BigTV English

Trinayani Serial Today November 1st: ‘త్రినయని’ సీరియల్‌:   తనను పాము కాటేస్తున్నట్లు తెలుసుకున్న నయని – విక్రాంత్‌ ను కొట్టిన తిలొత్తమ్మ

Trinayani Serial Today November 1st: ‘త్రినయని’ సీరియల్‌:   తనను పాము కాటేస్తున్నట్లు తెలుసుకున్న నయని – విక్రాంత్‌ ను కొట్టిన తిలొత్తమ్మ

trinayani serial today Episode:  తిలత్తమ్మ కోపంగా విక్రాంత్‌ ను కొడుతుంది. దీంతో తమ్ముణ్ని ఎందుకు కొట్టావు మమ్మీ అని వల్లభ అడుగుతాడు. కళ్ల ముందు తన ప్రాణగండాన్ని పెట్టుకుని కూడా తెలుసుకోలేకపోయాననే ఫీల్‌ అయిన కోపంతో కొట్టిందని విక్రాంత్‌ చెప్తాడు. దీంతో తిలొత్తమ్మ కోపంగా విక్రాంత్‌ను తిడుతూ నోరు మూయ్‌ అంటుంది. నేను నీ కన్నతల్లినిరా నా చావు కోరుకుంటావా? గాయత్రి అక్కా పునర్జన్మ ఎత్తాకా..? తప్పిపోయింది అనుకుని ఇక రాదు అనుకుని ప్రశాంతంగా బతుకుతుంటే వీడు ఆ రహస్యాన్ని బయటపెట్టాడు అని తిలొత్తమ్మ తిడుతుంది. ఇప్పుడు నేను చెప్పకపోయినా ఏదో ఒక రోజు బయటపడుతుంది అంటాడు.


ఇంతలో సుమన వచ్చి ఏమైందని అడుగుతంది. వల్లభ మా ఇద్దరి చెంపల మీద  దోమలు వాలితే మా అమ్మ చంపేసిందని చెప్తాడు. నీకు కూడా దొమ వాలిందేమో చూసుకో అని విక్రాంత్‌ అనగానే నాకేమీ వద్దు.. అత్తయ్యగారికి ఎప్పుడు నా సపోర్టు ఉంటుందని సుమన చెప్తుంది. దీంతో చూశావారా..? తొడబుట్టిన నయని కన్నా సుమన నాకే ఎక్కువ గౌరవం ఇస్తుంది అని తిలొత్తమ్మ చెప్తుంది. విక్రాంత్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆయన బాగా బాధపడ్డారు అనుకుంటా అంటుంది సుమన. దీంతో నువ్వు బాగు పడటం వాడికి ఇష్టం లేదనుకుంటా అంటుంది తిలొత్తమ్మ.

ముక్కోటి ఇంట్లోకి హుషారుగా వచ్చి తన భార్య వైకుంఠాన్ని హగ్‌ చేసుకుంటాడు. దీంతో ఎప్పుడు నీరసంగా ఉండే మీరు ఇవాళేంటి హుషారుగా ఉన్నారు అని అడుగుతుంది. ఇది హుషారు కాదే సంతోషం అని పుట్టసర్పయ్య ఊర్లోకి వచ్చాడని ఆ పాములోడి దగ్గర విష సర్పాలు అరడజను ఉన్నాయే.. ఇవాళ అడవి అమ్మోరును శుభ్రం చేసి సింగారించడానికి వెళ్తుంది త్రినేత్రి. మనం వెనకాలే వెళ్లి పుట్టసర్పయ్య ఇచ్చే పాములు తీసుకుని వెళ్లి అక్కడ పడేస్తే ఆ పాములు త్రినేత్రిని చంపేస్తాయి. తర్వాత ఆస్థి మనకు వస్తుంది. అని చెప్తాడు ముక్కోటి.. సరేనంటుంది వైకుంఠం.


గాయత్రి పాపే నయని పెద్ద బిడ్డ అని నిజం తెలిసిపోయింది. ఇప్పుడు తిలొత్తమ్మ ఏం చేస్తుందంటావు అని హాసినిని అడుగుతాడు పావణమూర్తి. ఇన్నాళ్లు అనాథ పిల్ల, దత్తపుత్రిక అన్న తిలొత్తమ్మ అత్తయ్యా ఇప్పుడు గాయత్రిని చూసే చూపులో తేడా ఉంటుంది అని హాసిని చెప్తుంది. జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుని పళ్లు నూరుకుంటూ ఉంటుంది. ధ్వేషంతో రగిలిపోతూ గాయత్రి పాప నుంచి చావుదెబ్బను ఎలా తప్పించుకోవాలా? అని ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఉంటుంది అని హాసిని చెప్తుంటే.. మా గురించే మట్లాడుతున్నారా… అని అడుగుతూ తిలొత్తమ్మ వాళ్లు వస్తారు.

