Tips For Black Hair: నేటి కాలంలో చిన్న వయస్సు నుండే జుట్టు తెల్లబడుతోంది. చాలా మందిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. 20 నుండి 30 సంవత్సరాల వయస్సు వారిలో కూడా జుట్టు రంగు మారడంతో పడరాని పాట్లు పడుతున్నారు. వయస్సు పెరుగుతున్నా కొద్దీ జుట్టు తెల్లబడుతుంటే ఓకే కానీ. అంతకంటే ముందే తెల్లజుట్టు వస్తోందంటే తప్పకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ రోజు మనం మీ జుట్టును చాలా కాలం పాటు నల్లగా, అందంగా మార్చడానికి ఉపయోగపడే కొన్ని రకాల హోం రెమెడీస్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను తెలుసుకుందాం.
ఉసిరి నూనె, పొడి:
మీ జుట్టు నల్లగా ఉండాలంటే ఉసిరి నూనె లేదా పొడిని వాడాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది జుట్టు రంగను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా చిన్న వయస్సులోనే జుట్టు రంగు మారకుండా చేస్తుంది. మీ జుట్టు నల్లగా ఉండాలంటే ఆమ్లా ఆయిల్‌తో మీ జుట్టు, తలను మసాజ్ చేసుకోవచ్చు.
కరివేపాకు ఉపయోగించండి:
కరివేపాకు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకు ఉపయోగించడం వల్ల మెలనిన్ ఉత్పత్తి పునరుద్ధరించబడుతుంది. జుట్టుకు కరివేపాకును ఉపయోగించడం చాలా సులభం. మీరు దీన్ని కొబ్బరి నూనెతో కలిపి కాసేపు వేడి చేయాలి. చల్లారిన తర్వాత మీ జుట్టుకు పూర్తిగా అప్లై చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు జట్టు రాలకుండా చేస్తాయి.
Also Read: వీటితో.. చుండ్రుకు చెప్పండి గుడ్ బై
జుట్టు కోసం హెన్నా మాస్క్:
జుట్టు నల్లగా, అందంగా ఉండేందుకు హెన్నాను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఇది మీ జుట్టుకు బలాన్ని ఇవ్వడంతో పాటు అవసరమైన పోషణను అందిస్తుంది. ముందుగా హెన్నాను మందపాటి పేస్ట్ లాగా సిద్ధం చేయండి. తర్వాత జుట్టుకు అప్లై చేసి.. కొన్ని గంటలపాటు అలాగే ఉంచి చివరగా జుట్టును కడగాలి. మీరు తేడాను స్పష్టంగా చూడటం ప్రారంభిస్తారు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.