BigTV English

Trinayani Serial Today October 15th: ‘త్రినయని’ సీరియల్‌: తన మరణం తాను చూసుకున్న నయని – అదంతా ఉత్తిదే అన్న దురందర  

Trinayani Serial Today October 15th: ‘త్రినయని’ సీరియల్‌: తన మరణం తాను చూసుకున్న నయని – అదంతా ఉత్తిదే అన్న దురందర  

trinayani serial today Episode:  అలాంటి విపత్తు జరగుతుందంటే నయని చెప్పకుండా ఉంటుందా? అని విశాల్‌ అంటాడు. కానీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని అడుగుతున్నాము బావగారు అంటుంది సుమన. తనకి తెలిస్తేనే  కదా? అంటుంది హాసిని. దీంతో తెలుసని చెప్తుంది తిలొత్తమ్మ. తెలిస్తే చెప్పేదాన్నే కదా అత్తయ్య అంటుంది నయని. కనీసం క్లూ తెలిసిన నయని వెంటనే చెప్పేస్తుందమ్మా అంటాడు విశాల్‌.


తెలిసిన కూడా చెప్పకుండా ఉదేమో తమ్మి అటాడు వల్లభ. అలా అనకండి బావగారు నేను దాచిపెట్టినా దానికో అవసరం ఉంటుంది అని నయని అనగానే ఇప్పుడు దాస్తున్నావేమో అనిపిస్తుంది నయని అని తిలొత్తమ్మ అంటుంది. దయచేసి అందరూ మాట్లాడకుండా ఉంటారా? అని నయని నువ్వు చెప్పు ఏం జరుగుతుంది అని అడుగుతాడు విశాల్‌. నిజంగా నాకు తెలిస్తే ఎప్పుడో చెపేదాన్ని కదా బాబుగారు అంటుంది నయని. విక్రాంత్‌ మాత్రం వదిన మాకోసం ఒక్కసారి కళ్లు మూసుకుని ఎవరికి ఆపద వస్తుందో చెప్పగలవా? అని అడుగుతాడు. దీంతో అందరూ ఒక్కసారి చూడమని చెప్తారు.

నయని, గాయత్రి దేవికి మొక్కుకుని కళ్లు మూసుకుంటున్నాను. అదేంటో నాకు తెలిసేలా చేయండి అని కళ్లు మూసుకుంటుంది. నయనికి తన ఫోటోకే దండ వేసి ఉండటం కనిపిస్తుంది. వెంటనే నయని షాక్‌ అవుతుంది. భయంతో కిందపడబోతుంటూ విశాల్‌ వచ్చి పట్టుకుంటాడు. నయని ఏమైందని అడుగుతాడు. నయని కంగారుగా చూస్తుంటుంది. నయని అంత కంగారు పడుతుందంటే కచ్చితంగా మనకేం ఆపద లేదనిపిస్తుంది మమ్మీ అంటాడు వల్లభ. ఇంతలో హాసిని ఏమైందని రిలాక్స్‌ గా అడుగుతుంది. నయని కంగారుగా ఏదో జరగబోతుంది అని చెప్తుంది.


నయని నువ్వింతలా టెన్షన్‌ పడటం నేనెప్పుడూ చూడలేదు. నీకేం కనిపించిందో భయపడకుండా చెప్పు అని విశాల్‌ అడగగానే.. ప్రాణగండం పొంచి ఉంది బాబు గారు అని నయని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. మృత్యువు వెంటాడుతుంది. మరణం తప్పదనిపిస్తుంది అని చెప్పగానే అందరూ తమకా..? తమకా? అని అడుగుతారు. హాసిని మాత్రం మా ఆయనకు కానీ తిలొత్తమ్మ అత్తయ్యాకా అని అడుగుతుంది. ఇంతలో వల్లభ మాకు ప్రాబ్లమ్‌ అయితే పెద్ద మరదలు అంత టెన్షన్‌ పడదు. కచ్చితంగా విశాల్‌ తమ్మికే ప్రాణగండం ఉండొచ్చు అంటాడు.

కాదు బాబుగారికి ఏమీ కాదు. నేను బతికి ఉండగా అలా జరగనివ్వను.. కానీ నేనే లేకపోతే బాబుగారిని.. నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్తుంది. దీంతో విశాల్‌ ఏంటి నయని ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అవును బాబుగారు ప్రాణగండం నాకే ఉంది అని చెప్తుంది. ఇంతలో దురందర నాకో డౌటు.. నయనికి కానీ తన బిడ్డలకు కానీ ప్రాణగండం వస్తుందటే నయనికి తెలియదు కదా? అంటుంది. దీంతో అందరూ అవునని అంటారు. నయని కూడా నిజమే కదా? మరి నాకెందుకు అలా కనిపించింది అంటుంది నయని. ఏం లేదు నయని ఏం జరగబోతుందో చూడమని నిన్ను ఒత్తిడి చేసినందుకు నీకు అలా అనిపిస్తుంది అని నయనిని లోపలికి తీసుకెళ్తాడు విశాల్‌.

