బులు లేవు అని అనడంతో రోహిణి షాక్ అవుతుంది. నాకు అన్ని రకాలుగా విద్య హెల్ప్ చేసింది నేను తనకి హెల్ప్ చేయకపోతే ఏం బాగుంటుంది నేనే క్లైంట్ ని అడిగి ఎలాగోలాగా అడ్జస్ట్ చేస్తాను అని అంటుంది. దినేష్ ఫోన్ చేయడంతో షాక్ అవుతుంది. మీనా దగ్గరికి వెళ్లిన దినేష్.. నీ భర్త మీద పగ తీర్చుకోవడానికే నేను తీసుకొచ్చాము అని అంటాడు. ఇక అప్పుడే బాలు పువ్వులని పట్టుకొని దారి వెతుక్కుంటూ అక్కడికి వచ్చేస్తాడు. అది చూసినా దినేష్ మనుషులు మీనాని దాచేస్తారు.
Also Read : హీరోలుగా మారిన టాప్ టీవీ యాంకర్స్.. అతనే సక్సెస్ అయ్యాడా..?
బాలు మాత్రం అందరినీ కొట్టుకుంటూ లోపలికి వచ్చేస్తాడు. పోలీసులకు నిన్ను పట్టించిన కూడా నీకు సిగ్గు రాలేదా అని దినేష్ ని అంటాడు. అందర్నీ చేత కొట్టిన బాలుని దినేష్ దొంగ దెబ్బ తీసి కొడతాడు అది చూసిన మీనా ఉగ్రరూపం దాల్చినట్లు రెచ్చిపోతుంది. కట్లని విప్పేసుకుని అందరి పైన విరుచుకుపడుతుంది. అది చూసిన బాలు నువ్వు సత్యభామ లాగే ఉన్నావు అని అంటాడు.. బాలు మీనా అక్కడ ఉన్నాడని చూసిన రోహిణి తన గురించి నిజం తెలిసిపోయిందని విద్య దగ్గరికి వెళ్లి టెన్షన్ పడుతూ ఏడుస్తుంటుంది. మీనా అందరినీ చితకొట్టేసి వాళ్లకి విశ్వరూపం చూపిస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీసులు దినేష్ బ్యాచ్ ని అరెస్ట్ చేస్తే తీసుకుని వెళ్ళిపోతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..