అవునని మనం ఎవరి గురించైనా మాట్లాడుతుంటే వాళ్లు వచ్చారంటే వాళ్లు నిండా నూరేళ్లు బతుకుతారట అని హాసిని చెప్పగానే అయినా ఇప్పుడు అత్తయ్యకు ఏం రోగం ఉందని అర్ధాయుష్సుతో పోవడానికి అని సుమన అడుగుతుంది.  అయితే ఇప్పట్లో చావదంటావా? చిట్టి అని హాసిని అంటుంది. ఇంతలో నయని, విశాల్‌ వచ్చి ఏమైందని అడుగుతారు. ఏం లేదని అక్కయ్యకు ఇంకా ఎంత ఆయుష్షు ఉంటుందని మాట్లాడుకుంటున్నాము అంటాడు పావణమూర్తి. దీంతో తిలొత్తమ్మ పావణమూర్తిని తిడుతుంది. గాయత్రి పాపే పెద్దమ్మ అని తెలిసింది కాబట్టి నీ టాఫిక్‌ వచ్చి ఉంటుంది అమ్మా అని చెప్తాడు విక్రాంత్‌. నాకు అర్థం కాలేదని సుమన అడుగుతుంది.

ఏంలేదని అనవసరంగా టెన్షన్‌ పడకండి అని నయని చెప్తుంది. ఇంతలో నయనికి మూడో కన్ను యాక్టివేట్‌ అయి త్రినేత్రిని పాము కాటేయబోతున్నట్లు కనిపిస్తుంది. వెంటనే నయని షాక్‌ అవుతుంది. తననే పాము కాటేయబోతున్నట్లు భయపడుతుంది నయని. ఈ విషయం విశాల్‌ కు చెప్తే భయపడతాడని చెప్పాలా? వద్దా అని డైలమాలో ఉంటుంది. దీంతో నయని ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావెందుకు అని తిలొత్తమ్మ అడగ్గానే ఏం లేదని బెడ్‌ రూం లోకి వెళ్తుంది నయని. దీంతో టిఫిన్‌ పెడతానని చెప్పి పెద్ద మరదలు రూంలోకి వెళ్లిందేంటి అని వల్లభ అడుగుతాడు. ఏదో జరిగి ఉంటుందిలే అంటుంది తిలొత్తమ్మ.

లాప్‌ టాప్‌ పట్టుకుని బయటకు వస్తున్న సుమనను నేను దేనికోసం అయితే వస్తున్నానో దాన్నే పట్టుకుని నాకు ఎదురుగా వస్తున్నావా? చిట్టి అని హాసిని అడుగుతుంది. దీనితో నీకేం పని అక్కా అని సుమన అడగ్గానే ఎంబీయేలో గోల్డ్‌ మెడల్‌ నేను నాకు అవసరం రాకుండా ఉంటుందా? అని హాసిని చెప్పగానే ఎంబీయే అంటే దీనికి ఏం అర్థం అవుతుంది వదిన గోల్డ్‌ అనేది ఒక్కటే అర్థం అయ్యుంటుంది. అనగానే దీన్ని కాలవలో వేద్దామనుకుంటున్నాను అంటుంది సుమన. అంత పని చేయోద్దని ఇందులో మన కంపెనీ ఫైల్స్‌ ఉంటాయని హాసిని చెప్పినా సుమన వినదు. దీంతో విక్రాంత్‌ లాప్‌ టాప్‌ సుమన చేతిలోంచి లాక్కుని హాసినికి ఇస్తాడు.

బెడ్‌ రూంలో ఉన్న నయని గాయత్రి దేవి ఫోటో ముందు నిలబడి ఏడుస్తుంది. మీరు నా బిడ్డగా పుట్టి.. గాయత్రి పాపగా నా దగ్గరే పెరుగుతున్నారని తెలియక… పోయిన మీరు ఎక్కడున్నారు.. ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఆరాట పడేదాన్ని. ఇప్పుడు మీరు నా కళ్ల ఎదురుగా పసిపాపగా ఉన్నారు. నాకు ఏదైనా జరిగితే తిలొత్తమ్మ అత్తయ్యకు మీరు దొరికిపోతారేమో.. మిమ్మల్ని ఏమైనా చేస్తారేమోనన్న భయం నన్ను వెంటాడుతుంది. అని ఏడుస్తుంది. ఇంతలో విశాల్‌ వచ్చి వింటాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×