IND VS PAK: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( 2026 Men’s T20 World Cup) మరికొన్ని నెలల్లోనే ప్రారంభం కానుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మొత్తం 20 జట్లు టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు సెలెక్ట్ అయ్యాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య ఈ టోర్నమెంట్ లో భాగంగా మ్యాచ్ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ రెండు జట్లు కూడా ఒకే గ్రూపులో ఉంటాయని కూడా అంటున్నారు. గ్రూప్ స్టేజిలో ఈ రెండు జట్ల మధ్య ఓ కీలక మ్యాచ్ జరగనున్నట్లు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ప్రతి ఐసీసీ టోర్నమెంట్ జరిగిన సమయంలో ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఏ ఐసీసీ ఈవెంట్ జరిగినా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సిందే అన్న విధంగా షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఫిబ్రవరి 8వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కొలంబో వేదికగా జరగనుందట.
టి20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ పైన ( 2026 Men’s T20 World Cup) సోషల్ మీడియాలో మొదటి నుంచి వార్త వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఐపిఎల్ 2026 టోర్నమెంట్ నిర్వహిస్తారని ప్రచారం జోరు అందుకుంది. ఇప్పటికే ఈ షెడ్యూల్ ఫైనల్ అయినట్లు చెబుతున్నారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. టీమిండియాతో పాటు శ్రీలంక రెండు జట్లు కూడా ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి. కొన్ని మ్యాచ్ లు ఇండియాలో జరిగితే మరికొన్ని మ్యాచ్ లు శ్రీలంకలో నిర్వహిస్తారు.
పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ శ్రీలంకలోని ఉంటుంది. టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఏ మ్యాచ్ జరిగిన శ్రీలంకలో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8వ తేదీన జరగబోతున్న లీక్ స్టేజి మ్యాచ్ కూడా శ్రీలంకలోని కొలంబో వేదికగా నిర్వహిస్తారు. మొత్తం ఇరవై జట్లను ఐదు గ్రూపులుగా డివైడ్ చేస్తారు. గ్రూప్ స్టేజిలో రాణించిన జట్లు సూపర్ 8 కు దూసుకువెళ్తాయి. సూపర్ 8 లో రెండు గ్రూపులు ఉంటాయి. అందులో దుమ్ములేపిన జట్లు సెమీ ఫైనల్ కు వెళ్తాయి. అందులో రాణించిన రెండు జట్లు ఫైనల్స్ లో తలపడతాయి.
ఐసీసీ ఈవెంట్స్ జరిగితే, తటస్థ వేదికల్లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఇప్పుడు కూడా కొలోంబో వేదికగా నిర్వహించనున్నారు. ఇక పాకిస్థాన్ మ్యాచ్ జరిగితే, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని ఇప్పటికే టీమిండియా నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ 2025 తరహాలోనే ఇప్పుడు వ్యవహరించనుంది.
Also Read: Team India -Divorce: విడాకులు తీసుకున్న మరో టీమిండియా ప్లేయర్…భార్య లేకుండానే దీపావళి వేడుకలు
🚨PAKISTAN AND INDIA IN SAME GROUP FOR T20 WORLD CUP 2026🚨
– They are likely to face each other on February 8 at Colombo.
– No handshakes, but want to play with Pakistan just for the sake of some revenue. 🤣🤣 pic.twitter.com/dd2Z7tkml2
— Sheikh Abdullah 🇵🇰 (@SheikhAbdulah56) October 21, 2025