E-Paper
Advertisement

SD18 : సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది..స్పెషల్ వీడియోతో ట్రీట్ అదిరింది మామా…

SD18 : సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది..స్పెషల్ వీడియోతో ట్రీట్ అదిరింది మామా…
Advertisement

Sai Dharam Tej : మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాల లైనప్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. గతేడాది ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన ప్రత్యేకమైన కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ‘విరూపాక్ష’, ‘బ్రో’ విజయాల తర్వాత సాయి ధరమ్ తేజ్.. రోహిత్ కెపి దర్శకుడిగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేస్తున్నారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్బంగా ఓ స్పెషల్ వీడియోను వదిలారు.. ఆ వీడియోలో హైలెట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..

ఆ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. జనాల్లో ఈ మూవీ పై అంచనాలను పెంచేందుకు తాజాగా మేకర్స్ సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్బంగా సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో యుద్దానికి సంబందించిన వాతావరణం కనిపిస్తుంది. పురాతనమైన ప్రాంతానికి సంబందించిన కథగా తెలుస్తుంది. ఈ వీడియోలోని బ్యాగ్రౌండ్ చూస్తుంటే సినిమాలో హీరో యోధుడి పాత్రలో కనిపించునున్నారని తెలుస్తుంది. మొత్తానికి ఈ విజువల్స్ చూస్తుంటే గుండెల్లో వణుకు పుడుతుంది. కథ కాస్త కొత్తగా గతంలో ఎవ్వరూ చూపించని విధంగా ఉందని తెలుస్తుంది.. ఇక ఈ బీజిఏం సౌండ్ కు థియేటర్లు దద్దరిల్లుతాయని తెలుస్తుంది.. యాక్షన్ సీన్లతో సినిమా అదిరిపోతుందని మెగా ఫ్యాన్స్ వీడియోను చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.. ఏది ఏమైనా హీరో ఈ మధ్య ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు.

Advertisement

ఇక మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్‌లలో సాయి ధరమ్ తేజ్ పవర్ ఫుల్ మాస్ అవతార్‌లో ఇందులో కనిపించనున్నారు. హై-ఆక్టేన్ స్టంట్స్, డైనమిక్ ఫైట్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. భారీ జ్ బడ్జెట్‌తో భారీ స్థాయిలో టాప్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమాని తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీ విడుదల కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×