సుమన ఏదో రాస్తుంటే విక్రాంత్‌ వస్తాడు. ఏం రాస్తున్నావు అని అడుగుతాడు. ఆస్ధిపాస్తుల ఏమున్నాయో ఒక అంచనా వేద్దామని రాస్తున్నాను అంటుంది సుమన. నీ దగ్గర ఏముంది చీరలు తప్పా అంటాడు విక్రాంత్‌. అబ్బా నా ఆస్థులు గురించి ఎందుకు రాస్తాను.. మా అక్క పేరు మీద ఎన్ని ఆస్థులు ఉన్నాయో విశాల్‌ బావ ఎంత కూడబెట్టారో రాస్తున్నాను. రేపు పొద్దున మా అక్క చనిపోతే లాయర్‌ గారు వస్తే చెప్పడానికి ముందే రాస్తున్నాను అంటుంది సుమన. దీంతో సుమనను తిడతాడు విక్రాత్‌.

మా వదిన అంత ఆరోగ్యంగా నువ్వు కూడా లేవు అంటూ కోప్పడతాడు. మీరు మాటలతో భయపెట్టడం వల్లే ఆమె అలా కంగారుపడుతుంది అంటాడు. నీ పిచ్చి పరాకాష్టకు చేరింది అంటూ పేపర్‌ లాక్కుని చించేస్తాడు విక్రాంత్‌. నీకు కనక బుద్ది జ్ఞానం ఉంటే నయని వదిన ఆయఃఆరోగ్యాలతో ఉండాలని పూజలు, వ్రతాలు చేయమని చెప్తాడు. దీంతో మీరు మా అక్క మీద అభిమానంతో నిజాన్ని గ్రహించడం లేదు కానీ మా నయని అక్క చెప్పింది జరగకుండా లేదు ఇప్పటివరకు అంటుంది సుమన. ఒకవేళ అలా జరిగితే మాత్రం నేను మొక్కే దేవుడిని కూడా ఇక నమ్మను అంటూ వెళ్లిపోతాడు విక్రాంత్‌.

బయట గార్డెన్‌ లో కూర్చున్న నయనిని ఓదారుస్తుంటాడు విశాల్‌. మేము ఒత్తిడి చేయడం వల్లే నీకు అలా కనిపించింది అంటాడు. మీరన్నట్లు నాకు ఏమీ కాకపోతే మీ కన్నా ఎక్కువ ఎవరు సంతోషిస్తారు బాబాగారు అంటుంది నయని. కానీ ఆ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో భయంగా ఉందని అంటుంది. చూడు నయని ఎవరెవరో సంబంధం లేనివాళ్లనే నువ్వు కాపాడావు. కానీ నీకు గండం వస్తుందంటే నీకు తెలియకుండా ఉంటుందా? నీకేం కాదు నయని అంటాడు విశాల్‌. అసలు దీని గురించి ఆలోచించొద్దు అంటూనే నేను కూడా అదే మాట్లాడుతున్నాను అంటాడు. అయితే ఒక్క విషయం అడుగుతాను చెప్తారా? నాకు మాట ఇస్తారా? అని అడుగుతుంది. నేను ఉన్నా లేకున్నా మన బిడ్డల కోసం మీరు ఉండాలి అని చెప్తుంది. దీంతో చూడు నయని నువ్వు నాకు.. నేను నీకు ఈ జన్మ ఉన్నంత వరకు ఉంటాము నువ్వు సైలెంటుగా పడుకో అంటాడు విశాల్‌.

తిలొత్తమ్మ ఏవో పేపర్స్‌ తీసుకుని అటూ ఇటూ తిప్పుతుంది. వల్లభ చూసి ఇందాక నుంచి ఆ పేపర్స్‌ ను పెసరట్టులా అటూ ఇటూ తిప్పుతున్నావు కానీ ఏమీ చెప్పడం లేదేంటి మమ్మీ అని అడుగుతాడు. ఇదేం పేపరు అనుకున్నావురా..? అని అడుగుతుంది తిలొత్తమ్మ. దీంతో వేస్ట్‌ పేపరు అంటాడు వల్లభ. అందుకే నిన్ను చులకనగా చూస్తారు అందరూ అని ఇది నయని జాతక చక్రం. తనకు గండం ఉందని చెప్పింది కదా? అందుకే ఒకసారి చెక్‌ చేపిద్దామని తీసుకున్నాను అంటుంది తిలొత్తమ్మ. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Intinti Ramayanam Serial Today September 25th: ‘ఇంటింటి రామాయణం’ సీరియల్‌: జాబ్‌ కు రిజైన్‌ చేసిన అక్షయ్‌

Illu Illalu Pillalu Serial Today September 25th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీద పగ తీర్చుకుంటానన్న విశ్వ

Gunde Ninda Gudi Gantalu Serial Today September 25th: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: రోహిణిని అనుమానించిన బాలు    

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Big Stories

×