Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో మిస్సమ్మను తిట్టిన పిల్లలు స్కూలుకు మనోహరితో వెళ్తామని చెప్తారు. దీంతో మనోహరి హ్యాపీగా పిల్లలను తీసుకుని స్కూలు వెళ్తుంది. అందరూ బయటకు వెళ్లాక అంజు ఆగిపోతుంది. అంజును చూసిన ఆనంద్ అంజు రా అని పిలుస్తాడు. దీంతో అంజు నేను రాను మీరే వెళ్లండి అని చెప్తుంది. దీంతో అమ్ము ఏమైంది ఎందుకు రావు అని అడుగుతుంది. దీంతో అంజు కోపంగా మనోహరి ఆంటీ మిస్సమ్మ గురించి తప్పుగా మాట్లాడింది. ఆంటీ మాటలు నమ్మి నువ్వు కూడా మిస్సమ్మతో ఎలా పడితే అలా మాట్లాడావు.. అని చెప్తుంది.
నేనేం తప్పుగా మాట్లాడలేదు అంజు అంటుంది అమ్ము. మిస్సమ్మతో నువ్వు అలా మాట్లాడటం తప్పే… మిస్సమ్మ మనల్ని ఎంత బాగా చూసుకుంటుంది. అని అంజు చెప్పగానే.. రేపటి నుంచి అలా చూసుకోదు. ఎందుకంటే తన సొంత బేబీ వస్తుంది అని మనోహరి చెప్పగానే.. అంజు కోపంగా మీరు మాట్లాడకండి ఆంటీ మాలాంటి పిల్లలకు మీరు అలా చెప్పడమే తప్పు అంటుంది. దీంతో అమ్ము కోపంగా ఆంటీ చెప్పింది రైట్ ఆంజు అంటుంది. ఏంటి రైటు మిస్సమ్మకు బేబీ పుడితే తప్పేంటి..? నువ్వు అనసరంగా ఆంటీ మాటలు విని పొల్యూట్ అవుతున్నావు.. అనగానే.. అమ్ము కోపంగా అంజు నువ్వు చిన్న పిల్లవి చిన్న పిల్లలాగా ఉండు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు అంటుంది. దీంతో అంజు నువ్వు కూడా చిన్న పిల్లవే కదా అమ్ము అంటుంది.
అయితే నేను మీ అందరి కంటే పెద్ద దాన్ని నాకు మంచి చెడు తెలుసు.. అంజు అని అమ్ము చెప్తుంది. అప్పుడు మా అందరి కంటే మిస్సమ్మ గురించి నీకే ఎక్కువ తెలియాలి. మాకంటే ముందు మిస్సమ్మకు నువ్వే సపోర్టు చేయాలి అంటుంది అంజు. దీంతో అమ్ము కోపంగా నాతో ఆర్య్గూ చేయకు అంజు.. మర్యాదగ మాతో వస్తావా..? రావా… అని అడగ్గానే.. అంజు రాను మిస్సమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నేన మీతో నేను అస్సలు రాను అంటుంది. ఇంతలో ఆకాష్ కూడా నాకు అంజు చెప్పింది కరెక్టు అనిపిస్తుంది అమ్ము.. మనం అనవసరంగా మిస్సమ్మను నెగటివ్‌గా చూస్తున్నాము.. అంటాడు. దీంతో అమ్ము లదు ఆకాష్ ఆంటీ చెప్పిందే కరెక్టు.. రేపటి నుంచి మిస్సమ్మ మన గురించి అసలు ఆలోచించదు అని చెప్పగానే అంజు కల్పించుకుని మిస్సమ్మ ఎప్పుడూ మన గురించే ఆలోచిస్తుంది అని చెప్పగానే.. ఇప్పటి వరకు మన గురించే ఆలోచిస్తుంది. కానీ రేపు బేబీ వచ్చాక మనల్ని అదిలిస్తుంది. అంతే కదా ఆనంద్ అని అడగ్గానే..
ఏమో అమ్ము నాక్కూడా మిస్సమ్మను తప్పను పట్టాలి అనిపించడం లేదు అంటాడు ఆనంద్. దీంతో మనోహరి ఇరిటేటింగ్ గా కష్టపడి వీళ్ల మనసును పొల్యూట్ చేస్తే.. ఇప్పుడు అంజు మాట్లాడింది విని అంతా భాగీ వైపు వెళ్లేలా ఉన్నారే అని మనసులో అనుకుని మీరు చన్న పిల్లలు ఆనంద్ పెద్ద వాళ్లు ఎప్పుడు ఎలా మారతారో మీకు తెలియదు.. అని చెప్పగానే.. అంజు కల్పించుకుని మిస్సమ్మ ఎప్పటికీ మారదు అని చెప్తుంది. అలా అని నువ్వు గ్యారంటీ ఇస్తావా..? చెప్పు గ్యారంటీ ఇస్తావా..? అని అమ్ము అడగ్గానే.. అంజు మౌనంగా ఉంటుంది. ఇప్పుడు డిసకర్షన్ ఎందుకు అమ్ము.. స్కూల్కు టైం అవుతుంది కదా..? పదండి వెళ్దాం అంటుంది మనోహరి. దీంతో అమ్ము కోపంగా వచ్చి కారెక్కు అంజు అంటుంది. నేను మీతో రానని చెప్పాను కదా..? అంటుంది. దీంతో అమ్ము కోపంగా రాకపోతే కాళ్లు విరగొడతాను.. ఆనంద్ ఆకాష్ వచ్చి కారు ఎక్కండి అని చెప్పగానే.. ఆనంద్, ఆకాష్ కారెక్కుతారు.. అంజును అమ్ము బలవంతంగా కారెక్కిస్తుంది.
అమ్ము కారెక్కాక ఆంటీ ఇక నుంచి మేము మిస్సమ్మ మాట వినం మీ మాటే వింటాము అని చెప్తుంది. నాకు కావాల్సింది కూడా అదే ఇదేంటి ఇంత కోపంగా ఉంది దీన్ని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి.. అనుకుంటూ కారు స్ట్రాట్ చేసుకుని వెళ్లిపోతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.