E-Paper
Advertisement

Shraddha Kapoor: పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. గంతకు తగ్గ బొంతే..!

Shraddha Kapoor: పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. గంతకు తగ్గ బొంతే..!
Advertisement

Shraddha Kapoor : ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన సాహో (Sahoo) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) తన అంద చందాలతో, నటనతో విపరీతంగా ఆకట్టుకుంది. అంతకుముందు బాలీవుడ్ లో ఆషిఖీ 2 సినిమాతో హిందీ ఆడియన్స్ ను మెప్పించింది. శ్రద్ధా కపూర్ ఇటీవల స్త్రీ 2 సినిమా తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా చిన్న సినిమాగా వచ్చి వందల కోట్లు వసూలు చేస్తూ రికార్డు సృష్టిస్తూ ఎన్నో సినిమాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్న ఎంతోమంది దర్శకులకు ఈ సినిమా గట్టి దెబ్బ కొట్టింది అనడంలో సందేహం లేదు. తక్కువ బడ్జెట్.. పైగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా వచ్చి కలెక్షన్లు సునామీ సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమాతో అటు శ్రద్ధా కపూర్ కి కూడా మంచి పేరు లభించింది అన్న విషయం తెలిసిందే.

బిజినెస్ మాన్ తో ఎఫైర్ పెట్టుకున్న శ్రద్ధా కపూర్..

Advertisement

ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా ఆషిఖి 2 హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు బాగా వినిపిస్తున్నాయి.. అయితే ఈ జంట బ్రేకప్ అయిన తర్వాత దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్ తో ఈమె రిలేషన్ లో ఉన్నట్లు కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పలువురుతో శ్రద్ధా కపూర్ ప్రేమాయణం సాగించిందని వార్తలు ప్రచారం జరిగాయి. అందులో ప్రభాస్ పేరు కూడా వినిపించింది. సాహో సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రాగా ఇది నిజం కాదని వారు ఖండించారు. ఇక ఇప్పుడు ప్రముఖ బిజినెస్ మెన్ రాహుల్ మోడీ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై ఈమె స్పందించలేదు కానీ పెళ్లి పై ఊహించని కామెంట్లు చేసింది.

పెళ్లిపై ఊహించని కామెంట్స్.

Advertisement

శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.. సాధారణంగా నేను కలిసి పని చేయడం కంటే ఒంటరిగా సమయాన్ని గడపడానికి ఇష్టపడతాను. సాధారణంగా నేను ఒంటరిగా పనిచేయడం కంటే కలిసి పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను ముఖ్యంగా నా స్కూల్ ఫ్రెండ్స్ ను కలవకపోయినా సరే నా మానసిక స్థితిని అది ప్రభావితం చేస్తుంది. అందుకే ఎక్కువగా కుటుంబ సమేతంగా భోజనం చేయడానికి ఆసక్తి చూపిస్తాను..అది చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. నాతో సంబంధం లో ఉన్న వారితో కూడా ఇలాగే ఉంటాను అంటూ తెలిపింది. వివాహం గురించి మాట్లాడుతూ.. నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం కాదు అయితే సరైన వ్యక్తి దొరకడం ముఖ్యం. ఎవరైనా వివాహం చేసుకోవాలని భావిస్తే పెళ్లి చాలా బాగుంటుంది కానీ పెళ్లి చేసుకోకూడదని భావించినప్పుడు అది కూడా బాగుంటుంది అంటూ రెండు మాటలు తెలిపింది శ్రద్ధ. పెళ్లి చేసుకున్న, చేసుకోకపోయినా బాగానే ఉంది కదా అనేది తన ఉద్దేశ్యంగా చెప్పుకొచ్చింది మొత్తానికైతే అటు ప్రభాస్ కూడా పెళ్లిపై ఎటువంటి కామెంట్లు చేయలేదు. ఇక ఈమె ఏమో పెళ్లి చేసుకున్నా ఒకటే , చేసుకోకపోయినా ఒకటే అంటూ కామెంట్లు చేసింది. ఇది చూసిన అభిమానులు గంతకు తగ్గ బొంత అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×