Brahmamudi serial today Episode: కావ్య ఇంట్లో పని చేస్తుంటే.. బయట అందరూ క్రాకర్స్ కాలుస్తుంటారు. ఇంతలో అప్పు, కళ్యాణ్ వచ్చి కాలుస్తుంటారు. దూరం నుంచి అంతా గమనిస్తున్న రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. కావ్య వస్తుందనుకుంటే అప్పు వచ్చిందేంటి..? వెంటనే ఏదో ఒకటి చేసి కావ్య కూడా వచ్చి క్రాకర్స్ చేయాలి అని రుద్రాణి రాజ్ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి రాజ్ నువ్వు వచ్చిన పనేంటి.. చేస్తున్న పనేంటి అని అడుగుతుంది. దీంతో ఏం పని అత్తా రా నువ్వు క్రాకర్స్ కాల్చు అంటాడు. అయ్యో రాజ్ నువ్వు కావ్య మనసు మార్చి ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చావు.. నువ్వు ఇక్కడ క్రాకర్స్ కాలుస్తూ ఉంటే.. కావ్య అక్కడ లోపల పని చేస్తుంది. ఇక ఎప్పుడు కావ్య మనసు మారుస్తావు.. వెళ్లి కావ్యను తీసుకొచ్చి కావ్య చేత కూడా క్రాకర్స్ కాల్పించు అని చెప్తుంది.
దీంతో రాజ్ లోపలకి వెళ్తాడు. అక్కడే ఉన్న కళ్యాణ్ రా అత్తా నువ్వు కూడా కాల్చుదువు కానీ అంటూ రుద్రాణిని పిలవగానే.. అమ్మో నేను ఇక్కడే ఉంటే ఈ పొగ పీల్చి నేను చస్తాను.. వెంటనే ఎస్కేప్ అవ్వాలి అని మనసులో అనుకుని లేదులే కళ్యాణ్ నాకు క్రాకర్స్ కాల్చడం అంతగా రాదు.. మీరు కాల్చండి అని చెప్పగానే.. అక్కడే ఉన్న ఇంద్రాదేవి.. అవును అవునులే కొంపలు కాల్చడంలో వచ్చే ఆనందం వీటిని కాల్చడంలో ఎలా వస్తుంది దీనికి మనమే కాల్చుకుందాం పదండి అంటుంది. రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అందరూ హ్యాపీగా క్రాకర్స్ కాలుస్తుంటారు. ఇంతలో అప్పు చిన్నగా దగ్గుతుంది. ఏంటి కూచి దగ్గుతున్నావు అని అడుగుతాడు. ఈ క్రాకర్స్ కు చాలా స్మోక్ వస్తుంది కదా..? అంటుంది. క్రాకర్స్ అంటే స్మోక్ రాకుండా ఏమి వస్తుంది.. ఇష్టం లేకపోతే పద లోపలికి వెళ్దాం అంటాడు కళ్యాణ్.. అమ్మో వద్దులే నేను కాలుస్తాను అంటుంది అప్పు..
కిచెన్‌లో వంట చేస్తున్న కావ్య దగ్గరకు వెళ్లిన రాజ్ పండగ మొత్తం బయట చేసుకుంటుంటే మేడం గారు ఇక్కడేం చేస్తున్నారో…? అని అడగ్గానే.. పని చేస్తున్న విషయం సార్ గారికి కనిపించడం లేదేమో..? అంటుంది. పని ప్రతి రోజూ ఉంటుంది. పండగ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది అని రాజ్ చెప్తాడు. ప్రతి ఇంట్లోనూ..పండగ పూట అందరూ సంతోసంగా ఉండాలంటే.. మాలా కొంత మంది ఆడవాళ్లు ఇలా పని చేయక తప్పదు అని కావ్య చెప్పగానే.. అంత బాధపడుతూ ఎందుకు చేయడం అంటాడు రాజ్.. ఇంటి పని చేయడం ఆడవాళ్లకు సంతోషంగానే ఉటుంది తప్పా బాధేం ఉండదు.. వాళ్లు వండిన ఫుడ్డు ఇంట్లో అందరికీ పెట్టి అందరూ తింటుంటే సంతోష పడతారు. అదే వాళ్లకు పండగతో సమానం అంటుంది కావ్య. దీంతో రాజ్ వెటకారంగా పండగ అంటే వడుకుని తినడం ఒక్కటే కాదు అంటాడు రాజ్. మరేం చేయాలో అని కావ్య అడగ్గానే.. నాతో పాటు బయటకు వచ్చి క్రాకర్స్ కాలిస్తే సంతోషిస్తాం… అని రాజ్ చెప్పగానే.. ఎవరు సంతోషిస్తారు మీరా..? అంటూ కావ్య అడగ్గానే..
