IND vs AUS 1st Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ ( Border Gavaskar Trophy 2024)… మరో మూడు రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే టీమ్ ఇండియా ( Team India)… ఆస్ట్రేలియా కు ( Australia ) చేరుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ మినహా మిగతా ప్లేయర్ లందరూ అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఆస్ట్రేలియా గడ్డ పైన కచ్చితంగా గెలవాల్సిన ఈ ట్రోఫీ కోసం… ముందుగానే ప్రాక్టీస్ చేస్తున్నారు టీమిండియా ప్లేయర్లు.
Also Read: Indian players – BGT: ఆస్ట్రేలియాతో మ్యాచ్… బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ప్లేయర్స్ ?
అక్కడికి వెళ్లిన తర్వాత మొట్టమొదటగా ఆస్ట్రేలియా ( Australia ) వాతావరణం అలవాటు కావాలి. అక్కడ వీచే చల్లటి గాలులను.. టీమిండియా ( Team India) ప్లేయర్లు తట్టుకొని ఆడాలి. అందుకే ఈ సిరీస్ ప్రారంభానికి 15 రోజుల ముందుగానే అక్కడికి వెళ్లారు. ఇక నవంబర్ 22వ తేదీన అంటే మూడు రోజుల్లోనే ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఈ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది.
Also Read: RCB New Bowling Coach: RCBకి కొత్త బౌలింగ్ కోచ్…ఇప్పటివరకు ఒకే ఒక్క వికెట్ తీసాడు ?
ఇక ఈ మ్యాచ్ చూసేందుకు దాదాపు 85, 000 మంది అభిమానులు స్టేడియానికి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెపాసిటీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో స్టేడియం లో సీట్ల సంఖ్యను కూడా భారీగా పెంచారట. ఈ ట్రోఫీలో కచ్చితంగా టీమిండియా నాలుగు మ్యాచ్లు గెలవాలి. నాలుగు మ్యాచ్లు గెలిస్తేనే… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు టీమిండియా అర్హత సాధిస్తుంది. లేకపోతే అర్హత సాధించకపోవడమే కాకుండా… టెస్ట్ ర్యాంకింగ్స్ కూడా కోల్పోతుంది టీమిండియా.
ఇలాంటి నేపథ్యంలో ఐదు టెస్టుల సిరీస్ ఆడెందుకు ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది టీం ఇండియా ( Team India). ఇక మొదటి టెస్ట్ వివరాల్లోకి వస్తే… ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరం కానున్నాడు. తనకు కొడుకు పుట్టిన నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్నాడు రోహిత్ శర్మ. దీంతో టీమిండియా కెప్టెన్సీ బుమ్రా కు రానుంది. అయితే రెండో టెస్ట్ నుంచి రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు. అయితే ఇంతటి కృషియల్ టైంలో… రోహిత్ శర్మ జట్టులో లేకపోతే టీమ్ ఇండియా గెలవడం కష్టమే.
సీనియర్లు ఎంత బుజ్జగించిన మొదటి టెస్ట్ కు దూరం కాబోతున్నట్లు ప్రకటించేసాడట రోహిత్ శర్మ ( Rohit sharma). ఇక మొదటి టెస్ట్ టైమింగ్స్ ఒకసారి పరిశీలిస్తే.. ఉదయం ఏడు గంటల 50 నిమిషాలకే ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇంకా, 5 మ్యాచ్‌ల సిరీస్‌ను డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
భారత్ vs ఆస్ట్రేలియా 1వ టెస్ట్ టైమింగ్: