trinayani serial today Episode: దేవీపురం నుంచి నేత్రిని వెతుక్కుంటూ వాళ్ల బామ్మ రత్నాంబ వచ్చిందని ఇంటికి వచ్చి చెప్తాడు వల్లభ. కానీ ఆమె మనవరాలు అచ్చం పెద్ద మరదలు లాగానే ఉంది అంటాడు. దీంతో విశాల్ నాకు అర్తం అయింది అంటాడు. దీంతో అమ్మా అన్నయ్య పొరపాటు అనుకున్నారు కానీ త్రినేత్రి అనే అమ్మాయి నీలాగే ఉంది అందుకే నిన్ను నేత్రి అనుకుంటున్నారు అంటాడు. ఆ అనుమానం తీరాలంటే ఆ రత్నాంభను ఇంటికి తీసుకురావాలి అంటుంది సుమన. వీడు కంగారులో ఆ రత్నాంభను తీసుకురాలేకపోయాడు అని తిలొత్తమ్మ అంటుంది. ఇక దేవీపురంలోని నేత్రి వాళ్ల బామ్మను ఇక్కడికి నేనే తీసుకొస్తాను. తీసుకొచ్చాక నాకు జరిగిన అవమానాన్ని డబుల్ తీర్చుకుంటాను అని వెళ్లిపోతుంది తిల్తొత్తమ్మ.
ఆలోచిస్తూ కూర్చున్న నయని దగ్గరకు విశాల్ వెళ్తాడు. ఆ బామ్మ ఎవరో అన్నయ్యతో ఇంటికి వచ్చి ఉంటే నువ్విలా ఆలోచించేదానివి కాదు కదా..? కానీ అన్నయ్య నిజమే చెప్పాడు అనిపిస్తుంది. ఎవరో ఒక బామ్మ ఎదురు పడి నీ ఫోటో చూపించి ఉంటే నేను నమ్మేవాడిని కాదు. కానీ త్రినేత్రి పేరు చెప్పడమే కాదు వాళ్ల అత్తయ్య మామయ్యల పేర్లు కూడా చెప్పిందని చెప్పతాడు అందుకే నమ్మాల్సి వస్తుంది అంటాడు విశాల్. దీంతో నాలో ఉన్న ఆ త్రినేత్రి చూడాలని మీకు ఉందా ఏంటి బాబుగారు అని నయని అడుగుతుంది. హలో మేడం ప్రశ్నిస్తున్నారా..? లేక కవ్విస్తున్నారా..? అంటాడు విశాల్.
ఏదైనా అనుకోండి బాబుగారు అంటుంది నయని. అయితే నువ్వే నా ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలి. ఆ త్రినేత్రి నీలా ఉంటుందని మాకు ఇప్పుడు తెలిసింది. కానీ నీకు ఎప్పుడో తెలుసు అంటాడు విశాల్. నయని షాకింగ్ గా చూస్తుంటుంది. నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే నేనే త్రినేత్రిని అన్నావు. తర్వాత నేనే నయనిని అన్నావు. అయితే నువ్వు ఆ త్రినేత్రిని ఎక్కడ చూశావు.. ఎప్పుడు చూశావు అని విశాల్ అడగ్గానే నయని మౌనంగా ఉండిపోతుంది. నయని ఒకదాని తర్వాత ఒకటి అడుగుతున్నాను అని కన్పీజ్ కాకు నిదానంగానే చెప్పు అంటాడు విశాల్. చెప్తాను బాబుగారు కానీ నాకు కొంచెం టైం కావాలి నాకు కొన్ని గుర్తుకు రావాలి అంటుంది నయని. అయితే సరే ఓకే అంటూ వెళ్లిపోతాడు విశాల్.
ఇంట్లో ఉన్నది నయని కాదని తిలొత్తమ్మ, వల్లభ, సుమన ఆలోచిస్తుంటారు. ఎలాగైనా నేత్రి నిజం బయటపెట్టాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం మనలో ఒకరం నయని ఆత్మ మనలో దూరిందని నేనే నయని అని ఇంట్లో ఉన్నది నేత్రి అని చెప్తే బాగుంటుంది అని ప్లాన్ చేస్తారు. ప్లాన్ బాగుంది కానీ మనలో ఎవరు ఆత్మ సోకినట్టు చేయాలి అని సుమన అడగ్గానే.. ఆత్మ పూనినట్టు నువ్వు చేస్తేనే కరెక్టు అని తిలొత్తమ్మ చెప్తుంది. సుమన సరే అంటుంది.
తర్వాత సుమన జుట్టు విరబోసుకుని దెయ్యం పట్టినట్టు బిహేవియర్ చేస్తుంది. సుమను చూసిన దురందర భయంతో గట్టిగా కేకలు వేస్తుంది. ఇంతలో అందరూ వస్తారు. విక్రాంత్ కోపంగా తిడుతూ సుమన ఏంటి అలా ఉన్నావు అని దగ్గరకు వెళ్తుంటే.. దగ్గరకు రావొద్దు అంటూ అరుస్తుంది సుమన. ఇంతలో తిలొత్తమ్మ, సుమనకు దెయ్యం పట్టింది అని చెప్పగానే ఎవ్వరూ నమ్మరు. ఇంతలో సుమన కోపంగా నేను నయనిని సుమనలో పూనాను అంటుంది.
దీంతో విక్రాంత్ ఏయ్ సుమన పిచ్చిగా ఏం చేస్తున్నావు అక్కడ నుంచి లేవు అంటాడు. దీంతో నేను నయని అంటే అర్థం కావడం లేదా విక్రాంత్ బాబు అంటుంది. దీంతో విక్రాంత్ షాక్ అవుతాడు. మీరెవరూ భయపడకండి సుమనకు ఏం చేయాలో గాయత్రి పాపకు తెలుసు అంటూ గాయత్రి పాపను కిందకు దింపగానే సుమన వైపు వెళ్తుంది. సుమన దగ్గరకు రావొద్దు అంటూ అరుస్తుంది. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?