నేనంటే నేను కాదు.. నా మేనల్లుడు నీకోసం బయట వెయిట్ చేస్తున్నాడు.. అని చెప్పగానే.. వాడు వెయిట్ చేస్తుంటే వాడే వచ్చి పిలుస్తాడు. మరి నువ్వెందుకు వచ్చి పిలుస్తున్నావు అని అడుగుతుంది కావ్య. దీంతో రాజ్ కోపంగా ఏయ్ అడ్డమైన లాజిక్కులు ఆట్లాడకు.. ఇప్పుడు వస్తావా..? రావా..? అని అడగ్గానే.. ముందు రావాలనే అనుకున్నా కానీ ఇదిగో మీరు ఇలా గొడవ పడుతంటే రాను.. నేను రావడం లేదు అంటుంది. దీంతో రాజ్ నేనేం గొడవ పడటానికి రాలేదు.. అని రాజ్ చెప్పగానే.. తెలుసు.. నన్ను ఒప్పించటానికి వచ్చారు. మీ ప్లాన్ కూడా అదే కదా..? అంటూ కావ్య చెప్పగానే.. రాజ్ సీరియస్ అవుతాడు. ప్లానేంటి..? అని అడుగుతాడు. దీంతో కావ్య ఈరోజు నన్ను ఒప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్తానని చాలెంజ్ చేశారు కదా..? అందుకే మీరు ఏ ప్లాన్ చేశారో ఏంటో.. అంటూ ఇద్దరూ గొడవపడుతుంటారు.
ఇంతలో బయట క్రాకర్స్ కాలుస్తున్న అప్పు బగా దగ్గుతుంది. దూరం నుంచి చూస్తున్న రాహుల్ ఇదేంటి మమ్మీ వాళ్లు ఇంకా రాలేదేంటి..? అని అడుగుతాడు. వెళ్లి అడగ్గానే వస్తే అది కావ్య ఎలా అవుతుందిరా.. వెయిట్ చేయ్ అని చెప్తుంది రుద్రాణి. ఇంతలో అప్పు దగ్గుతూ స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ కంగారు పడుతుంటారు. రాజ్ డాక్టర్ కు ఫోన్ చేయగానే డాక్టర్ వచ్చి అప్పును టెస్ట్ చేసి చూస్తుంది. మీరు కాల్చిన క్రాకర్స్ వల్లే ఇలా జరిగిందని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు ప్రాబ్లం లేదు కానీ ఇకనైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్లిపోతుంది. డాక్టర్ వెళ్లిపోయాక రుద్రాణి వచ్చి ఏంట రాజ్ ఇలా చేశావు.. అలాంటి డేంజరస్ క్రాకర్స్ ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా రాజ్‌ను తిడుతుంది.
కావ్య కూడా మీరు ఇది నా కోసం చేసిన ప్లానే కదా అంటూ నిలదీస్తుంది. అడవిలో మృగం కూడా కనిపిస్తేనే వేటాడుతుంది. ఇలా వెతుక్కుంటూ వచ్చి చంపదు.. మీరు అంత కంటే ఎక్కువే తయారయ్యారు.. మీరు ఈరోజు నిజం చెప్పాల్సిందే.. అంటూ కావ్య ప్రశ్నిస్తుంది. రాజ్ మౌనంగా ఉండిపోతాడు. దీంతో కావ్య రాజ్ కాలర్ పట్టుకుని నా బిడ్డను ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటూ నిలదీయడంతో రాజ్ ఆవేశంలో అలా చేయకపోతే నువ్వు చస్తావు కాబట్టి అంటూ నిజం చెప్పేస్తాడు. రాజ్ నిజం చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. కావ్య మాత్రం మళ్లీ ఇదొక కొత్త డ్రామానా..? ఆఖరికి నేను చచ్చిపోతాను అనేంత మాట మీ నోట వెంట ఎలా వచ్చిందండి అంటూ నిలదీస్తుంటే.. లోపల నుంచి అప్పు వచ్చి బావ చెప్పేది అబద్దం కాదు అక్క నిజం.. నువ్వు బిడ్డను కంటే చచ్చిపోతావు అనేది నిజం అక్క అంటూ చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.