BigTV English

Trinayani Serial Today September 26th: ‘త్రినయని’ సీరియల్‌: మణికాంతగిరికి చేరుకున్న నయని, విశాల్‌ – నయని అక్కడే చనిపోవాలని కోరుకున్న తిలొత్తమ్మ

Trinayani Serial Today September 26th: ‘త్రినయని’ సీరియల్‌: మణికాంతగిరికి చేరుకున్న నయని, విశాల్‌ – నయని అక్కడే చనిపోవాలని కోరుకున్న తిలొత్తమ్మ

trinayani serial today Episode:  విక్రాంత్‌ కోపంగా సుమనను తిడతాడు. నా బుర్ర తినకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు. దీంతో ఆ నేను ఆ తినడం దగ్గరకే వచ్చాను. అడవిలో ఏదైనా పెద్దపులి వచ్చి తమను తినబోతే గాయత్రి పాపు ఆ పులికి బలిచ్చి వాళ్లు తప్పించుకుంటారు. అంటుంది సుమన. దీంతో విక్రాంత్‌ ఇంత క్రూరమైన ఆలోచనలు నీకే వస్తాయి కదా? అంటాడు. దీంతో కోపంగా సుమన వెళ్లిపోతుంది.


నయని కావడి తయారు చేసుకుని అందులో  విశాల్‌ను గాయత్రి పాపను కూర్చోబెట్టుకుని భుజాలపై మోస్తూ తీసుకువెళ్తుంది. దారి మొత్తం అతి భయంకరంగా ఉంటుంది. చాలా దూరం వెళ్లాక గుడి కనిపిస్తుంది. దీంతో ఇదేనా మణికాంతగిరి అని శివ అడగ్గానే నయని అవునని చెప్తుంది. ఇంతలో గజగండ వెంటనే అక్కడ ప్రత్యక్షం అవుతాడు. విశాల్‌ షాక్ అవుతాడు. మీరు ఇక్కడకు వస్తారని నాకు తెలుసు నయని అంటాడు గజగండ. దీంతో నువ్వు రావడం కూడా మంచిదైంది. పంచకమణి ఇచ్చేస్తే తిరిగి అమ్మవారి సన్నిధిలో పెట్టేస్తాను అంటుంది నయని.

దీంతో నేను అంత అమాయకుణ్ని కాదు నయని అంటాడు గజగండ. దీంతో విశాల్‌ కోపంగా గజగండకు వార్నింగ్‌ ఇస్తాడు. పంచకమణి ఇస్తే మంచిదని చెప్తాడు విశాల్‌. అంతే కానీ మీరు లోపలికి వెళ్లి భుజంగమణిని తీసుకొచ్చి నాకు ఇస్తానని మాత్రం చెప్పరన్నమాట అంటాడు గజగండ. దీంతో శివ వీడెవడో పిచ్చి వాడిలా ఉన్నాడే అంటాడు. అవును పిచ్చి వాడే అమ్మవారి దగ్గర బలి అవ్వడానికి వచ్చాడు అంటుంది నయని.


దీంతో నీ భర్తకు నయం అయితే నా సంగతి తేల్చవచ్చు అనుకుంటున్నావేమో.. పంచకమణి ఇవ్వను. నువ్వు భుజంగమణి తీసుకురావడానికి కూడా లోపలికి వెళ్లనివ్వను అంటూ మంత్రం వేసి లోపలికి వెళ్లే దారిని కూల్చేస్తాడు గజగండ. దీంతో నయని, విశాల్‌ భయపడిపోతారు. ఇప్పుడెలా వెళ్తావు నయని. సూర్యోదయం లోపు మణిని తీసుకురాకపోతే మళ్లీ పౌర్ణమి వరకు ఆగాలి అంటూ గజగండ నవ్వుతుంటాడు. ఇంతలో పెద్ద నాగుపాము వస్తుంది. పామును చూసిన గజగండ భయపడతాడు. శివ పామును చూసి వెళ్లిపోతాడు. విశాల్‌ కూడా నయనిని పద వెళ్లిపోదాం అంటాడు. గజగండ వెనక్కి వెళ్లిపోతాడు.

నయని మాత్రం అక్కడే నిలబడిపోతుంది. విశాల్‌ వెళ్దాం పద అని ఎంత పిలిచినా నయని రానని అలాగే నిలబడుతుంది. ఇంతలో పాము దగ్గరకు వచ్చి పడగ విప్పి నిలబడుతుంది. దీంతో నయని ఏడుస్తూ తండ్రి నాగరాజ అంటూ వేడుకుంటుంది. నన్ను మాత్రమే బలి తీసుకుని నా భర్తను నా బిడ్డను వదిలేయండి స్వామి అంటుంది. విశాల్‌ మాత్రం నయని నువ్వు లేకుండా మేము ఎలా ఉంటాము. నీతో పాటే మేము అంటాడు.

దీంతో నయని మీరు వెళ్లిపోండి బాబుగారు అంటుంది.  నువ్వు లేకపోతే మేము ఉండలేము నయని అంటాడు. ఇంతలో నయని సంతోషంగా బాబుగారు అంటూ అఖండ సర్పం మనల్ని ఏమీ చేయడం లేదని.. అది మనకు వంతెనలా మారిందని చెప్తుంది. వెంటనే విశాల్‌, గాయత్రి పాపను కావడిలో కూర్చోబెట్టుకుని అవతలికి ఒడ్డుకు వెళ్తుంది నయని.

తిలొత్తమ్మ వెంట్రుకలు విరబోసుకుని మెట్లమీద కూర్చుని ఉంటుంది. వల్లభ వచ్చి చూసి భయపడతాడు. ఏంటి మమ్మీ కొరివి దెయ్యంలా అలా కూర్చున్నావు అని అడుగుతాడు. దీంతో ప్రశాంతంగా ఉందని చెప్తుంది. తిలొత్తమ్మ. ఇంట్లో నయని లేనందుకు ప్రశాంతంగా ఉందంటుది. దీంతో అదేంటి మమ్మీ పూటపూటకి తను చేసి పెట్టింది తిని ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటాడు వల్లభ.

తినడం గురించి కాదురా? తన మాట వినడం గురించి చెప్తున్నాను. నయని మాట శాసనంగా కఠినంగా ఉండేది. అది నాకు నచ్చేది కాదు అంటుంది తిలొత్తమ్మ. అయితే పెద్దమరదలు శాశ్వతంగా ఇక ఇంటికి రాకూడదని కోరుకుంటున్నావా? మమ్మీ అంటాడు వల్లభ. దీంతో వచ్చినా రాకపోయినా మనకే లాభం వల్లభ అంటుంది తిలొత్తమ్మ. దీంతో ఎలా మమ్మీ అంటూ ఆశ్యర్యంగా అడుగుతాడు వల్లభ. వస్తే భుజంగమణి వల్ల మనకు లాభం జరగుతుంది. ఒకవేళ రాకపోతే ఈ సామ్రాజ్యాన్ని మనమే పాలించవచ్చు అని చెప్తుంది. దీంతో వల్లభ నిజమే మమ్మీ అంటాడు. కానీ ఆసార నయని అంత ఈజీగా భుజంగమణి ఇస్తుందా? మమ్మీ అంటాడు వల్లభ.

మణికాంతగుడిలోకి వెళ్తుంది నయని. అక్కడి అమ్మవారికి నమస్కారం చేసుకుని తల్లీ నేతి దీపం వెలుగుల్లో దేదీప్యమానగా ఉంటావనుకున్నాను కానీ ఆ దీపం కొండెక్కేలా మినుకు మినుకు  అంటుంది. ఎందుకమ్మ అలా అని అడుగుతుంది. దీంతో అమ్మవారు నయని పంచకమణిని నువ్వు తీసుకుని వెళ్లినా.. సద్వినియోగం చేసుకోలేక దుర్మార్గుల చేతికి వెళ్లటంతో దీప కాంతి చివరకు వచ్చింది.

మళ్లీ వెలిగేలా చేయాలి. అప్పుడే నీకు భుజంగ మణి దొరుకుతుంది అని అమ్మవారు చెప్తారు. ఎలా రాయితో రాపిడి చేసి నిప్పురవ్వలు రగిలించాలా? అని నయని అడగ్గానే ఈసారి అలాంటి అవకాశం లేదు నయని అంటుంది అమ్మవారు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big Stories

×