Prabhas : మామూలుగా మ్యూజిక్‌కి ఉండే పవర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరికి మ్యూజిక్ అంటే ఒక వ్యసనం. కొన్నిసార్లు కొన్ని పాటలు మనకు ఓదార్పు అవుతాయి. మనకున్నటువంటి ఒత్తిడి నుంచి సంగీతం కొంత ఉపశమనం కలిగిస్తుంది అనేది వాస్తవం. కేవలం మామూలు ప్రేక్షకులకే కాకుండా సినీ నటులకు కూడా ఇష్టమైన సంగీతం ఉంటుంది. ఇక కొందరు హీరోలు తమ సినిమాల్లో అద్భుతమైన పాటలు ఉండాలని కోరుకోవడం కూడా సహజంగా జరుగుతుంది. చాలామంది స్టార్ హీరోలు సినిమాలలో అద్భుతమైన పాటలను కంపోజ్ చేసిన సంగీత దర్శకులు ఉన్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ప్రభాస్ కూడా సంగీతాన్ని విపరీతంగా వింటూ ఉంటారు. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ ను ఫాలో అవుతూ ఉంటారు. తమ సినిమాల్లోనే కాకుండా వేరే సినిమాల్లో పాటలను కూడా ఇష్టపడుతూ ఉంటారు.
ఇక రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ తనకు ఇష్టమైన పాట గురించి రీవీల్ చేసాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాలోని “ఛలోరే ఛలోరే చల్ చల్” సాంగ్ తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.అయితే ప్రభాస్ ఆ పాట గురించి దాదాపు ఒక వంద మందికి పైగా చెప్పి ఉంటాడట, ఏ పార్టీ అయినా కూడా ఆ పాట గురించి ఖచ్చితంగా చర్చ కూడా పెడతాడట. చాలామందికి ఆ పాట వినిపించి ఈ లైన్ చూడు ఎంత బాగుందో ఎంత బాగా రాశారు అని మాట్లాడుతూ ఉంటాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఆ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ పాటలోని ప్రతి లైన్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. “రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం, రకరకాలు ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం” వంటి లైన్స్ ఆ పాటలు విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచించే విధంగా అనిపిస్తాయి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో కూడా ఇలా సాహిత్యాన్ని గమనించి పదిమందితో పంచుకోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అని చెప్పాలి.
Also Read : Hero Darshan: దర్శన్ పై అమితమైన ప్రేమ పెంచుకున్న స్టార్ హీరోయిన్.. చచ్చేవరకు అంటూ..!
ఇక ప్రభాస్ కి కూడా ఎన్నో అద్భుతమైన పాటలు రాసారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చక్రం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కూడా ఇప్పటికీ ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో జగమంత కుటుంబం నాది పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేవలం ఆ పాట గురించి కృష్ణవంశీ ఈ సినిమాను తీశానని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. ఈ సినిమా కోసం కాకుండా ఎప్పుడో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ పాటని రాశారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ పాట అంటే నాకు ఇష్టం అని ప్రభాస్ చెప్పగానే ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ప్రభాస్ ని పొగడ్డం మొదలుపెట్టారు.